Trinayani Serial Today Episode త్రినేత్రి మీదకు తిలోత్తమ గన్ గురి పెడుతుంది. నువ్వు ఎవరు అని అడిగితే త్రినేత్రి అనే చెప్తుంది. ఇంతలో గాయత్రీ పాప తిలోత్తమ మీదకు ప్లాస్టిక్ పూల కండీ బొమ్మ విసిరేస్తుంది. తిలోత్తమ తలకు పూల కుండీ తగిలి తిలోత్తమ కుయ్యోమొర్రో అనుకుంటుండగా త్రినేత్రి గన్ తీసుకొని తిలోత్తమకు బెదిరిస్తుంది. నయని జోలికి వెళ్లొద్దని విశాల్ తిలోత్తమకు చెప్తాడు. ఇక దురంధర నువ్వు నయనివో త్రినేత్రి కానీ ముందు గదికి వెళ్లు అని పంపేస్తుంది.


వల్లభ తల్లిని గదిలోకి తీసుకెళ్లి తలకి దెబ్బ తగిలిన చోట ఆయిల్ రాస్తాడు. తిలోత్తమ మసాజ్ చేసుకుంటుంది. ఇంకొంచెం గట్టిగ తగిలుంటే తలకు కుట్లు పడుండేవి అని వల్లభ అంటే తిలోత్తమ కొంచెం ఉంటే ఫొటోకి దండ వేసేవారని అంటుంది. అసలు తను నయనినో త్రినేత్రినో రేపు తేల్చేద్దామని నయనినా ఉన్న త్రినేత్రిని రేపు నమ్మించి మోసం చేయాలని అనుకుంటారు. మరోవైపు త్రినేత్రి తిలోత్తమను తలచుకొని కొట్టేస్తానని తిట్టుకుంటుంది. ఇంతలో గాయత్రీపాప త్రినేత్రిని అమ్మా అని పిలుస్తుంది.  


త్రినేత్రి: పాప నువ్వు నన్ను అమ్మా అనగానే నాకు ఉన్న కోపం చిలుకలా రివ్వున ఎగిరిపోయింది. నా మనసంతా హాయిగా అనిపించింది.
విశాల్: మనసులో నీ దగ్గరకు వచ్చింది గాయత్రీ పాప కాదు నయని మా అమ్మ నా కోడలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అని ఎంత కంగారు పడుతుందో ఏంటో అందుకే నీ దగ్గరకు వచ్చింది. నువ్వు పాపకి కన్న తల్లివి నయని కానీ ఫ్రెండ్‌లా ప్రవర్తిస్తున్నావ్ నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు కొంచెం క్లూ దొరికినా బాగుండు.
త్రినేత్రి: పాప నీకు అమ్మ తప్ప ఇంకేం మాటలు రావా నేను నీకు నేర్పిస్తాను. పాప నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకో తెలుసా ఆ తిలోత్తమ గారు నాకు గన్ గురిపెట్టినందుకు నువ్వు ఇలా పూలకుండీ విసిరినందుకు థ్యాంక్స్ పాప. ఇప్పుడే వస్తాను ఉండు పాప.
విశాల్: పాపతో అమ్మ నువ్వు ఇలా వస్తే నయనికి ఏం చెప్పలేవు. అలా అని ఆత్మలా నువ్వు రావాలి అంటే ఏం చేయాలో నాకు తెలీదు. చూశావు కదా నీ కోడలు ఎలా మాట్లాడుతుందో దీనికి పరిష్కారం నువ్వే చూపించాలి.


ఉదయం సుమనను తీసుకొని వల్లభ తిలోత్తమ దగ్గరకు తీసుకొస్తాడు. వచ్చింది నయనినే అని నువ్వు నమ్ముతున్నావా సుమన అని తిలోత్తమ అడుగుతుంది. దాంతో సుమన నయనిని ఆదరించే తన భర్తే అనుమానంగా ఉందని అంటే నేను ఎలా తను మా అక్క అని నమ్ముతానని అంటుంది. దాంతో తిలోత్తమ సాక్ష్యాలతో సహా నిరూపించాలని అంటుంది. ఇక తిలోత్తమ తన ప్లాన్ చెప్తుంది. పాపని పడుకో పెడితే గాయత్రీ దేవి ఆత్మ వస్తుందని అప్పుడు నయని అయితే ఆత్మని గుర్తుపడుతుందని త్రినేత్రి అయితే గుర్తుపట్టదని అప్పుడు త్రినేత్రి పని పట్టాలని అంటుంది అందుకు సమనకు మత్తు మందు ఇచ్చి పాప పాలలో కలిపి గాయత్రీ పాపకి ఇవ్వమని అంటుంది. అందరూ హాల్‌లో ఉంటారు. త్రినేత్రి కాఫీ చేయడానికి వెళ్తుంది. ఇక తిలోత్తమ త్రినేత్రితో మాట్లాడటానికి వెళ్లి త్రినేత్రిని మాటల్లో పెట్టి పాప పాలలో మత్తు మందు కలుపుతుంది. ఇక త్రినేత్రి పాపకి పాలు పావనాకి కాఫీ తీసుకెళ్తుంది. పాపకి పాలు తాగమని చెప్పి ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారి, లక్ష్మీలకు సంబంధం ఉందని రచ్చ రచ్చ చేసిన పద్మాక్షి.. ఫుటేజ్‌లో అంబిక దొరికిపోతుందా!