Madhuranagarilo July 27th: శిరోజా వాసంతి చెప్పిన మాటలు తలుచుకొని ఎలాగైనా విల్సన్ కు దగ్గరవ్వాలని అనుకుంటుంది. లేదంటే మరో ఆడదాని దగ్గరికి వెళ్తాడని భయపడుతుంది. తన మనసు అలా వెళ్లకూడదు అంటే ఎలాగైనా తను దగ్గర అవ్వాలని అనుకుంటుంది. ఇక విల్సన్ బయటికి వెళ్తాను అనటంతో వెళ్లొస్తాను అని అనమంటుంది.


ఇక విల్సన్ ఇంటికొస్తే ఏముంటుంది తను దగ్గరికి రానివ్వదన్నా చిరాకు తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక వెంటనే శిరోజా విల్సన్ పట్టుకొని చిన్న కాపురం పెడతావా ఎప్పుడు దాని ఇంటి చుట్టే తిరుగుతావా అంటూ తనలో ఉన్న అనుమానాన్ని ప్రశ్న రూపంలో అడుగుతుంది. వెంటనే విల్సన్ తను అటువంటి పనులు చేయను అనటంతో తన భర్త మంచోడు అని అనుకుంటుంది.


ఇక సాయంత్రం వచ్చేటప్పుడు స్వీట్లు, పువ్వులు తీసుకొని రమ్మంటుంది. ఎందుకు పూజ చేస్తావా అని అంటాడు విల్సన్. దాంతో సిగ్గుపడుతూ వచ్చాక చెబుతాను అని అంటుంది. విల్సన్ అక్కడి నుండి వెళ్ళాక మనం ఇద్దరం చేసుకునే పూజ అని అంటుంది. మరోవైపు శ్యామ్ తండ్రి గుడిలో రాధ శ్యామ్ ను కొట్టిన విషయాన్ని గుర్తుకు చేసుకొని బాధపడుతూ ఉంటాడు.


వెంటనే మధుర.. రాధ అలా చేసినందుకు బాధపడింది కదా తప్పుడు తెలుసుకుంది కదా అంటుంది. కానీ వాడు ఎంత బాధ పడుతున్నాడో అని ఆయన అనడంతో వెళ్లి ఒకసారి చూసేద్దాం అని అక్కడి నుంచి శ్యామ్ గది దగ్గరికి వెళ్తారు. మరోవైపు శ్యామ్ రాధకు పెళ్లి కాలేదు పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తూ ఉంటాడు. మధురవాళ్ళు వచ్చి శ్యామ్ ని చూసి ఆశ్చర్యపోతారు.


ఎందుకలా చేస్తున్నావ్ అనటంతో రాధకు పెళ్లి కాలేదు కదా అని అంటాడు. రాధకు పెళ్లి కాకపోతే ఏంటి అనటంతో.. తనకు పెళ్లయిందని తన భర్త కోసం వెతుకుతున్నాము కదా ఇప్పుడు తన పెళ్లి కాలేదని తెలిసింది కాబట్టి తన భర్త గురించి వెతకాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు. కానీ మధుర దంపతులు ఆశ్చర్యంగా కనిపిస్తారు.


ఇక విల్సన్ మల్లెపూలు తీసుకొని ఈరోజు తన ఫస్ట్ నైట్ అని తెగ సంబరపడిపోతూ ఉండగా గన్నవరం వచ్చి నువ్వు బంగారం కొనిచ్చేదాకా నీకు పెళ్ళాం నీ దగ్గరికి రాదు.. ఇప్పుడు ఏమి ఇవ్వకున్నా కూడా నిన్ను దగ్గరికి రమ్మనిదంటే ఒకసారి ఆలోచించు.. ఏదో చేయబోతుంది అని లేనిపోని మాటలు ఎక్కిస్తాడు. తను నీ దగ్గరికి రాకపోతే తనను రేప్ చేయి అంటూ సలహా ఇస్తాడు.


రాధ శ్యామ్ ని కొట్టినందుకు బాధపడుతూ ఉంటుంది. పండు కూడా కాస్త అలిగినట్లు కనిపిస్తాడు. ఏం జరిగింది అని అడగటంతో శ్యామ్ ను అందరి ముందు అలా కొట్టినందుకు బాధగా ఉంది అని.. నువ్వు అలా కొట్టి పెద్ద తప్పు చేశావు. సారీ అయినా అసలు చెప్పావా అని అడగటంతో లేదు అని అంటుంది. సారీ చెప్పకుండా ఇంకా పెద్ద తప్పు చేస్తున్నావు అనటంతో వెంటనే పండుకి సారి చెబుతుంది రాధ.


నాకు కాదు శ్యామ్ కి చెప్పాలి అనడంతో రాధ శ్యామ్ గదికి వెళుతుంది. ఇక సారీ చెప్పడానికి వచ్చాను అని అనటంతో పదిమంది ముందరకొట్టి ఇప్పుడు ఎవరూలేని సమయంలో సారి చెబుతున్నావా అంటాడు శ్యామ్. దాంతో రాధ కాలనీ వాళ్లందరి ముందు కూడా చెబుతాను అని అంటుంది. ఇక శ్యామ్ వద్దులే అని డోర్ పెడతాను నువ్వు సారీ చెప్పు అని అంటాడు. డోర్ పెట్టిన తర్వాత రాధ సారి చెప్పబోతుండగా పండు డోర్ తీయడంతో వెంటనే రాధకు డోర్ తగరడంతో శ్యామ్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది రాధ.


వెంటనే శ్యామ్ ఆశ్చర్యపోతాడు. ఇక రాధ కుదుట పడిన తర్వాత.. పండు సారీ చెప్పావా అని అడగటం తో  చెప్పాను అని అంటుంది. నా ముందర చెప్పు అని అంటాడు పండు. తరువాయి భాగంలో శ్యామ్ రాధ దగ్గరికి వచ్చి నీకు పెళ్లి కాలేదని అర్థమయింది అనటంతో నాకు పెళ్లి కాలేదు అని అంటుంది రాధ. అందుకే ఇప్పుడే నీ మెడలో కట్టడానికి తాళిబొట్టు తీసుకొచ్చాను అని తాళి కడతాడు. పక్కనే పండు కూడా ఉంటాడు. ఇక రాధ ఏమి అనకుండా మౌనంగా నిలబడి తాళి కట్టించుకుంటుంది.


also read it : Trinayani July 26th: ‘త్రినయని’ సీరియల్: ఆవు పేడలో ఎలర్జీ మందు కలిపిన వల్లభ, తిలోత్తమా ప్లాన్ బోల్తా కొట్టించిన గాయత్రి పాప?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial