Ammayi garu Serial August 18th to 22nd Weekly Episode ఈ వారం మొత్తం రూప, రాజులు కోమలి, విజయాంబికలకు చుక్కలు చూపించారు. ఎపిసోడ్స్ అన్నీ చాలా ఆసక్తికరంగా సాగాయి. వారం మొత్తం ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
విజయాంబిక, దీపక్‌లు విరూపాక్షి దగ్గర ఉన్న చంద్ర డబ్బు దొంగతనం చేసి విరూపాక్షిని ఇరికించాలని ప్లాన్ చేయడం మందారం వినేస్తుంది. వెంటనే తన వాళ్లకి విషయం చెప్తుంది. అందరూ విజయాంబికతో ఓ ఆట ఆడుకోవాలని అనుకుంటారు. విజయాంబిక విరూపాక్షి గదిలోకి రాత్రి దొంగతనానికి వెళ్తుంది. విరూపాక్షి గమనించి విజయాంబిక అయిపోయావే చెప్తా నీ సంగతి అని అనుకుంటుంది. విజయాంబిక డబ్బులు కోసం బీరువా తాళం ఉన్న బాక్స్‌లో చేయి పెట్టగానే తేలు కుడుతుంది. విజయాంబిక కెవ్వుమంటుంది ఆ కేకలకు అందరూ విరూపాక్షి గదిలోకి చేరుకుంటారు. విరూపాక్షి విజయాంబికతో ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తాన్నావ్ దొంగతనం చేయడానికి వచ్చావా అని అడుగుతుంది. రూప వాళ్లు నవ్వుకుంటారు.
విజయాంబిక ముందు తనని హాస్పిటల్‌కి తీసుకెళ్లమని అంటుంది. నేను ఒప్పుకోను నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు అని విరూపాక్షి అంటుంది. సూర్యప్రతాప్ కూడా ఈ టైంలో నీకు ఏం పని దొంగతనానికి వచ్చావా అని అడుగుతాడు. రూప కూడా అత్త గదిలోకి వచ్చినా బీరువా తాళాలు ఉన్న బాక్స్‌లో చేయి పెట్టాల్సిన అవసరం ఏముంది అని మొత్తానికి అందరూ విజయాంబికను ఇరికించేస్తారు. ఇక డాక్టర్ విజయాంబికను చూసి మందులు ఇచ్చి కొన్ని జాగ్రత్తలు చెప్తాడు. మేం చూసుకుంటామని రుక్మిణి సూర్యప్రతాప్‌తో చెప్తుంది. రుక్మిణి విజయాంబికకు చుక్కలు చూపిస్తుంది. ట్రీట్మెంట్ అంటూ రాత్రంతా పడుకోకూడదని చెప్పి వేడి నీటిలో కాలు పెట్టించడం.. చేయి కాల్చేయడం లాంటివి చేసి చుక్కలు చూపిస్తుంది. చివరకు విరేచనాల మందులు ఇచ్చి బాత్‌రూమ్‌కి పరుగులు పెట్టిస్తుంది రూప. ఈ టార్చర్ నా వల్ల కాదు అని విజయాంబిక అనుకుంటుంది.
కోమలి రూపతో మా అత్తని నేను చూసుకుంటా నువ్వు వెళ్లు అంటుంది. కోమలితో రూప ఏదైనా క్యారెక్టర్‌లోకి దిగితే పూర్తిగా నిమగ్నం అయిపోవాలి. రూప క్యారెక్టర్‌కి ఈ అత్తకి అస్సలు పడదు. నువ్వు సేవలు చేయడం నాయన చూస్తే నువ్వు దొరికిపోతావ్.. కాబట్టి నువ్వు ఒక మూల పడుంటే మంచిది అని స్వీట్ వార్నింగ్ ఇస్తుంది. ఎందుకొచ్చిన గొడవ అని కోమలి వెళ్లిపోతుంది. అసలైన రూపని ఓడించాలని కోమలి బంటీ కోసం రూప తెచ్చిన డ్రస్ కాల్చేయాలని రూప గదిలోకి వెళ్లి డ్రస్ దొంగతనం చేసి ఎవరూ చూడకుండా కాల్చేస్తుంది. ఇక ఉదయం బంటీ దగ్గరకు రూప, రాజులు వచ్చి నిద్ర లేపి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తారు. బంటీ ఇద్దరినీ హగ్ చేసుకొని థ్యాంక్యూ అమ్మ థ్యాంక్యూ నాన్న అంటాడు. తర్వాత విరూపాక్షి విష్ చేస్తుంది. మందారం కూడా చెప్తుంది. సూర్యప్రతాప్ కూడా విష్ చేస్తాడు. ఇక కోమలి వచ్చి ఆ ఇద్దరి కంటే ముందు నేను విష్ చేయాలి అనుకున్నా చేయలేకపోయా సూర్యప్రతాప్‌కి నా మీద అనుమానం వస్తుందేమో అని అనుకుంటుంది. లోపలికి వెళ్లాలా వద్దా అనుకుంటూ ఒక్కదాన్నే వెళ్తే కష్టమని దీపక్, విజయాంబికలు తోడు ఉంటే బెటర్ అని వెళ్లి విజయాంబికను నిద్ర లేపుతుంది. విజయాంబికను వెంట తెచ్చుకుంటుంది. సూర్య కోమలితో అమ్మా రూప బంటీ కోసం బట్టలు తీసుకొచ్చారు కదా ఇవ్వు అని అంటాడు. కోమలి తీసుకొచ్చి ఇస్తుంది. తాను సెలక్ట్ చేసిన బట్టలే బంటీ వేసుకుంటాని అనుకున్న కోమలికి పెద్ద షాక్ తగులుతుంది. బంటీకి ఇచ్చిన బట్టల్లో రూప సెలక్ట్ చేసిన బట్టలు ఉండటం చూసి కోమలి, విజయాంబిక షాక్ అయిపోతారు.
