Trinayani September 11th Written Update: పూజ అయిపోయిన తర్వాత విశాలాక్షి పూజ బాగా జరిగింది అని తను సంతృప్తి చెందగా ఏవైనా వరం కోరుకోండి అని అడుగుతుంది.

నయని: మీ చల్లని చూపు చాలు తల్లి.

డమ్మక్క: అలా అమ్మవారు అడిగితే వద్దు అని చెప్పకూడదు.

హాసిని: అయితే నేను అడుగుతాను. విశాల్ తిరిగి మామూలు స్థితికి రావాలంటే ఏం చేయాలి తల్లి?

విక్రాంత్: నీ గురించి కాకుండా వదిన సౌభాగ్యం గురించి ఆలోచించావ్ చూడు నువ్వు గ్రేట్.

హాసిని: నయని బాగుంటే ఇల్లు బాగుంటుంది.

విశాలాక్షి: నాగయ్య కి దారి తెలుసు. తనని అనుసరించి వెళ్తే ఇష్టనాపురం దగ్గర నవజీవన జలం ఉంటుంది. దాన్ని జల్లితే విశాల్ మామూలు స్థితికి వస్తాడు. ఇంక నేను వెళ్తాను చాలా పూజలు ఉన్నాయి. అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

లలిత: నువ్వే అమ్మవారివి అని రహస్యంగా ఉంచమన్నావు. అందుకే నేను మౌనంగా ఉన్నాను. ఇంక నా జీవితం ధన్యమైపోయింది అని మనసులో అనుకుంటుంది.

ఆ తర్వాత సీన్లో సుమన మెడ మీద డబ్బాతో పౌడర్ రాసుకుంటూ ఉండగా పక్కనే ఉన్న పాప మీద పౌడర్ పడుతుంది. అప్పుడే అక్కడికి విక్రాత్ వస్తాడు.

విక్రాంత్: అసలు ఏం చేస్తున్నావు? పాప మీద పౌడర్ పడుతుంది కళ్ళు కనిపించట్లేదా?

సుమన: పడింది పౌడర్ ఏగా అదేదో కంట్లో కారం పడినట్టు అంటారు ఏంటి. అని అనగా విశాల్ సుమన ని పక్కకి తోసి పాప మీద ఉన్న పౌడర్ ను తుడుస్తాడు.

సుమన: పేగు బంధం కాదు అంటారు కానీ పాపంటే మీకు కూడా ఇష్టమే.

విక్రాంత్: అది నా పేగు బంధం వలన కాదు. తన మీద పెద్ద వాళ్ళు వాడే పౌడర్ పడిందని రియాక్ట్ అయ్యాను అంతే. అయినా చేతులో గుప్పెడు పౌడర్ తీసుకొని రాసుకోకుండా డబ్బాలు డబ్బాలు ఎందుకు రాస్తున్నావు?

సుమన: ఇందాక చూశారు కదా పాము నా మెడకి వచ్చి చుట్టుకుంది. చూసిన మీకే అంతలా ఉంటే నాకు ఎంత ఎలర్జీగా ఉంటుంది?

విక్రాంత్: మెడలో చుట్టుకున్నందుకే అలాగా అయిపోతున్నావు. 9 నెలలు పాముని మోసి కన్నావు అంటే ఏమైపోతావో అని మనసులో అనుకుంటాడు.

సుమన: అయినా మీకు నేను చేసినవన్నీ తప్పు మా అక్క చేసినవన్నీ ఒప్పు. తన దగ్గర ఆస్తి ఉంది కదా అందుకే.

విక్రాంత్: మానవత్వం, జాలి గల మనసు ఉంటే పేదరికంలో కూడా ఆనందంగా గడపవచ్చు. అయినా పాప పుట్టి ఇన్ని రోజులైనా తల్లిపాలు ఇవ్వలేని నీకు ఇది చెప్పినా అర్థం కాదు.

సుమన: ఒకసారి ఇచ్చాను దాన్ని కూడా మా అక్క కాజేసింది అది కూడా మీకు గుర్తు ఉన్నట్టుంది?

విక్రాంత్: నీతో మాట్లాడి అనవసరం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత సీన్ లో పాపని పట్టుకుని సుమన విశాల్ దగ్గరకు వస్తుంది.

సుమన: బావగారు లోపలికి రావచ్చా?

విశాల్: నన్ను బావగారు అన్నావంటే నేనే విశాల్ ని అని నమ్ముతున్నావు కదా కమ్ ఇన్ అనగా సుమన పాపను తీసుకుని లోపలికి వచ్చి విశాల్ కళ్ళముందు పాపని పెడుతుంది. గది బయట నుంచి ఈ సంభాషణ అంతా వల్లభ, తిలోత్తమలు వింటారు.

విశాల్: పాపని ఎందుకు నా కళ్ళ ముందు పెట్టావు?

సుమన: నయని అక్క మనసు ఎలాగో కరగదు పాపని చూసి మీ మనసైన కరుగుతుందేమో అని పెట్టాను.

విశాల్: పిల్లల్ని చూస్తే ఎవరి మనసైనా కరుగుతుంది. అసలు నీకు ఏం కష్టం వచ్చింది?

