Trinayani October 19th Written Update: ఈరోజు ఎపిసోడ్ లో నయని నువ్వు లేకపోతే విశాల్ బ్రతకలేడు. హాసిని లేకపోతే పుండరీనాదం, వల్లభలు ఉండలేరు. అలాగే సుమన లేకపోతే ఉలూచి ఉండలేదు. హాసిని సరదాగా అన్నా నేనే ప్రాణత్యాగం చేస్తాను అని తిలోత్తమా అంటుంది. 


వల్లభ: అదేంటి మమ్మీ అలా అంటావు?


తిలోత్తమ: లేదురా నేను మహా అయితే ఇంకొక 15 సంవత్సరాలు బతుకుతాను అంతే కదా. వీళ్ళ భవిష్యత్తు కన్నా నాకు ఎక్కువ ఏం కావాలి నేనే ప్రాణత్యాగం చేస్తాను.


గురువుగారు: మంచి నిర్ణయం తీసుకున్నావు తిలోత్తమా.


విశాల్: గురువుగారు దీనికి మారే పరిష్కారమూ లేదా. ప్రాణత్యాగలు లేకుండా ఇది జరగదా.


గురువుగారు: ఉంది. ఉలూచితో కలిపితే ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు ఇందులో ఎవరో ఒకరు ప్రాణత్యాగానికి సిద్ధపడితే అప్పుడు మిగిలిన పిల్లలందరూ సురక్షితంగా ఉంటారు.


సుమన: అలాగైతే ఎలాగా అనాధ పిల్ల ఉంది కదా. మా అక్క కూతురు గాయత్రినే త్యాగం చేపిద్దాం. 


తిలోత్తమ: ఈ ఆలోచన ఏదో నాకు నచ్చింది నా ప్రాణాలు కాపాడాలంటే మరి ఇదే దారి.


విక్రాంత్: ఇందాక నువ్వు ప్రాణత్యాగం చేస్తానన్నావు కదా దానికున్న విలువని కూడా ఈ మాటతో పోగొట్టుకున్నావమ్మా.


గురువుగారు: నీ అభిప్రాయం చెప్పు విశాల్?


విశాల్: లేదు గురువుగారు గాయత్రీని వదిలే సమస్య లేదు. విశాలాక్షితోనే మాట్లాడి ఏదైనా తేల్చుకుందాం.


గురువుగారు: నేను చెప్పాల్సింది చెప్పాను ఇంక మీ ఇష్టం అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతారు.


ఆ తర్వాత సీన్లో వల్లభ గాయత్రి గదిలో నుంచి తన దుప్పటిని తీసుకొని తిలోత్తమ గదిలోకి వస్తాడు. అప్పుడు తిలోత్తమ ఆ దుప్పటి మీద ఒక పౌడర్ ని జల్లుతుంది.


వల్లభ: ఈ పౌడర్ రాస్తే మంచి సువాసనతో గాయత్రి పాప హాయిగా పడుకుంటుంది అనా అమ్మ ఇలా చేస్తున్నావ


తిలోత్తమ: నీ బొంద రా. ఇదేంటో తెలుసా? కాలకూట విషము. ఒకసారి పడుకుంటే మైకంలోకి వెళ్లి కామాలోకి పోవాల్సిందే. గాయత్రి పాప బొజ్జనిండా తిని హాయిగా పడుకొని, ఆ నిద్రలోనే కోమాలోకి జారుకుంటుంది.


వల్లభ: దీనివల్ల మనకు యూస్ ఏంటి మమ్మీ?


తిలోత్తమ: దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి రా. కిందటిసారి అఖండ స్వామి చెప్పినట్టు మనం మళ్లీ గాయత్రీ ని పరీక్షించవచ్చు. ఈసారి చేతుల మీద మంట వస్తే తనే గాయత్రి అక్క అని తెలిసిపోతుంది. ఒకవేళ తన ప్రాణాలు పోయినట్టయితే ఎలాగో ఇంట్లో ఒక ప్రాణం పోవాలి కదా తన చెల్లెలు కోసం, అన్నయ్య కోసం తన ప్రాణాలను త్యాగం చేసింది అని అనుకుంటారు. అని దుప్పటి నిండా పౌడర్ని జల్లుతుంది.


ఈ సంఘటనని, దృశ్యాన్ని అంతా గాయత్రి ఒక మూల నుంచి వింటుంది.


