Trinayani Today Episode వల్లభ వచ్చి శిరోధార పాత్రలో పాము ఉందని చెప్తాడు. అందులో పాము ఎందుకు ఉంటుదని హాసిని అడుగుతుంది. దీంతో వల్లభ పెద్ద పాము కాదు చిన్న పామే అని అంటాడు. ఇక దురంధర ఉలూచి అయింటుందే సుమన అని అంటుంది.


సుమన: నా బిడ్డను అందులో వేశారా. ఎవరు చేశారు ఈ పని.
నయని: సుమన ఉలూచి ధారపాత్రలోకి వెళ్లి మంచి పనే చేసింది.
సుమన: నీళ్లలో నా బిడ్డ పడిపోతే మంచిదా.. ఉలూచి.. ఉలూచి బయటకు వచ్చేయ్.
నయని: ఆ పాత్రలో ఉండే జలం శివలింగం మీద పడకూడదు అని ఉలూచి అందులో ఉంది. అంతే అంటారా అత్తయ్య. 
తిలోత్తమ: మాకు ఏం తెలుసు అన్నీ నీకే తెలుసు అన్నట్లు మాట్లాడుతున్నావ్.
వల్లభ: తెలిసింది అంటే ఎక్కడ తేడా ఉందో కూడా తెలిసే ఉంటుంది.
హాసిని: మీ కంగారులోనే ఏదో తేడా జరిగింది అని తెలుస్తుంది రాజా..
సుమన: ముందు నా బిడ్డను అందులో నుంచి తీయండి. తనకు ఏమైనా అయితే ఊరుకోను చెప్తున్నా..
పావనా: పాము పిల్లని ఎలా చేయి పెట్టి తీస్తాం.
విశాల్: గురువుగారు ఇప్పుడు ఏం చేద్దాం.
గురువుగారు: ఉలూచి పక్కకు తప్పుకుంటే అందులోని జలం శివలింగం మీద పడుతుంది విశాలా. 
విక్రాంత్: రమ్మనండి స్వామి.
డమ్మక్క: అమ్మ ఏం చెప్తుందో చూద్దాం పుత్రా..
సుమన: చెప్పు అక్క నా మాట కన్నా నీ మాటే వింటుంది ఉలూచి.
నయని: కంగారు పడకు ఉలూచి బయటకు రావడం కన్నా ముందు అందులో ఉండే జలం బయటకు రాకుండా చూడాలి. ఈ పని చేయడానికి నాగయ్య వస్తాడు. రా నాగయ్య.. నాగయ్య పాము వచ్చి శివలింగం మీద నాగయ్య పాము చుట్టేస్తుంది. శిరోధార పాత్రకు అడ్డుగా ఉన్న పువ్వు తీసి ఆ నీటిని నాగయ్య పాము తాగేస్తుంది. దీంతో ఉలూచి పాము బయటకు వస్తుంది. అందరూ షాక్ అవుతారు. ఇక నయని రూపంలో ఉన్న అమ్మవారు కూడా మాయమైపోతుంది. 
విశాల్: ఎంత అద్భుతం నయని.. నయని.. ఎక్కడ నయని..
గురువుగారు: తన పని చేసుకొని వెళ్లింది విశాలా. 
డమ్మక్క: గదిలో ఉంటుంది వెళ్లండి బాబు.
వల్లభ: గాయత్రీ పెద్దమ్మ జాడ తెలుస్తుంది అన్నారు.
గురువుగారు: మహా లింగానికి అభిషేకం జరిగి ఉంటే తెలిసేది. 


