Trinayani Today Episode దురంధర తీసుకొచ్చిన పాలు గాయత్రీ పాపకు ఇవ్వనివ్వకుండా నాగయ్య పాము అడ్డుకుంటుంది. అందులో ఏదో కలిసి ఉందని అందరూ అనుకుంటారు. అందరూ దురంధరని అనుమానిస్తే దురంధర ఏడుస్తుంది. ఏం జరిగింది చెప్పమని విశాల్ అడిగితే పెద్ద వదినకు కాఫీ తీసుకొస్తున్నాను అని దురంధర అంటుంది.
లలితాదేవి: ఇంకేం చెప్పకు దురంధర నాకు అర్థమైంది.
తిలోత్తమ: ఏం అర్థమైంది అక్కయ్య.
లలితాదేవి: నాగయ్య ఆ పాల కోసమే అడ్డుగా నిల్చొన్నాడు.
వల్లభ: ఎందుకు పెద్దమ్మ పాలలో విషం ఉందనా..
తిలోత్తమ: రేయ్ పొచ్చొడా ఏం మాట్లాడుతున్నావ్‌రా..
హాసిని: మీలా నికృష్టంగా ఏం క్రూర మృగం కూడా ఆలోచించదు అనుకుంటా.
లలితాదేవి: ఎందుకు హాసిని నిజంగానే నాగయ్య పాల కోసమే అడ్డుపడ్డాడు. ఎందుకు అంటే ఈ రోజు నేను మా చెల్లి గాయత్రీదేవి చీర కట్టుకున్నాను. విశాల్ ఈ చీర మీ అమ్మ ఎప్పుడు కట్టుకుందో గుర్తుంది.
విశాల్: గుర్తుంది పెద్దమ్మ మనందరం కొత్త పల్లి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్లి అక్కడ పుట్టలో పాలు పోసినప్పుడు అమ్మ ఈ చీర కట్టుకుంది.
లలితాదేవి: ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసి పాముకి పాలు పోశాం కదా. ఈ రోజు ఈ చీర కట్టగానే నాకు ఎందుకు పాలు పోయరు అని నాగయ్య పాము అడ్డుపడ్డారు.
దురంధర: హో అలాగా..
నయని: అర్థమైంది పెద్దమ్మగారు గాయత్రీకి నేను మళ్లీ పాలు తాగిస్తాను. మీరు నాగయ్య పాముకి తాగించండి.
తిలోత్తమ: పిల్లకు పాలు తాగించకుండా పాముకి తాగించడం ఏంటి.
లలితాదేవి నాగయ్య పాము దగ్గర పాల గ్లాస్ పెడుతుంది. పాము పాలు తాగేస్తుంది. ఇక లలితాదేవి చల్లగా ఉండే పాలు, కాఫీ, టీ తీసుకోరు అని విశాల్ అంటాడు.
సుమన: మనిషే వేడి అనుకున్నా తాగేవి కూడా అలాగే ఉండాలన్నమాట.
లలితాదేవి: అయితే అనవసరమైన ఆలోచనల్ని వదిలి ముందుగా చల్లబడాల్సింది నువ్వే సుమన. నయని వెళ్లొస్తాను అమ్మ.
అఖండ: లలితాదేవి రక్తపు మరకలు ఉన్న బట్టను గాయత్రీ పాప మీద కప్పలేకపోయారా.
వల్లభ: కప్పడమా కంచెం ఉంటే మా గొంతు విప్పడం కూడా అయ్యేది.
అఖండ: ఏమైంది.
తిలోత్తమ: సరిగ్గా పాప మీద పడాలి అని ప్లాన్ చేశాం కానీ పడలేదు స్వామి.
వల్లభ: పడింది స్వామి. కానీ విరాట్ కొహ్లీలా పెద్ద పెద్దమ్మ క్యాచ్ చేసి తన రక్తం అంటిన గుడ్డ తోనే మళ్లీ తన చేతికి కట్టుకుట్టుంది.
అఖండ: దాని అర్థం ఏంటో తెలుసా. ఎవరిది వారికే చెందుతుంది అని.
తిలోత్తమ: ఏడాదిన్నర వయసున్న ఆ పిల్లకు సుమారు 700 కోట్ల విలువైన ఆస్తిని సంపాదించుకోగలిగింది. గాయత్రీ దేవి అక్క పేరుతో సంపాదించినట్లే కదా..
అఖండ: ఆ ఆస్తి ఆ పాపదా. లేకపోతే గాయత్రీదేవికి చెందుతుందా.
తిలోత్తమ: చెందాలి అంటే పునర్జన్మ ఎత్తిన గాయత్రీ దేవి ఇంటికి రావాలి.
వల్లభ: వస్తే నువ్వు చావాలి.
తిలోత్తమ: రాకపోతే ఈ వందల కోట్ల ఆస్తి రోజు రోజుకు పెరిగి ఈ పిల్ల యువరాణిలా పెరుగుతుంది. స్వామి పట్టుమని పది రోజులు బతికినా చాలు ఒక్క సారి అన్ని వందల కోట్లుకు అధినేత్రి అవ్వాలని ఉంది.
