Intiki Deepam Illalu: బుల్లితెరపై సీరియల్స్ హవా ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలావరకు ప్రేక్షకులంతా బుల్లితెరపైనే క్రేజ్ చూపిస్తున్నారు. మధ్యాహ్నం రాత్రి వరకు ప్రసారమయ్యే అన్ని సీరియల్స్ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సీరియల్ దర్శకులు కూడా ప్రేక్షకులన్ని దృష్టిలో పెట్టుకొని.. వారి ఆలోచన విధానాలకు తగ్గట్టుగా సీరియల్స్ చేస్తున్నారు. ఇక కొన్ని సీరియల్స్ వర్తమానంలో ఉన్నట్లు కనిపిస్తే మరికొన్ని సీరియల్స్ వెనక్కు ఉంటాయి. కానీ మరికొన్ని సీరియల్స్ మాత్రం భవిష్యత్తును కూడా వర్తమానంగా చూపిస్తూ ఉంటాయి.


ఒక రెండు రోజుల ముందును ఇప్పుడు చూపిస్తే పర్వాలేదు కానీ.. కొన్ని సీరియల్స్ మాత్రం ఏకంగా మరో నెల రోజుల్లో జరిగే సన్నివేశాలను చూపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కొన్ని రోజులు ముందుగానే ఉన్నట్లు చూపిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు అంత తొందరగా కథను నడిపిస్తే ప్రేక్షకులు కూడా చూసి ఎంజాయ్ చేయలేరు. కానీ కొంతమంది దర్శకులు కథను చాలా స్పీడ్ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు.


ఇక వాళ్ళు అలా కథను ముందుకు తీసుకెళ్లడానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయని చెప్పాలి. రేటింగ్ తక్కువ రావడం అనేది ముఖ్య కారణం అని చెప్పాలి. ప్రేక్షకులు చూడకపోయేసరికి రేటింగ్ తక్కువ కావడంతో.. కొన్ని రోజులలో జరిగే సంఘటన ముందుగానే చూపిస్తూ బాగా ఊరిస్తూ ఉంటారు. లేదా వెంటనే ప్రసారం చేస్తూ ఉంటారు. అయితే ఒక సీరియల్ పరిస్థితి ఇప్పుడు అలాగే మారిందని చెప్పాలి.


మరో నెల రోజుల్లో రాబోతున్న వినాయక చవితి పండుగను ఓ సీరియల్‌లో ముందే చూపించారు. ఇంతకు ఆ సీరియల్ ఏదో కాదు.. స్టార్ మా లో ప్రసారమవుతున్న ‘ఇంటికి దీపం ఇల్లాలు’. తాజాగా ఈ సీరియల్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఇక అందులో అప్పుడే వినాయకుడి పండుగ వచ్చేసింది. దీంతో అందులో ఉన్న కుటుంబ సభ్యులంతా వినాయకుడి విగ్రహం ముందు ఘనంగా పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ కనిపించారు.


ఇక అందులో ఒక రౌడీ వచ్చి ఒక వ్యక్తిని పొడవడంతో కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు. అయితే అక్కడ విషయం ఏంటంటే.. వినాయక చవితి హడావుడిలో అతడికి ప్రమాదం జరిగింది అన్నట్లుగా చూపించారు. దీంతో ఆ ప్రోమో చూసిన వాళ్లంతా బాగా ట్రోల్స్ చేస్తున్నారు. ఏంట్రా బాబు.. ఇంకా వినాయక చవితి రాలేదు.. మరి ఇంత సింక్ లేకుండా ఎలా ఉన్నారు ఏంటి అంటూ తలలు పట్టుకుంటున్నారు.


అసలు ఇదేక్కడి తొందరపాటు అని ట్రోల్స్ చేస్తున్నారు. దయచేసి కాస్త వెనక్కి రండి ఇలా చేస్తే సీరియల్ చూడటానికి కూడా ఇంట్రెస్ట్ రాదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఒక్కొక్కరు ఆ సీరియల్ డైరెక్టర్ ను ఒక్కొక్కలాగా ట్రోల్ చేసి పడేస్తున్నారు. మరి ప్రేక్షకుల ట్రోల్స్ కి డైరెక్టర్ ముందు ముందు అయినా జాగ్రత్త పడతాడో లేదో చూడాలి.



also read : Trinayani August 21st - 'త్రినయని' సీరియల్: బలవంతంగా కొత్తిమీర వాసన పిలుచుకొని రక్తం కంటచూసిన సుమన.. క్రూరమైన ప్లాన్ చేసిన తిలోత్తమా?