Seethe Ramudi Katnam Serial Today Episode ప్రీతి, ఉషలు చిలుకూరి బాలాజీ టెంపుల్‌కి బయల్దేరుతారు. తమతో పాటు ఎవరు వస్తారా అనుకుంటే విద్యాదేవి టీచర్ నేను వస్తాను అని అంటుంది. ఆ మాటకి ఇద్దరూ మీరొస్తారా అని నోరెళ్లబెడతారు. జనార్థన్ కూడా టీచర్‌ని తీసుకెళ్లమంటారు. ప్రీతి, ఉషలు ఆవిడ ఇంట్లో ఉండటమే ఇష్టం లేదు అలాంటిది ఆమెతో గుడికి ఎలా వెళ్తామని అడుగుతారు. మహాలక్ష్మీ పిన్ని కోసం వెళ్తున్నాం ఆమెకు అన్యాయం చేసిన ఆవిడ తోడు ఎందుకని అడుగుతారు. ఇంతలో సీత అక్కడికి వస్తుంది.


అర్చన సీతని తీసుకెళ్లమని అంటుంది. ప్రీతి, ఉషలు సీతతో రా వదినా నువ్వు వస్తే మేం చాలా హ్యాపీగా ఉంటామని అంటారు. సీత వస్తానని చెప్తుంది. చలపతి ప్రీతి, ఉషలతో మీరు సీతని వదిన అని పిలుస్తుంటే నా నోట్లో పంచదార పోసినట్లుందని అంటాడు. ఇక మహాలక్ష్మీ చలపతితో నువ్వు ఇలాంటి వాడివి అనే వాళ్లు నీతో రావడానికి ఇష్టం పడటం లేదని మహాలక్ష్మీ చెప్తుంది. ఇక తాను డ్రైవర్‌కి జాగ్రత్తగా తీసుకెళ్లమని చెప్తామని అర్చన, మహాలక్ష్మీ వెళ్తారు. సీత రెడీ అవ్వడానికి వెళ్తుంటే విద్యాదేవి వెనకాలే వెళ్లి ప్రీతి, ఉషలతో నువ్వు వెళ్లడం ఇష్టం లేదని చెప్తుంది. నిన్నే ప్రత్యేకంగా రమ్మని చెప్పడం అనుమానంగా ఉందని టీచర్ అంటుంది. సీత అలా ఏం లేదని చెప్తుంది. వాళ్లు నా ఆడపడుచులు నా భర్త చెల్లెళ్లు అని అంటుంది. టీచర్ ఎంత చెప్పినా సీత వినదు. మహాలక్ష్మీ నిన్ను ఏదో చేయబోతుందని వాళ్లు మహా కోసం రావడం ఇన్నాళ్లు తర్వాత రావడం తల్లులు తోడుగా వెళ్లకుండా నిన్ను పంపాలి అనుకోవడం ఏదో ప్లాన్‌గా ఉందని అంటుంది. అదేం లేదని ఏం భయం పెట్టుకోవద్దని సీత అంటుంది. ఎంత చెప్పినా సీత వినకపోవడంతో దేవుడి దగ్గర దీపం పెట్టి వెళ్లమని టీచర్ చెప్తుంది. 


ఇక మహాలక్ష్మీ రౌడీ నాగుకి కాల్ చేస్తుంది. సీత తన ఇద్దరు పిల్లలతో గుడికి వస్తుందని కాపు కాసి సీతని కిడ్నాప్ చేయమని చెప్తుంది. సీత దీపం పెడుతుంది. టీచర్ సీతతో నువ్వు రామ్ ఎప్పటికీ కలిసి ఉండాలని రేపు గుడిలో నిద్ర చేయాలని చెప్తుంది. అలా చేయకపోతే విడిపోతామా అని సీత అంటే టీచర్ ఎమోషనల్ అయిపోతుంది. దానికి సీత ఎందుకు అత్తమ్మ అంత ఫీలవుతారు నేను మామ వెలిగించిన దీపాలు ఉదయం వరకు వెలిగాయి కదా అంటుంది. దాంతో టీచర్ ఆరిపోయిన దీపాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇక టీచర్ సీతతో ఎలాంటి పరిస్థితుల్లో అయినా రేపు గుడిలో నువ్వు రామ్ దీపం వెలిగించి నిద్ర చేయాలని చెప్తుంది. ఇక సీత బుట్ట తీసుకొని గుడికి బయల్దేరుతుంది.


ప్రీతి, ఉషలతో జాగ్రత్త అని చెప్తుంది. నాకేం జరగదు అని చెప్పి సీత బయల్దేరుతుంది. ఇక సాంబ డ్రైవర్‌ని తీసుకొస్తే మహాలక్ష్మీ జాగ్రత్తలు చెప్తుంది. సీత కిందకి దిగుతుండగా మెట్ల మీద నుంచి జారిపోతుంది. పూజ సామాగ్రి ఉన్న బుట్ట కింద పడిపోతుంది. అందరూ కంగారు పడతారు. శుభమా అని గుడికి వెళ్తుంటే ఇలా జరిగిందేంటి అని టీచర్ కంగారు పడుతుంది. మహాలక్ష్మీ, అర్చన నవ్వుకుంటారు. టీచర్ సీతని ఆపాలని చాలా ప్రయత్నిస్తుంది. కుడి కన్ను కూడా అదురుతుందని చెప్తుంది. ఎవరినీ గుడికి వెళ్లొద్దని చెప్తుంది. మహాలక్ష్మీ టీచర్‌తో వాళ్లు వచ్చిందే గుడికి వెళ్లడానికి వచ్చారు కదా వెళ్లమని చెప్తుంది. అందరినీ ఒప్పించడానికి టీచర్ చాలా ప్రయత్నిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: సత్యభామ సీరియల్: కొత్త లవర్‌తో సత్య సరసాలు.. తలపట్టుకున్న క్రిష్‌.. అయ్యో పాపం అజ్ఞాతశక్తి!