Seethe Ramudi Katnam Serial Today February 10th: రామ్ సూసైడ్ చేసుకుంటాడా.. సీత కన్నీళ్లకు మహా కరుగుతుందా!
Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మికి సారీ చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటానని రామ్ సీతని బెదిరించడంతో ఇవాళ్లి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Today Episode సూసైడ్ చేసుకుంటానని రామ్ మేడ మీదకు వెళ్లి డోర్ లాక్ వేసుకుంటాడు. సీత ఎంత పిలిచినా మా పిన్నికి సారీ చెప్తేనే వస్తాను అంటాడు. సీత మాట్లాడుకుందాం అన్నా వినడు. సారీ చెప్తావా లేదా అని అంటాడు. ఇక అప్పడే పక్కనే ఉన్న కండీ కింద పడుతుంది. అది చూసి సీత కంగారు పడుతుంది. కుండీలా నేను కింద పడి నా తల పగిలి పోవాలి అంటే చెప్పు అని రామ్ సీతని అడుగుతాడు. దూకేస్తా అంటూ బెదిరిస్తాడు. ఇంతలో అర్చన, గిరిధర్‌లు బయటకు వస్తారు. వాళ్లు కూడా మహాకి సారీ చెప్పమని అంటారు. ఇక రేవతి, చలపతి కూడా వస్తారు.
రేవతి: రేయ్ రామ్ కిందకి రారా ఎందుకు అలాంటి పిచ్చి పని చేస్తావ్.
రామ్: నేను రాను దూకి చచ్చిపోతాను.
అర్చన: మీరు ఎవరు ఎంత పిలిచినా రామ్ కిందకి రాడు సీత మహాకు సారీ చెప్తేనే కిందకి వస్తాడు. లేదంటే దూకేస్తాడు.
రేవతి: ఎందుకు మీరు రామ్‌ని రెచ్చగొడుతున్నారు. రామ్‌కి ఏమైనా అయితే మీరు బాధ్యత తీసుకుంటారా..
సీత: ఏవండీ ఇంత మంది చెప్తున్నా మీరు కిందకి రారు ఏంటండి రండి.
రామ్: ఎవరు చెప్పినా నేను వినను. అరగంట టైం ఇస్తున్నా ఆలోపు నువ్వు మా పిన్నికి సారీ చెప్పావా సరే సరే లేదంటే నేను దూకేస్తా నాకు మా పిన్ని గౌరవం కంటే నా ప్రాణం ముఖ్యం కాదు. నీకు నీ ఆత్మగౌరవం కావాలో నా ప్రాణం కావాలో తేల్చుకో సీత. నేను చావాలో బతకాలో చెప్పు.
చలపతి: నువ్వు చేసేది తప్పు రామ్ కిందకి దిగురా..
సీత: మహాతో.. అత్తయ్య మీరు ఒకసారి బయటకు రండి. ఆయన మేడ మీద నుంచి దూకేస్తా అంటున్నారు.
మహాలక్ష్మి: తెలుసు..
సీత: తెలిసే మీరు రూంలో ఉన్నారా..
మహాలక్ష్మి: రామ్ కిందకి రావాలి అంటే నువ్వు ఏం చేయాలా తెలుసా..
సీత: ఆయన దూకితే ఏమవుతుందో తెలిశా..
మహాలక్ష్మి: రామ్ దూకితే అందుకు కారణం నువ్వే అవుతావ్. నువ్వు నాకు సారీ చెప్పే అంత వరకు నేను రామ్‌తో మాట్లాడను.
సీత: నేను ఎందుకు సారీ చెప్పాలి తప్పు చేసింది మీరు.
మహాలక్ష్మి: నాతో గొడవపడటానికి వచ్చావా..
సీత: అంత టైం లేదు అత్తయ్య..
