Illu Illalu Pillalu Serial August 4th to 9th Weekly Episode నర్మద, ప్రేమలు శ్రీవల్లి తల్లిదండ్రులు భాగ్యం, ఆనంద్‌ని అనుమానించి వాళ్లని ఫాలో అవుతారు.  మోసం చేసి చందు బావగారికి ఆ వల్లిని ఇచ్చిన పెళ్లి చేశారు. వీళ్లు గుట్టు రట్టు చేయాలి అనుకొని ఫాలో అవుతారు. ఆ టైంలో భాగ్యం బండి అద్దంలో నర్మద, ప్రేమలు ఫాలో అవ్వడం చూసేసి ఇద్దరికీ కనిపించకుండా పారిపోతారు. నర్మద అంతు చూడాలని భాగ్యం అనుకుంటుంది. 

చందు పది లక్షల గురించి ఆలోచిస్తూ ఓ షాప్ ముందు దిగులుగా కూర్చొని ఆ డబ్బు విషయంలో నాన్న ముందు దోషిగా నిల్చొడం కంటే ప్రాణాలు తీసుకోవడమే బెటర్‌ అని అనుకుంటాడు. ధీరజ్, సాగర్ అన్నతో మాట్లాడి ఏమైనా సమస్య ఉంటే చెప్పమని అడుగుతారు. చందు ఏం లేదురా ఏమైనా ఉంటే మీకు చెప్పనా  అనేసి వెళ్లిపోతాడు. సాగర్, ధీరజ్‌లు చందు ఏదో దాస్తున్నాడు అది తెలుసుకోవాలని అనుకుంటారు. ఇద్దరూ నర్మద, ప్రేమలు చుక్కలు చూపిస్తున్నారని అనుకుంటారు. ప్రేమ అయితే ధీరజ్‌కి చుక్కలు చూపిస్తుంది. సైకిల్ మీద పెట్టుకొని తోసుకుంటూ తీసుకెళ్లమని టార్చర్ చేస్తుంది. నర్మద కూడా సాగర్ దగ్గర్వవాలని చూస్తే చేయి కాల్చేయడం ఇలాంటి చిన్ని చిన్ని పనులు చేసి సాగర్‌ని ఏడిపిస్తుంది.   

శ్రీవల్లి పుట్టింటికి వెళ్లి దొంగ చెక్ గురించి చెప్తుంది. ఒక వైపు నర్మద మన బండారం బయట పెట్టాలని ప్రయత్నిస్తుంది.. మరోవైపు ఈ పది లక్షల టెన్షన్.. రేపో మాపో నా భర్త ఇక్కడికి వచ్చేస్తాడు.. మన బాగోతం తెలిసిపోతుంది. నా కాపురం కూలిపోతుంది అని ప్రేమ ఏడుస్తుంది. నట్టింట్లో కూర్చొని పది లక్షలు ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తా లేదంటే మీ ఇద్దరూ నన్ను ఎందులోనే తోసేసి చంపేయండి అని వల్లి ఏడుస్తుంది. దానికి భాగ్యం ఏంటో అమ్మడు మన తలరాతలు దరిద్రంగా తగలడ్డాయి. నీకు ఇంటి పెత్తనం బీరువా తాళాలు వచ్చిన తర్వాత కూడా మన బతుకులు ఇలాగే ఉన్నాయని అంటుంది. ఏం చేయాలా అని ముగ్గురూ ఆలోచించుకుంటూ పది లక్షల టెన్షన్‌ పోవాలి అంటే రామరాజు ఇంట్లో దొంగతనం చేస్తానని ఆనంద్‌రావు అంటాడు. పది లక్షలు తేవడం మన వల్ల కాని పని.. రేపు ఒక్క రోజే గడువు మనం రేపటిలో పది లక్షలు ఇవ్వకపోతే నీ కాపురం రోడ్డున పడుతుంది. అందుకే నేను దొంగలా మీ ఇంటికి వస్తాను నువ్వు నాకు తాళాలు ఇచ్చేయ్ నేను పది లక్షలు తీసుకుంటా ఇదే అద్భుతమైన ఐడియా ఇంకే మాట్లాడకు అని ఆనంద్ రావు అంటాడు.

వేదవతిని రామరాజు దూరం పెడుతూ ఉంటాడు. కనీసం తిండి పెట్టినా తినడానికి ఇష్టపడడు. నర్మద, ప్రేమలు వేదవతి ఏడుపు చూసి చాలా బాధ పడతారు. ఎలా అయినా ఇద్దర్ని కలపాలి అనుకుంటారు. అందుకు వేదవతి, రామరాజు లవ్‌ స్టోరీ అందరి ముందు అడిగితే ఆ స్టోరీ తిరుపతి చెప్తాడు. ఇద్దరూ ఎమోషనల్ అయిపోతారు. కోటలో యువరాణి తన కోసం దిగొచ్చిందని రామరాజు చాలా బాధ పడతాడు. ఆనంద్ రావు దొంగతనానికి వస్తాడు. శ్రీవల్లి డోర్ తీయడం ధీరజ్ చూసి ప్రశ్నించడంతో కవర్ చేస్తుంది. తర్వాత ఆనంద్ రావు లోపలికి రావడంతో నర్మద చూసి దొంగ దొంగ అని అరుస్తుంది. ఇంటిళ్లపాది వెతుకుతారు. ఆనంద్‌రావు భయంతో భద్రావతి ఇంట్లో దూరుతాడు. భద్రావతి వాళ్లాంతా చూసి వేదవతి వియ్యంకుడు అని గుర్తించి రామరాజు పరువు తీయాలని అనుకుంటారు. రామరాజు ఇంటికి వచ్చి నానా హంగామా చేస్తారు. నీ వియ్యంకుడి పరిస్థితి ఇది అని అవమానిస్తారు. తండ్రి దొరికిపోయాడని వల్లి అనుకున్న టైంలోభాగ్యం వచ్చి శ్రీవల్లి పుట్టిన రోజు అని తన భర్త వచ్చాడని డ్రామా మొదలు పెట్టి అందర్ని చెదరగొట్టేస్తుంది. భాగ్యం ప్రవర్తన మీద నర్మదకు అనుమానం వస్తుంది. ఇది ఈ వారం జరిగింది.