Gunde Ninda Gudi Gantalu February 25th Episode: సంజయ్ కి మీనా మాస్ వార్నింగ్, బాలకృష్ణ స్టైల్లో పంచ్ డైలాగ్స్ - గుండెనిండా గుడిగంటలు ఫిబ్రవరి 25 ఎపిసోడ్
Gunde Ninda Gudi Gantalu 2025 February 25 Episode: మనోజ్ కి లెటర్లు పంపిన దినేష్ ను పట్టుకునే పనిలో ఉన్నాడు బాలు. నితూకి లిఫ్ట్ ఇచ్చిన రవిపై మండిపడుతోంది శ్రుతి...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

Gunde Ninda Gudi Gantalu 2025 February 25 Episode Telugu Serial
రవి-శ్రుతి వెళుతుండగా బైక్ పై లిప్ట్ అడిగి ఎక్కేస్తుంది నీతూ. దార్లో ఆపిన ట్రాఫిక్ పోలీసులు ఫైన్ కట్టమంటారు. నేనెందుకు కడతాను అంటుంది నీతూ..నీవల్లేకదా ఇదంతా అందుకే నువ్వే కట్టాలి అంటుంది శ్రుతి. అక్కడి నుంచి వెళుతున్న మరో కానిస్టేబుల్ బండెక్కి వెళ్లిపోతుంది నీతూ. ఫైన్ కట్టేసి వెళతారు రవి శ్రుతి
నిత్యం అలసిపోయి వస్తున్నా ముగ్గురు కొడుకులు ఉన్నా కానీ ఒక్కరైనా నన్ను దింపుతున్నారా? తీసుకొస్తున్నారా? అని అడుగుతుంది. ఇంతలో బాలు వస్తాడు వరుస సెటైర్స్ వేస్తుంటాడు. కాళ్లు నొప్పులు వస్తాన్నాయా అత్తయ్యా నొక్కనా అని అడిగితే.. పీకా అని సెటైర్ వేస్తుంది ప్రభావతి. మొదటి సారి కాళ్లు పడతానంటే పీక నొక్కుతావా అన్న అత్తగారిని చూస్తున్నా... 'ఆల్ ఇండియా గయ్యాళి అత్తల సంఘానికి మా అమ్మే అధ్యక్షురాలు' అని ఆడుకుంటాడు. ఈ అత్త కోడలే అని చెప్పేందుకు మా అమ్మ వస్తోందని సత్యం అనగానే..మీ అమ్మ ఎందుకు అంటుంది. ఆవిడ ఎందుకు అనడంతో ఫైర్ అవుతాడు సత్యం. ఆ తర్వాత సైలెంట్ అయిపోతుంది ప్రభావతి
హోమం చేస్తే ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు..సంతానయోగం ఉంటుందన్నారు..అందుకే కొడుకులు, కోడళ్లతో హోమం చేయించాలని అంటాడు సత్యం. రోహిణికే ముందుగా పిల్లలు పుట్టాలి అందుకే రోహిణి-మనోజ్ తో చేయించాలి అంటుంది. మేం నీ పిల్లలం కాదా.. నాన్నకు సెకెండ్ సెటప్ ఉందా అని బాలు చెలరేగిపోతాడు. ఆ తర్వాత మౌనికను పిలిచేందుకు బాలు కాల్ చేయమంటాడు.. సత్యం నేను కాల్ చేయను అంటాడు. ప్రభావతి కాల్ చేస్తుంది.. సంజయ్ చాలా కేర్లెస్ గా మాట్లాడుతాడు. ప్రభావతిని అవమానించి కాల్ కట్ చేస్తాడు. ఎవరో చెప్పారు..నేను పిలిస్తే వస్తారని అన్నారు అని సెటైర్ వేస్తాడు బాలు. నేను పిలుస్తాను అంటుంది మీనా. నావల్లే అవలేదు అంటుంది ప్రభావతి. వాళ్లను పిలవకపోతే నిన్ను ఏం చేయాలని అంటుంది..వాళ్లు వస్తే మీరేం చేస్తారని అడుగుతుంది మీనా. నువ్వు చెప్పినట్టు వింటాను అంటుంది. మీరంతా సాక్ష్యం అనేసి వెళ్లిపోతుంది మీనా.
