Seethe Ramudi Katnam Today Episode తల్లి ఇంటికి వచ్చిన వీడియో గుర్తు చేసుకొని ప్రీతి గదిలో ఒంటరిగా కూర్చొని బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. ప్రీతిని అలా చూసి విద్యాదేవి దగ్గరకు వెళ్తుంది. ఏమైందని అడుగుతుంది. అమ్మ గురించి ఆలోచిస్తున్నానని చెప్తుంది. ఇక సీత రామ్‌లు కూడా ప్రీతి మాటలు విని లోపలికి వస్తారు.


ప్రీతి: అమ్మ ఇంటి వరకు వచ్చింది కానీ నన్ను కలవకుండా వెళ్లిపోయింది. అమ్మకి నేను అంటే ఇష్టం లేదేమో నా మీద కోపంగా ఉందేమో అందుకే నన్ను కలవకుండా వెళ్లిపోయిందేమో.. అయినా అమ్మ నన్ను వదిలి వెళ్లిపోయినప్పుడు నేను చిన్న పిల్లని ఆ వయసులో నేను ఏమైనా తప్పు చేసి ఉంటే అమ్మ నన్ను క్షమించాలి కదా. అప్పుడు వెళ్లిపోయి మళ్లీ నన్ను కలవకుండా వెళ్లిపోయింది టీవీలో అమ్మని చూస్తుంటే ఏడుపొస్తుంది. 
రామ్: ప్రీతి అని అనగానే అన్నయ్య అని హగ్ చేసుకుంటుంది. ఏడవకు ప్రీతి అమ్మ మనదగ్గరకు వస్తుంది. 
సీత: అవును ప్రీతి అమ్మ తిరిగివస్తుంది.
ప్రీతి: మళ్లీ వచ్చి వెళ్లిపోయింది కదా. మనం ఏం తప్పు చేశాం అన్నయ్య. 
విద్యాదేవి: తప్పు మీది కాదు ప్రీతి మిమల్ని వదిలేసి అలా వెళ్లిపోయిన మీ అమ్మది. ఆ రోజు తాను వెళ్లకుండా ఉండాల్సింది. ఆ రోజు వెళ్లకుండా ఉన్నా లేదా మిమల్ని మీ నాన్నని తీసుకెళ్లిపోయి ఉంటే ఇలా ఉండేది కాదేమో.
సీత: ప్రీతి నీకో గుడ్ న్యూస్ చెప్పనా ఆ రోజు మీ అమ్మ మిమల్ని కలవలేదు కానీ తాను చేసిన స్వీట్స్ మీకు అందేలా చేసింది.
రామ్: అవును ప్రీతి ఆ రోజు సీత మనకు ఇచ్చిన స్వీట్స్ అమ్మ ఇచ్చినవే. అమ్మని త్వరగా కనిపెడితే  మనకు అన్ని నిజాలు తెలుస్తాయి.
ప్రీతి: అమ్మని ఎప్పుడు కలుస్తాం అన్నయ్య నాకు ఎప్పుడెప్పుడు అమ్మని కలుస్తామా అని ఉంది. అమ్మ ఒడిలో తల పెట్టుకొని పడుకోవాలని ఉంది. చిన్నప్పటిలా అమ్మ జోల పాట పాడితే పడుకోవాలి అని ఉంది.
సీత: పైకి చెప్పడం లేదు కానీ మీ అన్నయ్య పరిస్థితి అదే. అయినా మీరు బాధ పడకండి పిల్లల్ని వదిలి తల్లి ఉండలేదు. త్వరలోనే మీ అమ్మ తిరిగి వస్తుంది. మీరు మిస్ అయిన ప్రేమ మొత్తం మీకు ఇస్తుంది.


విద్యాదేవి కూడా ప్రీతి, రామ్‌లకు త్వరలోనే మీ అమ్మ వస్తుందని చెప్తుంది. ఇక సీత ప్రీతి, రామ్‌లను నవ్విస్తుంది. ఇక ఉదయం సీత మొక్కలకు నీరు పెడుతుంటే సాంబ వచ్చి మీరు ఆ పని చేయొద్దని అంటాడు. సీత చేస్తాను అంటే సాంబ పొగడ్తలతో ముంచేస్తాడు. ఇంతలో శివకృష్ణ, లలితలు వస్తారు. సీత ఇద్దరిని హగ్ చేసుకొని సంతోషంగా ఉంటుంది. ఇక ప్రీతి, రామ్‌లు నవ్వుకుంటూ ఉంటే సీత వచ్చి మీ మేనమామ, అత్త వచ్చారని చెప్తుంది. విద్యాదేవి కూడా అన్నయ్య, వదిన అనుకుంటూ కిందకి దిగుతుంది. ఇక ప్రీతి, రామ్‌లు వాళ్లదగ్గరికి వెళ్లబోతే జనార్థన్ ఆగండి అని అరుస్తాడు. అన్నయ్య అనే పదానికి మాయని మచ్చ అని ఏ  అన్నయ్య చేయకూడని తప్పు చేశారని, ఈయన చేసిన తప్పునకు సుమతి తనకు దూరం అయిందని తనని ప్రేమించినందుకు సుమతిని తిట్టినా ఈ దుర్మార్గుడు అని తిడతాడు.


సుమతి ఎంత ప్రాధేయపడిన తన సుమతిని కనీళ్లతో వెళ్లగొట్టాడని చెప్తాడు. తనకి పుట్టిళ్లు లేకుండా చేశావని ఏడ్చేదని ఈ రాక్షసుడి వల్లే తనకు సుమతి దూరం అయిందని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. ఇక లలిత శివకృష్ణ ఎంత బాధ పడ్డాడో చెప్తుంది. అయినా జనార్థన్ నమ్మడు. సుమతి మీద ద్వేషంతోనే మధు ప్రేమని అంగీకరించలేదని అంటాడు. ఇక సీత ఇదంతా మహాలక్ష్మి అత్తయ్య ట్రైనింగా అని అడుగుతుంది. ఇంతలో మహాలక్ష్మి వచ్చి తాను ఏం చేశానని సుమతి జనాని ప్రేమించినప్పుడు వద్దని సీత, రామ్‌లు కలిశారని ఇప్పుడు కావాలి అనుకుంటున్నారా అని అంటుంది. ఇక జనార్థన్ ఎంతకీ ఒప్పుకోకపోవడం వల్ల శివకృష్ణ, రామ్, లలిత, సీతలు జనాని ఒప్పించే ప్రయత్నం చేస్తారు.. ఇక మహాలక్ష్మి, విద్యాదేవి గొడవ పడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: అమ్మా అంటూ లక్ష్మీని అందరి ముందు హగ్ చేసుకున్న జున్ను.. లక్ష్మీ దొరికిపోతుందా!