వల్లభ: గాయత్రీ పెద్దమ్మ ఇంటికి వస్తుందా లేకపోతే ఈ గాయత్రీనే గాయత్రీ దేవిలా చలామాని అవుతుందా చెప్పండి.
అఖండ: ఆ పాపని నేను దగ్గరుండి చూస్తే కానీ చెప్పలేను. తీసుకురమ్మంటే చేతులెత్తేశారు. సరే ఇప్పుడు ఇంటికి వెళ్లండి గాయత్రీ దేవే మీకు చూపిస్తుంది. ఆ ఘడియ రానే వస్తుంది.
మరోవైపు నయని గాయత్రీ పాపకు దిష్టి తీయడానికి అన్నీ తీసుకొని వస్తుంది. ఇంతలో విక్రాంత్ వచ్చి గాయత్రీ పెద్దమ్మను బతికున్నప్పుడు చూడలేకపోయాను అని ఇప్పుడు పెద్దమ్మ పేరు పెట్టుకున్న ఈ పాపకు దిష్టి తీస్తాను అని ఆశపడతాడు. నయని, విశాల్‌లు ఓకే చెప్తారు. నయని దిష్టి ఎలా తీయాలో చెప్తే విక్రాంత్ దిష్టి తీస్తాడు. ఇక విక్రాంత్ దిష్టి తీసి వాటిని సుమన మీద పడేస్తాడు.
విక్రాంత్: గాయత్రీ పాపకు ఇక ఏ దిష్టి లేనట్లే. వాటే టైమింగ్ సుమన నీది.
సుమన: దీనికి దిష్టి తీసి నా మీద పడేయమని మా అక్క చెప్పిందా..
నయని: నేను ఎందుకు చెప్తాను చెల్లి.
సుమన: లేకపోతే నా మీదకు ఎందుకు విసిరేస్తారు ఆయన. అసలు దిష్టి తీయాల్సిన అవసరం ఏంటి. అయినా నామకరణం నిన్న జరిగితే ఈరోజు దిష్టి తీయడం ఏంటి. నన్ను ఎగతాళి చేయడానికే కదా.
విశాల్: సుమన అపార్థం చేసుకోకు. గాయత్రీ ఒళ్లు కాస్త వేడిగా ఉంది అంటే దిష్టి తీస్తానంది నయని.
సుమన: ఇటు వైపు రావడం నా బుద్ధి తక్కువ భోజనానికి పిలుద్దామని వస్తే ఉప్పు ఎక్కువ అయ్యేలా చేశారు కదా.
విక్రాంత్: నోట్లో కూడా పడినట్లుంది ఉప్పు ఎక్కువ అయింది అంటుంది.
నయని: మన మీద కాకుండా గాయత్రీ పాప మీద సుమన ప్రతాపం చూపించేలా ఉంది.
సుమన గాయత్రీ దేవి చీరలు పట్టుకొని వస్తుంది సుమన. ఇక వాటిని నువ్వేందుకు తీసుకొచ్చావని సుమనను తిలోత్తమ అడిగితే డ్రైక్లీనింగ్ వాళ్లు మా అక్క గదిలో పెట్టుకుండా నా గదిలో పెట్టారు అని వాళ్లే తీసుకుంటారు అని ఆ గాయత్రీ అత్తయ్య ఫొటో దగ్గర పెట్టాను అని అంటుంది.
తిలోత్తమ: అది సరే కానీ ఈపిల్లని గాయత్రీ దేవి అని సాగదీసి పిలాలి అంట.
సుమన: ఈ పిల్ల పేరు చివర దేవి అని పెట్టగానే పెద్దత్తయ్య అయిపోతుందా. అయినా చనిపోయి గోడకు ఫొటోలా వేలాడుతున్న పెద్దత్తయ్య ముఖం కలగా ఉందా.. లేక ఆవిడ పేరు పెట్టుకొని ఆస్తులు దక్కించుకున్నా ఈ పిల్ల ముఖం కలగా ఉందో మనం చూద్దాం అత్తయ్య.
తిలోత్తమ: సరే ఏం చేద్దాం.
సుమన: దీన్ని ఎత్తుకొని గాయత్రీ అత్తయ్య ఫొటో దగ్గరకు తీసుకురండి పోల్చి చూద్దాం.
ఇక తిలోత్తమ గాయత్రీ అక్కయ్య పేరు పెట్టుకునే ఈ పిల్లను నేను ఎత్తుకోవడం ఏంటి అని అంటుంది. దీంతో సుమన గాయత్రీ పాపని ఎత్తుకుంటుంది. ఇక డమ్మక్క పాపని గాయత్రీ దేవి ఫొటో దగ్గరకు తీసుకెళ్లొద్దు అని చెప్తుంది. వల్లభ డమ్మక్కను ఎగతాళి చేస్తాడు. దీంతో డమ్మక్క మనసులో మీ చావుని మీరే కోరి మోసుకొని వెళ్తున్నారు అనుకుంటుంది. సుమన, తిలోత్తమ, వల్లభలు పాపని ఫొటో దగ్గరకు తీసుకెళ్తారు. ఇంతలో పెద్ద గాలి వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: ఆస్థి కోసం అజయ్ కొత్త డ్రామా – అజయ్ కాలర్ పట్టుకున్న నీరజ్