ఇక ఉదయం విశాల్ నయని దగ్గరకు వచ్చి పూజ అంత అద్భుతంగా చేశావని అంటాడు. దీంతో నయని నేను పూజ దగ్గరకే రాలేదు అని బాధపడుతుంటే మీరు నృత్యం చేశాను అని అంటున్నారు అని అంటుంది. దీంతో విశాల్ నువ్వు రాకపోవడం ఏంటి నయని నాగయ్య వచ్చి శివలింగాన్ని చుట్టుకున్నాడు కదా.. శిరోధార పాత్రలో ఉలూచి పాముగా మారి అందులో ఉండింది అని అందరూ కంగారు పడ్డారు కదా అని అంటాడు. నయని షాక్ అయిపోతుంది. 


విశాల్: నిద్ర మత్తులో అంతా మర్చిపోయావు అని నువ్వు ఎంత చెప్పినా నేను నమ్మను. ఎందుకు అంటే నీకు కొన్నేళ్ల క్రితం జరిగేవే గుర్తుంటాయి.
నయని: ఆశ్చర్యంగా ఉంది బాబుగారు నేను రెడీ అయి బయటకు వచ్చే లోపు మనసులో.. అత్తయ్య ఇలా చేసింది అంటే గొడవ అయ్యేలా ఉంది చెప్పకపోవడమే మంచిది. నేను రెడీ అయిపోయి నిద్రపోయాను బాబుగారు.
విశాల్: నువ్వు హాల్‌లోకి రావడం నిజం అది కల అనుకుంటున్నావు. 
నయని: అంతా అయోమయంగా ఉంది బాబుగారు. మీరు చెప్పింది నిజమా నేను చెప్పేది నిజమా అర్థం కావడం లేదు.


సుమన: మీరందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న గాయత్రీ కంపెనీల వ్యవస్థాపకురాలు మీ విశాల్ బ్రోని కన్న గాయత్రీ దేవిగారు పునర్జన్మ ఎత్తి పసిబిడ్డగా ఎక్కడున్నారో నాకు తెలిసిపోయింది.
విక్రాంత్: గాయత్రీ దేవి జాడ ఎక్కడని గురువుగారిని అడిగినా సూటిగా చెప్పలేకపోతున్నారు. మా అమ్మ, బ్రో అఖండ స్వామికి అడిగితే ఆయన రకరకాల పరీక్షలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అంటే మహామహులకే సాధ్యం కాని పనిని నువ్వు సాధించావు అంటే నీ కంటిని నేను ఎలా కనిపిస్తున్నారు.
సుమన: ఎలా చెప్తే నమ్ముతారు. ఈ విషయాన్ని నేను రుజువు చేసేటప్పుడు మీరు నన్ను తిట్టకూడదు. కొట్టకూడదు. ముందే చెప్తున్నా. 


హాల్‌లో గాయత్రీ పాప ఆడుకుంటూ ఉంటే పావనా మూర్తి న్యూస్‌పేపర్ పట్టుకొని పరుగున వచ్చి పడిపోతాడు. పేపర్‌లో మీ అమ్మ ఫొటో వచ్చింది అని చెప్తాడు. అందులో గాయత్రీ దేవి ఫొటో కింద పునర్జన్మ  ఎత్తిన గాయత్రీ దేవి గారికి ఇప్పుడు ఏడాదిన్నర వయసు ఉంటుంది. దొరికిన వాళ్లు పెంచుకోవడం వల్ల ఉపయోగం  లేదు. తిరిగి మాకు ఇచ్చేస్తే ఆస్తి పంచి మీకు కానుకగా ఇస్తాం. ఇట్లు శ్రీమని నయని అండ్ విశాల్ అని రాసి ఉంటుంది. అది చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఇక ఇందుకు ఇలా చేశారు అని విశాల్ పెద్దమ్మ అడుగుతుంది. టీవీలో కూడా వస్తుంది అని షాక్ ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Also Read: మహేష్‌ బాబు: స్టైలిష్‌ లుక్‌లో సర్‌ప్రైజ్‌ చేసిన మహేష్‌ బాబు - హాలీవుడ్‌ హీరోలను డామినేట్‌ చేస్తున్న సూపర్‌ స్టార్‌