సూర్యప్రతాప్ కోమలితో డ్రస్ అదిరిపోయింది రూప.. అయినా కన్న బిడ్డకి ఎలాంటి డ్రస్ బాగుంటుందో కన్న తల్లి కంటే ఇంకెవరికి తెలుస్తుంది అని అంటాడు. అసలైన రూప కోమలిని చూసి వెటకారంగా కన్ను ఎగరేస్తుంది. కోమలి దగ్గరకు రూప, రాజులు వెళ్లి కోమలి ముఖం మీద చిటెకలు వేసి ఏంటి నువ్వు తెచ్చిన కవర్‌లో నేను తెచ్చిన బట్టలు ఉన్నాయేంటి అని షాక్ అవుతున్నావా! దొంగతనంగా నేను తెచ్చిన బట్టలు బయట పడేస్తావా.. నీది ఇలాంటి నీచమైన బుద్ధి అని తెలిసే నువ్వు తెచ్చిన బట్టల ప్లేస్‌లో నేను తెచ్చిన బట్టలు పెట్టేశా అని చెప్తుంది. విజయాంబిక, కోమలి బిత్తరపోతుంది.
డ్రస్ ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో కోమలి తాను తెచ్చిన కేక్ కట్ చేయిస్తానని మళ్లీ అంటుంది. ఆల్‌ది బెస్ట్ చెప్పి రూప వెళ్లిపోతుంది. విజయాంబిక కోమలితో వాళ్లని దెబ్బ కొట్టడం అంత ఈజీ కాదు అని అంటుంది. ఇక రూప, రాజులు 50 లక్షల డబ్బును చంద్రకు అప్పగిస్తారు. అది కోమలి చూస్తుంది. తన లవర్ అశోక్‌కి కాల్ చేసి డబ్బు గురించి చెప్పి దొంగతనానికి పిలుస్తుంది. కోమలి అశోక్‌తో మాట్లాడటం మొత్తం విజయాంబిక వినేసి దొంగతనం మా వల్లే కాలేదు మీ వల్ల కాదు వద్దు అని సలహా ఇస్తుంది. మీ వల్ల కాలేదు అనే కదా నన్ను తెచ్చారు ఇప్పుడు కూడా నేను దొంగతనం చేస్తా మీరు చూస్తూ ఉండండి అంటుంది. విజయాంబిక కోమలి మీద ఓ కన్నేసి ఉంచాలని అనుకుంటుంది. భర్త్‌డేకి కోమలి చెప్పినట్లు అశోక్ బేరర్ వేషంలో వస్తాడు. కోమలి సీక్రెట్‌గా డబ్బు ఉన్న చంద్ర గది చూపిస్తుంది. ఇక కోమలి కేక్ తీసుకొచ్చి పెట్టబోతే రూప కాలు అడ్డంగా పెడుతుంది. కోమలి కేక్ మీద బొక్కాబొర్ల పడుతుంది. అందరూ నవ్వుతారు. కోమలి ఉడికిపోతుంది. ఇక రూప తాను ఆర్డర్ చేసిన కేక్ తీసుకొస్తుంది. ముఖం కడుక్కోవడానికి వెళ్లిన కోమలి రాకుండానే రాజు, రూపలు భర్త్‌డే వేడుక జరిగేలా చేస్తారు.
