బాలకృష్ణ హోస్ట్‌గా సూపర్ హిట్ అయిన అన్‌స్టాపబుల్ షోకు సంబంధించిన ప్రోమోను శనివారం విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30వ తేదీన ప్రీమియర్ కానుంది. ఇందులో కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలను కూడా షేర్ చేశారు. ‘ఇక నన్ను కూడా డార్లింగ్ అనే పిలవాలి’ అని ప్రభాస్‌ను బాలకృష్ణ కోరారు. దానికి ప్రభాస్ ‘అలాగే డార్లింగ్ సార్’ అని రిప్లై ఇచ్చారు.
‘శర్వానంద్ పెళ్లి ఎప్పుడు నీ పెళ్లి తర్వాతనే అన్నాడు.’ అని బాలకృష్ణ అంటే... ‘ఇక నా పెళ్లి గురించి అడిగితే సల్మాన్ ఖాన్ తర్వాతే అనాలేమో.’ అని ప్రభాస్ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. మధ్యలో రామ్ చరణ్‌కు కూడా కాల్ చేశారు. బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ కామెడీ టైమింగ్ మళ్లీ ఈ గ్లింప్స్‌లో కనిపించింది. చివర్లో ‘ఏవండీ... ఒక పాట పాడండి.’ అంటూ ఈ ప్రోమోను ముగించారు.
ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఇప్పటివరకు రెండు గ్లింప్స్‌లు ఇప్పటికే వచ్చాయి. ప్రభాస్, గోపిచంద్ ఇద్దరికీ సంబంధించిన చిన్న గ్లింప్స్‌లను ఇప్పటికే విడుదల చేశారు. ఈ సీజన్ అన్‌స్టాపబుల్‌లో ఇప్పటివరకు వచ్చిన క్రేజీ ఎపిసోడ్లలో ఇది కూడా ఒకటి.
త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కూడా ఒక ఎపిసోడ్‌కు రానున్నట్లు తెలుస్తోంది. దీన్ని ‘ఆహా’, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ ఇప్పటికే టీజ్ చేశారు. 27వ తేదీన ఈ ఎపిసోడ్ షూట్ జరిగే అవకాశం ఉంది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌కు ఏపీ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ వచ్చారు. ఆ తర్వాత ఎపిసోడ్లకు అడివి శేష్, శర్వానంద్ ఒక ఎపిసోడ్‌కు, విష్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ ఒక ఎపిసోడ్‌కు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాధిక ఒక ఎపిసోడ్‌కు విచ్చేశారు.
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సంక్రాంతి సందర్బంగా జనవరి 13వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ తర్వాతి సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ సినిమాకు ‘బ్రో ఐ డోంట్ కేర్’ అనే టైటిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇక ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కే’, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, మారుతి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్నాయి. ‘ఆదిపురుష్’ కూడా వచ్చే సంవత్సరం విడుదల కానుంది. గోపీచంద్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.