మీనా నేరుగా మౌనిక ఇంటికెళుతుంది. అక్కడ మౌనికతో అత్తయ్య మాట్లాడుతుంది. నాకు సంజయ్ పుట్టేవరకూ నా బతుకు బాగుపడలేదు.. నీక్కూడా బిడ్డ పుట్టేవరకూ నీ బతుకు బాగుపడదు అంటుంది. ఇంతలో మీనా వస్తుంది. మౌనిక బాధపడుతుంటే..మీ వదిన ఎంత బాధపడుతుందని అంటుంది..మా వదినకు అంతా తెలుసు అంటుంది మౌనిక. ఇంట్లో నాలుగు పెళ్లిళ్లు జరిగాయి..ఎవరికీ పిల్లలు కలగలేదని సంతాన హోమం చేస్తున్నారు..అందుకు మీ అబ్బాయిని మౌనికను పంపించమని చెప్పేందుకు వచ్చాను..మా ఇంటి ఆడపడుచుని బొట్టుపెట్టి పిలిచేందుకు వచ్చాను అంటుంది. రాదు అంటూ ఎంట్రీ ఇస్తాడు సంజయ్. గట్టిగా నిలదీస్తుంది మీనా. 'మౌనికను ఇబ్బంది పెడుతున్నావని గృహహింస కేసు పెడితే నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా? నువ్వు కలలు కంటున్న రాజకీయ జీవితం ఏమవుతుందో తెలుసా? గతంలో గూండాలను ఎలా తరిమి కొట్టానో గుర్తుందా అని ఇచ్చిపడేస్తుంది. ఇంతలో నీలకంఠం వచ్చి గట్టిగా మాట్లాడుతాడు...మౌనిక ఇన్నాళ్లూ మౌనంగా ఉంది, ఆ మౌనం బద్ధలైతే భూకంపం వస్తుందంటూ మాస్ వార్నింగ్ ఇస్తుంది. పిల్లల కోసం యాగం అంటున్నారు కదా పంపిస్తాను అంటాడు నీలకంఠం
అనవసర గొడవలు వద్దు..పూజకు వెళ్లడం మంచిది అంటాడు నీలకంఠం. ఇదే సమయంలో మాస్టర్ ప్లాన్ అమలు చేయాలంటాడు. మీనా ఎలాగూ ఓడిపోతుంది ఇంట్లోంచి పంపించేయాలని ప్లాన చేసి మీనా బట్టలు సర్దేసి హాల్లో పెట్టేస్తుంది. రోహిణి, మనోజ్ కూడా సపోర్ట్ చేస్తారు. మీనా గెలిస్తే నువ్వు కూడా చెప్పింది చేయాలి అంటాడు బాలు-సత్యం. మీనా సంతోషంగా ఎంట్రీ ఇస్తుంది..ప్రభావతి మాత్రం ఇంకా సంబరంగానే ఉంటుంది. బామ్మకు కాల్ చేసి సంజయ్, మౌనికకు బట్టలు తీసుకురావాలా అని అడగండి అంటుంది..ప్రభావతి ఫేస్ మారిపోతుంది. బాలు కూడా తన చెల్లెలు వస్తుందనే సంతోషంతో గంతులు వేస్తాడు. పందెంలో ప్రభావతి ఓడిపోయిందని..ఇప్పుడు మీనా చెప్పినట్టే వినాలని బాలు గుర్తుచేస్తాడు.
మీనా పూజ కోసం అన్నీ సిద్ధం చేస్తుంటుంది...శ్రుతి వచ్చి మీనాతో వచ్చి మాట్లాడడం చూసి రోహిణికి అనుమానం వస్తుంది...అది గమనించిన మీనా శ్రుతి..ఇద్దరూ వాదించుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎంట్రీ ఇచ్చిన సుశీలమ్మ...అక్కచెల్లెళ్లులా ఉండాల్సిన మీరు ఎందుకు గొడవ పడుతున్నారని అడుగుతుంది. అదంతా పెద్ద కథ అని బాలు తప్పించుకుంటాడు.























