Trinayani Today Episode 


విశాలాక్షి పాదాలకు పూలు వేసి కోరిక కోరుకుంటే నెరవేరుతుంది అని ఎద్దులయ్య ఇంట్లో వాళ్లకి చెప్తారు. సుమన అడ్డుగా మాట్లాడుతుంది. పావనా మూర్తి విశాలాక్షి పాదాలపై పూలు వేసి పావనామూర్తి ఏడుస్తాడు. అందరూ కంగారు పడతారు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. అది చూసి ధురందర కూడా ఏడుస్తుంది.  


పావనా: సోదరి కాళ్లని టచ్ చేసి కోరుకోమన్నారు కదా మనసులో కోరుకున్నాను. 
తిలోత్తమ: ఏం కోరుకున్నావ్.
విశాలాక్షి: ఈ జన్మలో జరగనివి కోరుకున్నాడు.
సుమన: బాబాయ్ మీరు చెప్పకండి.. నువ్వు చెప్పు ఏం కోరుకున్నావో..
విశాలాక్షి: సోదరా ఈ జన్మలో నువ్వు ఇంకొకరికి జన్మనివ్వలేనప్పుడు ధురందర తల్లి అయ్యేలా చూడమ్మా విశాలాక్షి అని  కోరరాని కోరిక కోరావు కదా..
పావనా: అవును సోదరి అది జరగని పని అని అమ్మవారు నాతో చెప్పినట్లు అనిపించి ఏడుపు వచ్చేసింది. 
వల్లభ: మామయ్యకి తీరని కోరిక అది ఒక్కటే కదా అది అందరికీ తెలిసిన విషయమే అది చెప్పడంతో గారడీ పాప దేవతలా చెప్పిందని ఫీలైపోతున్నారు.
పావనా: మీరు ఏమైనా అనుకోండి సోదరి పాదాలు తాకగానే బ్రహ్మాండమైన అనుభూతి కలిగింది నాకు. 
సుమన: ఆనంద పడకుండా ఎందకు ఏడ్చారు మరి.
ధురందర: చాల్లేవే ఆయన్ను ఏడిపించకండి.. ఇంకెప్పుడు నా మొగుడు ఏడవ కూడదు అదే నా కోరిక..
వల్లభ: నేను మొక్కుతా కొన్ని పూలు ఇవ్వండి.. మనసులో.. గట్టిగా పట్టేసి లాగేస్తా.. అంటూ విశాలాక్షి కాలు పట్టుకుంటాడు. లాగలేక అలసిపోతాడు. చేతులు కాలి నుంచి రావు.. తిలోత్తమ వచ్చి వల్లభని లాగేస్తుంది. ఇక వల్లభ ముఖం కందిపోతుంది. అందరూ ఏమైందని షాక్ అవుతారు. 


తర్వాత విశాల్, నయనీలు పుణ్య క్షేత్రాలు తిరిగే నువ్వు చల్లగా ఉండాలి అని కోరుకుంటారు. ఇక విక్రాంత్, సుమనలను కలిసి మొక్కుకోమంటే కలిసి మొక్కుకోను. విడిగానే మొక్కుకుంటాను అని వెళ్లిన సుమన విశాలాక్షి పాదాలను గిచ్చుతుంది. దానికి విశాలాక్షి నవ్వుతుంది. 


సుమన: నేను చక్కిలిగింతలు ఏం పెట్టలేదు. నీ పాదాలకు పెట్టిన పసుపు తడిగా ఉందా లేదా చూశాను అంతే. 
నయని: పసుపు అంటిందా..
ఎద్దులయ్య: నెత్తురు అంటింది మాతా చూసుకో చిట్టిమాతా..
హాసిని:  ఏం మొక్కుకున్నావ్ చిట్టీ.
విశాలాక్షి: తాను రేపు చేసే పనులకు రక్తం కళ్లు చూడబోతుంది అని ముందే తెలుసుకుంటే మంచిది.  
సుమన: రేపు నెత్తురు కాదు నా అదృష్టం చూసి నీ కళ్లల్లో నెత్తురు వస్తుంది చూస్తూ ఉండు. 
నయని: నోర్ముయ్ చిన్న పిల్లతో అలాగేనా మాట్లాడేది.
సుమన: చిన్నపిల్ల కాదు మాయలు మంత్రాలు చేసే మంత్రగత్తే. మన అందరినీ తన కాలి దగ్గరకు రప్పించుకొని లొంగదీసుకుంటుంది.
హాసిని: కాళ్లు పట్టుకుంది కదా అందుకే ఇలా మాట్లాడుతుంది. చిట్టీ తప్పులను క్షమించు తల్లీ ఇదే నా కోరిక. 


తిలోత్తమ, వల్లభలు అఖండ స్వామి దగ్గరకు వెళ్తారు. విశాలాక్షి గురించి జరిగింది అంతా చెప్తారు. అవి కాళ్లా రాళ్లా అని వల్లభ అంటే అవి రాళ్లే అని అఖండ అంటారు. మీరు పరిశీలించి ఉంటే తెలిసేది అంటారు. ఇక సుమన చేసినది చెప్తారు. అయితే ఆ విశాలాక్షి గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలని అంటారు. ఇక అఖండ స్వామి తులసి వేరు ఇచ్చి విశాలాక్షి పడుకునే దిండు లోపల పెట్టమని తులసి దానిమీద పడుకొంటే ఆమె లేచి ఉదయం వేసిన పసుపు అడుగులకు వ్యతిరేకంగా నడిపిస్తే నిజం చెప్తుంది అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: మృణాల్‌: ఈ పల్లెటూరు అమ్మాయి ఎవరంటూ అవమానించారు - బాడీషేమింగ్‌పై మృణాల్‌ కామెంట్స్‌