Trinayani Serial Today Episode నయని, విక్రాంత్ మాట్లాడుకుంటూ ఉంటే బామ్మని హాసిని తీసుకొస్తుంది. ఆత్మలింగాన్ని ఎక్కడో చూసినట్లు ఉందని బామ్మ చెప్తుంది. దానికి విక్రాంత్ త్రినేత్రి శరీరంలో ఉన్న ఆత్మని ఉద్దేశించి ఆ ఆత్మలింగాన్ని చూస్తాడేమో అని కంగారుగా ఉందని అంటాడు. దానికి హాసిని కంగారు ఎందుకు పెద్దత్తయ్య ఆత్మని చూసి చాలా కాలం అయింది కదా అని అంటాడు. ఆత్మని చూడటం ఏంటి అని బామ్మ అవాక్కు అయి మీకు మతి పోయిందా అని అడుతుంది.
బామ్మ: మీరు ఎలా ఆత్మని చూస్తారు.
నయని: నేను చూస్తాను బామ్మ.
విక్రాంత్: అవును మా వదినతో పాటు మా అమ్మ కూడా ఆత్మని చూస్తుంది.
బామ్మ: అలాంటప్పుడు ఆ ఆత్మలింగాన్ని రప్పించడం ఏంటి మీరే చూస్తే సరిపోతుంది కదా.
విక్రాంత్: ఈ సారి అమ్మ చూడలేకపోయింది అందుకే ఆయన్ను పిలిచించింది.
బామ్మ: మరి మీ వదిన చూస్తుంది.
విక్రాంత్: తనని తాను చూసుకోలేదు.
హాసిని: అంటే.
బామ్మ: ఆత్మని ఆత్మ చూడలేదు అనా.
హాసిని: మా చెల్లి ఆత్మ ఎలా అవుతుంది బామ్మ.
బామ్మ: ఈ బాబు చెప్పింది అలాగే ఉంది మరి.
నయని: మీరు అన్నది నిజమే. ఆత్మల్ని చూడగలిగే నేను ఈ సారి కొత్త ఆత్మల్ని చూడలేకపోతున్నా అని అత్తయ్య కొత్త ఆత్మల్ని తీసుకొచ్చింది.
హాసిని: కొత్త ఆత్మ ఎవరు.
బామ్మ: అది ఎవరో వాడే తేల్చుతాడు.
లటలట లుటలుట అంటూ ఆత్మలింగం ఇంటి మొత్తం మంత్రించిన నీరు చల్లుతాడు. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. ఇక ఆయన లటలట లుటలుట అంటూ పాపని కింద కూర్చొపెట్టి బయటకు రావాలి అంటూ క్షుద్ర దేవతల్ని పిలుస్తాడు. మా ఊరిలో పిడకలు అమ్ముకునేవాడిలా ఉన్నాడని బామ్మ ఆత్మలింగం మీద సెటైర్లు వేస్తుంది. అందరూ అతన్ని విసిగించడంతో మీరు ఇలా చేస్తే నేను వెళ్లిపోతాను అని ఆత్మలింగం హర్ట్ అయిపోతాడు. పాప చుట్టూ తిరుగుతూ కాళి కపాలి అంటూ ఉంటే పాప కాళ్లకి అడ్డంగా చేయి పెట్టేస్తుంది. దాంతో ఆత్మలింగం కింద పడిపోతాడు. అతన్ని పైకి లేపబోయి వల్లభ అతని జుట్టు మీద కాలు వేయడంతో అది ఊడిపోతుంది.
దాంతో అందరూ ఆత్మలింగం నిజం కాదని విగ్గు పెట్టుకొని వచ్చాడని అనుకుంటారు. బామ్మ ఆతన్ని గుర్తుపట్టి దేవీపురంలో గేదెలు కాచుకునే గాధలింగం కదా నువ్వు అని అడుగుతుంది. అందరూ షాక్ అయిపోతారు. వల్లభ ఆయన వెంట పడితే ఆత్మ లింగం పరుగెత్తుకుంటూ పైకి వెళ్తాడు. వల్లభ, హాసిని వెంట పడతారు. ఆత్మ లింగం ఎక్కడో ఒక చోట దాక్కోవాలని పరుగులు తీస్తాడు. చివరకు ఓ గదిలో ఒక మూలకు దాక్కుంటాడు. అతని పక్కనే కోమాలో ఉన్న నయని దేహాన్ని కూర్చొపెట్టి ఉంటారు. కాళ్లు చాపుకొని గోడకు ఆని చలనం లేకుండా ఉన్న నయని దేహాన్ని చూసి ఆత్మలింగం బెంబెలెత్తిపోతాడు.
ఇందాకే హాల్‌లో చూశాను కదా పాపని కూడా ఎత్తుకొని ఉంది కదా మళ్లీ ఇక్కడుందేంటి అని పిలుస్తాడు. అయినా నయనిలో చలనం లేకపోవడం గుర్తించి శవమా అని తనని తాను గిల్లుకొని దెయ్యం దెయ్యం అని పరుగులు తీస్తాడు. వల్లభని ఢీకొట్టి దెయ్యం అనడంతో వల్లభ కూడా దెయ్యం దెయ్యం అని అరుస్తాడు. ఇక కింద కొచ్చి మళ్లీ నయనిని చూసి ఆత్మ లింగం దెయ్యం ఆత్మ అని అరిచి కింద పడిపోతాడు. విక్రాంత్ ముఖాన నీళ్లు చల్లుతాడు. లేచిన ఆత్మలింగం నయనిని చూసి దెయ్యం అని చాలా భయపడతాడు. మా అక్క ఏం చేసింది భయపడుతున్నావ్ అంటే మీ అక్క ఏంటి తల్లీ చనిపోయింది కదా అని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. శవాన్ని చూశానని అంటాడు. విక్రాంత్, నయనిలకు విషయం అర్థమవుతుంది. నయనిని చూపించి ఆత్మ అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: క్షమించమని రాజుని అడిగిన రూప.. కఠినంగా మారిపోయిన రాజు.. మందారానికి ఆబ్దికం!