సుమన: నా ఆస్తి వాటా నాకు ఇంకా రాలేదు. పాపని కన్నాను నాకు ఇవ్వాల్సింది ఏదో ఇస్తే బాగుంటుంది కదా బావగారు.

విశాల్: సరే. కాకపోతే నయని ని కూడా అడిగి ఇస్తాను.

సుమన: మొన్న నయని అక్క అడిగితే ఇప్పుడు అప్పుడే ఆస్తి వద్దు అని చెప్పాను. అక్క మళ్ళీ అదే అంటుంది అందుకే నయని అక్క లేకుండా మీరే సంతకం పెట్టేయండి.

విశాల్: అలాగంటే నా వేలిముద్ర, నా సంతకం సరిపోతాయి. కానీ నయని లేకుండా నేను చెయ్యను. నేను కేవలం సంతకం పెడతాను నయని ని కనుక్కొని తన సంతకం కూడా వేయిస్తాను. అని అంటాడు. ఇంతలో తిలోత్తమ, వల్లభలు లోపలికి వస్తారు.

తిలోత్తమ: నీ మరదలు మీద కూడా నీకు నమ్మకం లేదా?

విశాల్: అలాగని కాదు నయనికి కూడా ఒక మాట చెబుదామని. సరేలెండి ఆ పేపర్స్ ఇవ్వండి సంతకం చేస్తాను అని పేపర్స్ తీసుకొని సంతకం పెడతాడు. ఇంతలో వెనుక నుంచి తిలోత్తమ, విశాల్ కి ఏదో ఇంజక్షన్ ఇస్తుంది.

తిలోత్తమ: ఇప్పుడు కొంచెం సేపు నువ్వు మత్తులోకి వెళ్ళిపోతావు ఈ లోపల మేము వేలిముద్రలు తీసేసుకుంటాము అని మనసులో అనుకుంటుంది.

 సరే అయితే మేము వెళ్లి వస్తాము అని ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో విశాల్ కి మత్తుగా అనిపిస్తుంది.

విశాల్: నాకెందుకో మత్తుగా అనిపిస్తుంది. వాళ్ళు నాకు ఏదో చేశారు నేను వెంటనే నయని ని కలిసి ఈ విషయం చెప్పాలి. నేను నా అసలు రూపంలోకి వెళ్లాలి అని చెప్పి విభూదిని తన నుదుటిన రాసుకొని అలా మంచం మీద పడిపోతాడు విశాల్. ఇంతలో ముగ్గురు తిరిగి రాగా, వల్లభ ఆ పేపర్స్ మీద విశాల్ వెలి ముద్రలను వేయించి సుమనకి ఇస్తాడు. 

తిలోత్తమ: ఇంక నీకు నయని సంతకం అవసరం లేకుండా కోర్టులో నీ ఆస్తి నీకు వచ్చేలా చేయొచ్చు. అని అంటుంది. తర్వాత ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మెట్లు దిగి కిందకు వెళ్దాం అంటే అక్కడ హాసిని దురంధరలతో కలిసి పాత ఆటల గురించి చర్చలు చేస్తూ ఉంటుంది.

వల్లభ: కింద హాసిని వాళ్ళు ఉన్నారు వెనుక డోర్ నుంచి వెళ్దాము.

సుమన: వెనక డోర్ రిపేర్ లో ఉంది. చచ్చినట్టు ఇదే దారిలో వెళ్లాలి.

తిలోత్తమ: అయితే ముందు మేమిద్దరం వెళ్తాము మా వెనుక నుంచి నువ్వు వెళ్ళిపో ఎవరికీ కనిపించవు.

సుమన: ఈ ఐడియా ఏదో బాగుంది.

తిలోత్తమ: ఆగు అక్కడికి నయిని వాళ్లు కూడా వస్తున్నారు.

సుమన: అబ్బా అక్క రాకముందే వెళ్ళిపోదాం అనుకున్నాను.

తిలోత్తమ: పర్లేదు విశాల్ రాలేదు కదా ఇంకా. అని అంటుంది. మరోవైపు కింద నయని విక్రాంత్ లు అందరూ హాసిని దగ్గరకు వెళ్తారు. అక్కడ హాసిని వాళ్ళకి ఆట ఎలా ఆడాలో చెప్తుంది. ఇలా వీళ్లు మాట్లాడుతున్నప్పుడు అక్కడికి వల్లభ, తిలోత్తములు వస్తారు.

మరోవైపు విశాల్ తన అసలు రూపంలో బయటకు వచ్చి పైనుంచి తాడు కట్టి కిందకి రావడానికి చూస్తాడు. ఇటువైపు హాసిని వాళ్ళు దీర్ఘ సంభాషణలు ఉండగా తిలోత్తమ సుమనని కిందకి నుంచి వెళ్ళిపోమని సైగ చేస్తుంది. సుమన వెనుక నుంచి వెళ్ళిపోతూ ఉండగా గాయని సుమనను చూస్తుంది.

Also Read: Brahmamudi September 11th: సీతారామయ్య కోరిక విని షాకైన తల్లీకొడుకులు- భర్త ప్రేమకి పొంగిపోయిన కావ్య