Seethe Ramudi Katnam Today Episode సీత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సుమతి అత్తమ్మ బతికి ఉందని అందరూ సంతోషిస్తే మహాలక్ష్మి మాత్రం డల్ అయిపోయిందని చెప్తుంది. ఇకపై మహాలక్ష్మిని ఓ ఆట ఆడుకుంటానని సీత అంటుంది. ఇక సుమతి అత్త కాల్ చేస్తే తనకు ఉన్న సమస్యలు ఏంటో అడిగి తెలుసుకోవాలని సీత తండ్రితో చెప్తుంది. ఇక సీత సుమతి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అక్కడే జనార్థన్ అటూ ఇటూ తిరగడం చూసి ఆయన దగ్గరకు వెళ్తుంది.
సీత: మామయ్య ఇప్పుడు అత్తమ్మ బతికే ఉందని తెలిసింది కాదా అందుకే మా నాన్నని వెతికే పనిలో ఉండమని చెప్తాను. మీరు కూడా వెతుకుతారా.
జనార్థన్: ఎందుకు వెతకను. వెతికిస్తాను.
సీత: అత్తమ్మ అప్పుడప్పుడు మా నాన్న వాళ్లకి ఫోన్ చేసి మాట్లాడుతుంటుంది. అలాగే మీకు కాల్ చేస్తే మాట్లాడుతారా. ఎలా రియాక్ట్ అవుతారు. అత్తమ్మ మీకు దూరం అయి చాలా రోజులు అయింది కదా.
జనార్థన్: అదేం మాట సీత సుమతి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. తను ప్రాణాలతో తిరిగి వస్తే మొదటి సంతోషించేది నేనే.
సీత: కానీ ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు మారిపోయావి కదా మామయ్య. మీ జీవితంలోకి ఇప్పుడు మహా అత్తయ్య వచ్చారు. మహాలక్ష్మి అత్తయ్య సుమతి అత్తమ్మ స్థానంలో ఉండి అన్నీ తానై చూసుకుంటుంది. సుమతి అత్తమ్మ తిరిగి వస్తే అత్తయ్య ఆ స్థానాన్ని తిరిగి ఇస్తుందా.
మహాలక్ష్మి: ఇది నాకు జనాకు గొడవలు పెట్టేలా ఉంది. వెంటనే ఆపకపోతే నా కొంపముంచేలా ఉంది.
ఇక మహాలక్ష్మి వచ్చి సుమతి తిరిగి వస్తే తన స్థానం తనకి ఇచ్చేసి తన దారి తను చూసుకుంటానని అంటుంది. ఆ మాటలకు జనార్థన్ దట్ ఈజ్ మహాలక్ష్మి అని అంటాడు. ఇక సీత మహాలక్ష్మి మాటలు నిజమేనా లేక నాటకమా అనుకుంటుంది. త్వరలోనే సుమతిని వెతికి తీసుకొస్తానని అప్పుడు మీరు అన్న మాట ప్రకారం ఈ ఇంటిని వదిలి వెళ్తారో లేదో చేస్తానని సీత అంటుంది. ఇక మహాలక్ష్మి సీత నిజంగానే సుమతిని తీసుకొస్తే తన పరిస్థితి ఏంటా అని తల పట్టుకుంటుంది. మహాలక్ష్మి దగ్గరకు అర్చన వస్తుంది. సీత గురించి అర్చనకు చెప్తుండగా విద్యాదేవిగా ఉన్న సుమతి మహాలక్ష్మి, అర్చనల మాటలు వింటుంది.
మహాలక్ష్మి: సుమతి తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటా అని సీత జనాని అడిగింది. సుమతి ఎక్కడున్నా తొందరగా తీసుకొస్తా అని సీత, జనా కూడా సుమతిని వెతికి తీసుకొస్తానని అంటున్నాడు.
అర్చన: సుమతిని వాళ్లు వెతికితే నీ ఉనికి ఇబ్బంది కదా మహ.
మహాలక్ష్మి: అందుకే సుమతి ఎక్కడున్నా వెతికి నేనే పట్టుకొని వల్లకాటికి పంపిస్తా. ఈసారి నేనే నా చేతులతో సుమతిని చంపేస్తాను. దాని అడ్రస్ కాదు కదా ఆనవాళ్లు కూడా దొరకకుండా చేస్తా.
విద్యాదేవి: నువ్వు అంత దుర్మార్గురాలివి అని తెలిసి నేను నీకు ఎదురు పడలేదు. నా గురించి ఇప్పుడు నీకు తెలీదు. నేనుఅప్పుడే బయట పడను మహాలక్ష్మి. టైం వచ్చినప్పుడు నీ గురించి అందరికీ తెలిసేలా చేసి అప్పుడు నేను ఎవరో అందరికీ చెప్తాను.
అందరూ భోజనాలకు కూర్చొంటారు. మహాలక్ష్మి రాకపోవడంతో వడ్డించొద్దని అర్చన వాళ్లు అంటారు. ఇంతలో సీత వచ్చి నేను ఎవరి కోసం ఉండనని తినేస్తాను అని వడ్డించుకుంటుంది. ఇక సీత అన్నం పెట్టుకొని కింద కూర్చొని తింటుంది. విద్యాదేవి వచ్చి సీత కింద కూర్చొని తినడం చూసి షాక్ అయిపోతుంది. ఎందుకు కింద కూర్చొని తింటున్నావని అడుగుతుంది. దాంతో రేవతి సీతకి టేబుల్ మీద కూర్చొనే అర్హత లేదని అంటుంది. దాంతో విద్యాదేవి రామ్ని ప్రశ్నిస్తుంది. అందరూ మహకు సపోర్ట్ చేస్తారు. విద్యాదేవి సీతకు సపోర్ట్గా మాట్లాడుతుంది. నువ్వు సుమతి మేనకోడలివి అని విద్యాదేవి అంటే నేను ఎవరికి మేనకోడలు అయినా మహాలక్ష్మికే కోడలిని అని అంటుంది సీత. సీతకు ఎవరూ విలువ ఇవ్వడం లేదని విద్యాదేవి అందరి మీద సీరియస్ అవుతుంది. సీతని పైన కూర్చొని తినమని చెప్పమని రామ్ని అంటుంది. దాంతో రామ్ సైలెంట్ అయిపోతాడు. రామ్ పిన్నితో చెప్తాను నవ్వు పైకి ఇచ్చి తినమని అంటాడు. ఇక సీత వద్దు అని నన్ను కోడలిగా చూడమని మీ అమ్మ సుమతిలా చూసుకోమని అంటావా అని అడుగుతుంది. అందరూ మహాలక్ష్మి గురించి నెగిటివ్ గా మాట్లాడితే రామ్ మహాలక్ష్మిని తీసుకొచ్చి నీతో ప్రేమగా ఉండేలా చేస్తానని అంటాడు. మహాలక్ష్మిని తీసుకురావడానికి పైకి వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: గాయత్రీదేవి అండతో మాంత్రికుడిని చంపేసిన నయని.. గెటప్ మార్చేసిన గంటలమ్మ!