మహాలక్ష్మి: నీకు రామ్ ఇచ్చిన టైంలో పావు గంట అయిపోయింది. నాకు నువ్వు సారీ చెప్తే రామ్ చక్కగా కిందకి వస్తాడు. నాకు పౌరుషం ఉంటే ఒక అర్థం నీకు ఎందుకు. నువ్వు నా కాళ్లు పట్టుకునే వరకు రామ్ కిందకి రాడు.
రామ్: ఏం నిర్ణయించుకున్నావ్ సీత నీ పంతానికా నీ ప్రాణం పోవడానికా..
సీత: ఎందుకు ఇలా చేస్తున్నారు. ఎందుకు అందరూ నా మీద కక్ష కట్టినట్లు ఇలా చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మీ పిన్నికి నీకు ఏ దిగులు భయం లేవు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్.
అర్చన: ఆ దిగులు భయం నీకు ఉన్నాయా.. ఇప్పుడు కూడా నువ్వు మహానే అంటున్నావ్..
రేవతి: ఈ ఒక్కసారికి ఓడిపో సీత ఇది ముందుకు వెళ్లి చేసే యుద్ధం కాదు నువ్వు ఓడిపోతేనే రామ్‌ని గెలుచుకుంటావ్. ఈ ఇంట్లో మనుషుల గురించి నీకు చాలా సార్లు చెప్పాను. వీళ్లకి మనుషుల ప్రాణాలు బంధాలు అంటే లెక్కేలేదు.
చలపతి: అవును అమ్మా పంతానికి పోవొద్దు. రామ్ అన్నంత పని చేస్తాడు. వెనకా ముందు ఆలోచించడు.
రేవతి: వెళ్లు సీత నీ భర్త ప్రాణాలను నువ్వే కాపాడుకో.
జనార్థన్: ఇంకా ఐదు నిమిషాలే ఉంది మహా.. ఇక్కడ నువ్వు అక్కడ సీత పట్టుదలతో ఉంటే రామ్ గతి ఏంటి. రామ్ కింద దూకేస్తాడు మహా.. పంతానికి ఇది టైం కాదు మహా.
మహాలక్ష్మి: నువ్వు సైలెంట్‌గా ఉండు జనా ఏం చేయాలో నాకు తెలుసు.
సీత: బయటకు రండి అత్తయ్య ఆయన్ను కాపాడండి. నేను మీకు సారీ చెప్తాను.
మహాలక్ష్మి: మళ్లీ మాట మార్చవు కదా..
సీత: ఆయన మీద ఒట్టు.. రండి అత్తయ్య..
రామ్: సీతకి ఇచ్చిన టైం అయిపోయింది.
సీత: ఒక్క నిమిషం ఆగండి..
మహాలక్ష్మి: రామ్ ఆగు. సీత సారీ చెప్పడానికి ఒప్పుకుంది నువ్వు కిందకి రా..
రామ్: సరే పిన్ని..సీత పరుగెత్తుకుంటూ వచ్చి రామ్‌ని హగ్ చేసుకుంటుంది. ఏడుస్తుంది. మీకేమైనా అయితే నేను ఏం కావాలి అండీ అని ఏడుస్తుంది.
అర్చన: నీ దొంగ ఏడుపులు ఆపి మహాకి సారీ చెప్పు..
సీత: నన్ను క్షమించండి..
మహాలక్ష్మి: ఊరికే క్షమించమని అడిగితే సరిపోతుందా.. నిన్న రామ్ నా కాళ్లు పట్టుకొని క్షమించమని అడిగాడు. సీతతో కూడా అలాగే చెప్పిస్తా అన్నాడు. అప్పుడే నేను రామ్‌తో మాట్లాడుతాను అని చెప్పాను. సీత చేసిన అవమానానికి నేను బాగా హర్ట్ అయ్యాను. సీత నా తల మీద నింద మోపింది కాబట్టి నా కాళ్లు పట్టుకోవాలి అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: మృణాల్: ఈ పల్లెటూరు అమ్మాయి ఎవరంటూ అవమానించారు - బాడీషేమింగ్‌పై మృణాల్ కామెంట్స్