ఆ తర్వాత సీన్లో సుమన తను గదిలో ఉండగా విక్రాంత్ కోపంగా వచ్చి తలుపుని వేస్తాడు.


సుమన: తలుపును ఎందుకు వేశారు?


విక్రాంత్: అందరి ముందు నిన్ను కొట్టలేక తలుపులు వేసాను. అయినా నీకెందుకే ఆ గాయత్రి పాపం మీద అంత కుళ్ళు?


సుమన: నాకు ఎవరి మీద కుళ్ళు లేదు. తిలోత్తమ అత్తయ్య ప్రాణం కన్నా ఎవరో అనాధ పిల్లల ప్రాణం ముఖ్యమా? చస్తే చావనివ్వండి ఉన్నా ఎవరికి ఉపయోగం? అని అనగా వెంటనే సుమన చెంప చెల్లుమనిపిస్తాడు విక్రాంత్.


విక్రాంత్: ఇందాక కూడా ఇదే మాట అన్నావు. అందరి ముందు విశాల్ బ్రో నన్ను ఆపాడు మళ్ళి మళ్ళి అదే మాట అంటున్నావు. ఆ మాటకొస్తే ముందు మా అమ్మ చావడమే మంచిది భూమికి భారం తగ్గుతాది అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.


సుమన: ఏ మనిషి ఈయన? సొంత తల్లినే వదులుకోవాలనుకుంటున్నాడు. అబ్బా గట్టిగా కొట్టేసాడు అని అనుకుంటుంది.


ఆ తర్వాత సీన్లో విశాల్ గాయత్రిని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో నయని అక్కడికి వస్తుంది.


నయని: ఏంటి బాబు గారు గాయత్రితో మాట్లాడుతున్నారా?


విశాల్: మనసులో మాట గాయత్రికి చెప్పుకుంటున్నాను అని అంటాడు. ఇంతలో గాయత్రి నడుచుకుంటూ గది బయటకు వెళ్తుంది


నయని: ఇంత చిన్న పిల్ల గురించి వాళ్లు అంత పెద్ద నిర్ణయాలు ఎలా తీసుకోవాలనుకున్నారు బాబు గారు?


విశాల్: ఏది ఏమైనా మనం గాయత్రిని వదులుకోకూడదు.


నయని: అవును బాబు గారు, గాయత్రి అమ్మగారే తిరిగి వచ్చినా కూడా మనం గాయత్రి పాపను అసలు తక్కువ చేసి చూడకూడదు. అందరినీ సమానంగానే చూద్దాము అని అంటుంది.


ఇంతలో గాయత్రి గదిలో నుంచి బయటకు వెళ్లి తిలోత్తమ పౌడర్ జల్లిన దుప్పటిని తన చేతితో తీసుకొని వచ్చి హాల్లో తిలోత్తమ కూర్చున్న స్థానంలో పైనుంచి తిలోత్తమా ముఖం మీద ఆ దుప్పటిని వేస్తుంది. దాని వాసన పీల్చిన తిలోత్తమ వెంటనే స్పృహ తప్పి కోల్పోతుంది. అదే సమయంలో హాసిని అటువైపుగా వచ్చి ఈ దృశ్యాన్ని చూస్తుంది.


హాసిని: నిద్రలోకి జారుకుందో, కోమాలోకి జారుకుందో అని భయపడి ఆ దుప్పటిని పక్కనపెట్టి సోఫా వెనుకన తిలోత్తమని పడుకోబెట్టి తన పైన ఆ దుప్పటిని కప్పి, పైన ఒక పువ్వు పెట్టి అక్కడి నుంచి వచ్చేస్తుంది.


ఇంతలో గాయత్రి మెట్లు దిగడానికి చూసి నయని వాళ్లు వచ్చి ఎక్కడ పడిపోతుందేమో అని పట్టుకుంటారు. అందరూ కిందకి వచ్చి చూసేసరికి అక్కడ తిలోత్తమ కనిపించదు.


గురువుగారు: తిలోత్తమా ప్రాణాపాయ స్థితిలో ఉన్నది అని అప్పుడే అక్కడికి వచ్చిన గురువుగారు చెబుతారు.


వల్లభ: మమ్మీ మమ్మీ!! నువ్వు పోయావా మమ్మీ అని ఏడుస్తాడు వల్లభ.


Join Us On Telegram: https://t.me/abpdesamofficial