అశోక్ చంద్ర గదికి వెళ్లడం రాజు చూసి ఆపుతాడు. అప్పుడే రాజుకి అనుమానం వస్తుంది. ఇక పార్టీకి వచ్చిన బేరర్‌లు ఇద్దరే అని తెలుసుకొని ఈ మూడోవాడు ఎవడా అని రాజు ఎంక్వైరీ చేస్తాడు. ఈ టైంలోనే అశోక్ చంద్ర గదిలోకి దూరి డబ్బు తీసుకెళ్తున్న టైంకి రాజు ఎంట్రీ ఇస్తాడు. రేయ్ ఎవడ్రా నువ్వు అని రాజు దగ్గరకు వెళ్తాడు. అశోక్ పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. రాజు డబ్బుల బ్యాగ్ పట్టుకొని లాగేస్తాడు. అశోక్‌ని ఒక్కటి తన్ని అతన్ని పట్టుకొని మాస్క్ తీసే టైంకి అశోక్ రాజుని తోసేసి పారిపోతాడు.
అశోక్ పారిపోవడం కోమలితో పాటు అందరూ చూస్తారు. ఎటు వెళ్లాలో తెలియక అశోక్ కిటీకి నుంచి దూకి పారిపోతాడు. కోమలి చాలా టెన్షన్ పడుతుంది. రాజు పరుగులు చూసి అందరూ ఏమైందా అని షాక్ అయి చూస్తారు. సూర్యప్రతాప్ రాజుతో ఏమైంది రాజు అని అడిగితే ఎవరో దొంగ పెద్దయ్య మన ఇంట్లోకి దూరి చిన్నయ్యగారి గదిలో డబ్బు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడని చెప్పి రాజు పరుగులు తీస్తాడు. రాజు అశోక్‌ని పట్టుకొని ఎవరు పంపారురా నిన్ను చెప్పురా అని కొడతాడు. నీ సంగతి మా పెద్దయ్యగారి ముందే తేల్చుతా అని తీసుకొస్తుంటే దీపక్ రాజు ముఖాన మట్టి కొట్టి అశోక్‌ని తప్పిస్తాడు. రాజు దీపక్‌తో ఇదంతా నీ పని అని తెలుసు..వాడిని వాడి వెనక ఉన్న వారిని వదలను అని వార్నింగ్ ఇస్తాడు.
సూర్యప్రతాప్ ఇంట్లో అందరితో పట్టపగలు మన ఇంటికి దొంగ రావడం ఏంటి రాజు వెళ్లాడు కదమ్మా వాడిని తీసుకొస్తాడు. ఎలాంటి పరిస్థితిలో వాడిని వదలడు. నేను వాడి వెనక ఎవరు ఉన్నా వాళ్ల సంగతి తేల్చుతా వాళ్లని వదలను అని అంటాడు. కోమలి చాలా భయపడుతుంది. దీపక్ అశోక్‌తో కోట్లు వస్తే లక్షల కోసం ఆశపడతావేంట్రా.. ఆ రాజు కంట పడితే నీ పరిస్థితి దారుణంగా ఉంటుందని అంటాడు. ఇక అశోక్ దీపక్‌తో నువ్వు కూడా కోమలికి దూరంగా ఉండు పిచ్చి వేషాలు వేస్తే నీ పరిస్థితి దారుణంగా ఉంటుందని అంటాడు. దీపక్ మనసులు వీడు కూడా నీకు వార్నింగ్ ఇచ్చేస్తున్నాడని అనుకుంటాడు. రాజు ఇంటికి వెళ్లి వాడు తప్పించుకున్నాడని పట్టపగలు ఇంట్లోకి వచ్చాడంటే కచ్చితంగా ఇంట్లో వాళ్లే వాడికి సపోర్ట్ చేసుంటారు. లేకపోతే ఈ ఇంట్లో డబ్బు ఎక్కడ ఉందో ఎలా రావాలో ఎలా బయటకు వెళ్లాలో బయట వాళ్లకి ఎలా తెలుస్తుంది అని రాజు అంటాడు.
రుక్మిణి వచ్చి రాత్రి కూడా అత్త దొంగతనం చేయాలని ప్రయత్నించింది కదా ఇప్పుడు కూడా అత్తే చేయించొచ్చు కదా అంటుంది. దానికి విజయాంబిక నేనేం చేయించలేదు రాత్రి కూడా దొంగ వచ్చినట్లు అనిపించి వెళ్లాను.. రాత్రి వచ్చిన వాడే ఇప్పుడు వచ్చుంటాడని అంటుంది. సూర్యప్రతాప్ కోపంగా అసలు ఇక్కడే జరుగుతుంది. ఇంట్లో వాళ్లు సాయం చేయకపోతే వాడికి ఎలా తెలుస్తుంది. మర్యాదగా తప్పు చేసిన వాళ్లు ఒప్పుకోండి లేదంటే నా చేతిలో చచ్చిపోతారని అంటాడు. కోమలి చాలా భయపడుతుంది. సూర్యప్రతాప్ రాజు, రుక్మిణిలను వెళ్లి సీసీ కెమెరాలు చెక్ చేయమని అంటాడు. ఇవీ ఈ వారం హైలెట్స్.