Seethe Ramudi Katnam Serial Today Episode సీతని రౌడీలు కిడ్నాప్ చేస్తారు. చలపతి ఇంట్లో వాళ్లకి విషయం చెప్తాడు. ఇక సీత తల్లి లలిత సీత గురించి ఆలోచిస్తూ సుమతికి కాల్ చేయాలి అనుకుంటుంది. ఇంతలో సుమతి అలియాస్ టీచరే లలితకు కాల్ చేస్తుంది. లలిత సుమతితో సీత రోజు పూజ చేస్తుందా రామ్, సీతలు రేపు గుడిలో నిద్ర చేస్తారా అని అడుగుతుంది. లలిత మాటలకు టీచర్ సమాధానం చెప్పకుండా అన్నయ్య ఉన్నాడా కాల్ చేస్తే అవ్వడం లేదని అంటుంది.
సీత కిడ్నాప్ విషయం చెప్తుంది. లలిత షాక్ అయిపోతుంది. జనార్థన్ పోలీసులకు చెప్పారని ఎంక్వైరీ చేస్తున్నారని చెప్తుంది. లలితకు కంగారు పడొద్దని అన్నయ్య రాగానే విషయం చెప్పమని అంటుంది. లలిత ఏడుస్తూ భర్త రాగానే విషయం చెప్పి అక్కడికి వస్తామని అంటుంది. సీతకి ఏం కాకూడదని మొక్కుకుంటుంది. ఇక రౌడీలు సీతని ఓ కనెస్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరకు తీసుకొస్తారు. సీత వాళ్ల నుంచి విడిపించుకొని పరుగులు తీస్తుంది. ఇంతలో సీతకి ఎదురుగా నాగు వస్తాడు. సీత భయంతో ఆగిపోతుంది. నాగు పెద్ద కత్తి తీస్తాడు. రౌడీలు మొత్తం సీతని చుట్టు ముడతారు. సీతని పట్టుకొని లాక్కెళ్తారు. మహాలక్ష్మీ ఇంటి దగ్గర అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో ఎస్ఐ త్రిలోక్‌తో పాటు కొంత మంది పోలీసులు వస్తారు. త్రిలోక్‌కి కూడా మన ప్లాన్ తెలీకూడదు అని మహాలక్ష్మీ అర్చనతో చెప్తుంది.
త్రిలోక్ మిగతా పోలీసులతో చెప్పి ఎంక్వైరీ ఎక్వైప్మెంట్ ఏర్పాటు చేయమని అంటాడు. వాళ్లు ఏర్పాటు చేసి అందులో సీత ఫోన్ నెంబరు ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేయాలని ఏర్పాటు చేస్తారు. ఇక ఏసీపీ కూడా వస్తారు. సీతకి ఏం కాకుండా తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పి సిగ్నల్ ట్రేసింగ్ మొదలు పెట్టమని చెప్తారు. దాంతో పోలీసులు ఆ పనిలో పడతారు. రౌడీలు డబ్బు కోసం అయితే మీలో ఎవరికైనా ఫోన్ చేస్తారని అందరి ఫోన్లు ఒక దగ్గర పెట్టిస్తారు ఏసీపీ. సీతకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అంటే బయట ఎవరూ లేరని టీచర్ అంటుంది. దాంతో ఏసీపీ ఇంట్లో ఉన్నారా అంటే జనార్థన్ లేరని చెప్తాడు.
ఇంతలో టీచర్ ఏసీపీతో సీత తండ్రి కూడా పోలీసే అని చెప్తుంది. 24 గంటల్లో కనిపెట్టేస్తాం అని ఇంటి చుట్టూ పోలీసులను పెడతారు. సీత కిడ్నాప్ అయిన లొకేషన్‌లో సీసీ టీవీ ఫుటేజ్ తెప్పించమని చెప్తారు. ఏసీపీ రంగంలోకి దిగడంతో మహాలక్ష్మీ, అర్చన ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటారు. ఇక సీతని రౌడీలు కట్టేస్తారు. మరోవైపు అర్చనకు ఫోన్ వస్తుంది. పోలీస్తో అర్చన తన ఫోన్ అని చెప్పడంతో స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమని అంటారు. దాంతో అర్చన ఫోన్ లిఫ్ట్ చేయడంతో అది కంపెనీ కాల్ అవుతుంది. అర్చన, మహాలక్ష్మీ అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: రోడ్ల మీద తిరుగుతూ పిచ్చోడిలా ఏడుస్తున్న కార్తీక్.. 2 రోజుల్లో ఆపరేషన్.. శౌర్య బతుకుతుందా!