Trinayani Serial Today Episode ఉలూచి మళ్లీ ఆడపిల్లలా మారిందని వల్లభ తిలోత్తమకు చెప్తాడు. సుమన మళ్లీ ఆస్తి వాటా అడగలేదా అని తిలోత్తమ అడిగితే  ఉలూచి సాక్సులు తీసినా సరే ఆడపిల్లలా పగలు రాత్రి కనిపిస్తేనే ఆస్తి ఇస్తామని కండీషన్ పెట్టారని వల్లభ చెప్తాడు. అది కష్టమని ఉలూచి కాళ్లకు సాక్సులు వేయించింది తనే అని తిలోత్తమ అంటుంది. తిలోత్తమ మాటలకు వల్లభ షాక్ అవుతాడు. దీని వెనక నీ హస్తం ఉందా అమ్మ అని ప్రశ్నిస్తాడు. దానికి తిలోత్తమ గ్లౌజ్ వేసుకున్న తన కుడి చేతిని చూపిస్తూ అంతా దీని వెనకే ఉందని అంటుంది.


వల్లభ: మమ్మీ దీన్ని గ్లౌజ్ అని నేను అనుకోవడం లేదు నువ్వు మ్యాజిక్ చేసే క్లాత్ అనుకుంటున్నా. అవునా.
తిలోత్తమ: ముందు ముందు అన్నీ నీకే తెలుస్తాయి. 
వల్లభ: ఏది ఏమైనా ఆ గారడి పిల్ల జోలికి మాత్రం వెళ్లకూడదు మమ్మీ.
తిలోత్తమ: మనసులో.. తన శక్తిని ఢీ కొట్టే శక్తి నాకు రావాలి అంటే ఏం చేయాలో ఆలోచించాలి. 


హాసిని ఓ చోట కూర్చొని ఉంటే అక్కడికి నయని, విశాల్ వస్తారు. వల్లభ చేయి కట్ అయితే పట్టించుకోకుండా ఎందుకు ఇక్కడ కూర్చొన్నావ్ అని అడుగుతారు. దానికి హాసిని విశాల్‌ వాళ్లతో అసలు విషయం అది కాదు అంటూ విశాలాక్షి ఉలూచి పాముకి సాక్సులు వేయగానే ఆడపిల్లలా మారినట్లు అత్తయ్య చేతి గ్లౌజ్ తీస్తే ఏమనా అవుతుందా? తీసేసి తిరిగి వేస్తే మామూలు అవుతుందా? అని తన అనుమానాలను వారితో అడుగుతుంది. దానికి విశాల్, నయనిలు తిలోత్తమ తీయడానికి ఒప్పుకోదని చెప్తారు. ఇక తిలోత్తమ ఎవరికీ చెప్పకుండా ఉదయం సాయంత్రం ఎక్కడికో వెళ్తుందని హాసిని నయని, విశాల్‌తో చెప్తుంది. నయని తిలోత్తమ అలా మారడం వెనక ఎవరో ఉన్నారు అని అనుమానం వ్యక్తం చేస్తుంది.. ఏదో జరిగిందని అంటుంది. ఇక తిలోత్తమ చేతి గ్లౌజ్ తొలగించడమే లక్ష్యం పెట్టుకుంటారు ముగ్గురు.


హాల్‌లో తిలోతమ ఫైల్స్ చెక్ చేస్తుంటుంది.  సుమన పావనా మూర్తికి జాబ్ లేదు అని అంటే తన డబ్బు లెక్కపెట్టుకునే ఉద్యోగం ఇస్తున్నాను అని తిలోత్తమ అంటుంది. ఇక హాసిని పూజ చేసి అందరికీ హారతి ఇస్తుంది. ఇక తిలోత్తమ ఎడమ చేతితో హారతి తీసుకుంటే అలా తీసుకోవద్దు అని సుమన అంటుంది. అందరూ ఒప్పుకోకపోవడంతో తిలోత్తమ తన కుడి చేతిని పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తుంది కానీ కదిపించలేకపోతుంది. ఇక చేయితో పాటు తిలోత్తమ కూడా వణుకుతుంది. ఇక హసిని తన చేతిలో ఉన్నది విశాలాక్షి అమ్మవారికి పూజ చేసి ఇచ్చిన హారతి అని అంటుంది. 


తిలోత్తమ: హారతి తీసుకోకుండా చేయి వెనక్కి తీసుకుంటే నయనికి అనుమానం వస్తుంది. ఏదో ఒకటి చేసి మ్యానేజ్ చేయాలి. అనుకుంటూ చేయి హారతి పళ్లెం దగ్గరకు పెడితే హాసిని చేయి కూడా వణుకుతుంది. దీంతో నయని హారతి పళ్లెం తీసుకుంటుంది. నయని ఎత్తుకున్న గాయత్రీ తిలోత్తమ చేతి మీదకు తోసేస్తుంది. దీంతో గ్లౌజ్‌కు అగ్గి అంటుకొని తిలోత్తమ విలవిల్లాడిపోతుంది. ఇక విశాల్ బిందెతో నీరు తీసుకొని వస్తాడు. అందులో తిలోత్తమ చేయి పెడుతుంది. ఇక తిలోత్తమ మంత్రాలు చదివి పెద్దగా నవ్వుతుంది. అందరూ షాక్ అయిపోతారు. మండితే హాయిగా ఉంటుందా అంటారు. దానికి తిలోత్తమ తనకు హాయిగా ఉందని నవ్వుతుంది. గ్లౌజ్ కాలిపోయి ముక్కలు అయిపోయిందని తిలోత్తమ బిందెలోనుంచి ముక్కలు తీసి ఇస్తుంది. 


నయని: ఇక కుడి చేయి బయటకు తీయొచ్చు కదా అత్తయ్య.
తిలోత్తమ: తియ్యాలి కదా ఇలాగే ఎంత సేపు నీటిలో పెడతాను. అని చేతిని బయటకు తీస్తే పాము కుబుసం చేతికి చుట్టుకుంటుంది. బిందెలోపల ఆ కుబుసాన్ని చేతికి చుడుతుంటే చాలా హాయిగా ఉందని తిలోత్తమ అంటుంది. అందరూ తిలోత్తమ ప్రవర్తన, మాటలకు బిత్తరపోతారు. ఇక వల్లభ మరో కొత్త గ్లౌజ్ తీసుకొని తిలోత్తమ దగ్గరకు వస్తాడు. ఇక తిలోత్తమ వల్లభ చూడకుండా చేతికి గ్లౌజ్ వేసుకుంటుంది. తన చేతి వల్లే తాను ధనవంతురాలిగా ఉందని.. అనుకున్నవన్నీ అవుతున్నాయి అంటే దానికి కారణం, పట్టినదంతా బంగారం అవడానికి కారణం కూడా ఆ చేయి అని తిలోత్తమ అంటుంది. విశాల్, నయనిలు ఆ చేతిని చూస్తే తాను ఏం చేసిందో మొత్తం పసిగట్టేస్తారు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: డబ్బు పోగొట్టుకున్న మధు.. మహా సామ్రాజ్యంలో సీతకి కోడలి స్థానం కల్పిస్తానన్న విద్యాదేవి!