Seethe Ramudi Katnam Serial Today Episode ఉదయం సీత అందరికీ టిఫెన్ పెడుతుంది. ఇంతలో విద్యాదేవి అలియాస్ సుమతి అక్కడికి వస్తే సీత పిలిచి కూర్చొపెట్టి టిఫెన్ పెడుతుంది. ఇంతలో మహాలక్ష్మీ సైగ చేయడంతో అర్చన రామ్‌తో ఏంటి రామ్ సీత మీ అమ్మని చంపిన హంతకురాలిని మన పక్కన కూర్చొపెట్టి వడ్డిస్తుందని అంటుంది. గిరిధర్ అందుకొని సీత బలవంతంగా ఆమె సుమతి వదిన అని మనతో ఒప్పించేలా ఉందని అంటాడు. రామ్ కోపంగా సీత వంక చూస్తాడు. 


సీత: ఆవిడ మా అత్తమ్మ అని నేను నమ్ముతున్నాను కాబట్టే అలా పిలుస్తున్నాను. మీరేం బలవంతంగా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు.
రామ్: ఇంత మంది ఆవిడ మా అమ్మ కాదు అని నమ్ముతున్నా నువ్వు విరుద్దంగా ప్రవర్తిస్తున్నావ్ సీత.
సీత: మీ నమ్మకం మీది నా నమ్మకం నాది అయినా మహాలక్ష్మీ అత్తయ్య తనని ఇంటికి తీసుకొచ్చింది ఆవిడ సుమతి అత్తమ్మ అవునో కాదో తేల్చుకోవడానికే కదా.
మహాలక్ష్మీ: అవును తను సుమతి అని తానే నిరూపించుకోవాలి. అగ్ని పరీక్ష అనుకుంటారో విషమ పరీక్ష అనుకుంటారో మీ ఇష్టం కానీ తానే సుమతి అనడానికి స్ట్రాంగ్ రీజన్ కావాలి. 
గిరిధర్: పక్కా సాక్ష్యాలు ఉంటేనే మేం నమ్ముతాం లేదంటే ఆవిడ జైలుకి వెళ్లాల్సిందే.
రామ్: అనవసరంగా శ్రమ పడకు సీత ఆవిడ మా అమ్మ కాదు పిన్ని చెప్పిందే విను.
సీత: మీకు పక్కా ఆధారాలు కావాలి కదా నేను చెప్తాను అత్తమ్మ మామయ్యకు మీకు సంబంధించిన ఇష్టాలు తీపి గుర్తులు చెప్పు.
విద్యాదేవి: చెప్తాను ఆయనకు నా చేతితో చేసిన గుత్తి వంకాయ కూర అంటే ఇష్టం.


వెజ్, నాన్ వెజ్ అంటూ విద్యాదేవి అన్నీ చెప్తుంది. తను చెప్పినవన్నీ నాకు తెలుసు ఇవన్నీ తనకు ఎలా తెలుసు అని జనా అంటే సీత ఆవిడే సుమతి కాబట్టి తెలుసు అంటుంది. మహాలక్ష్మీ దానికి ఆవిడ ఏవో బట్టీ కొట్టి చెప్తుందని అంటుంది. అందరూ మహా చెప్పిందే నిజమని అంటారు. ఇంతలో చలపతి వచ్చి ఎవరో గాయత్రీ దేవి వచ్చిందని చెప్తాడు. మహాలక్ష్మీ పొలమారి కంగారు పడుతుంది. మహాలక్ష్మీ కంగారు చూసి సీత ఆలోచనలో పడుతుంది. అందరూ హాల్‌లో గాయత్రీ దగ్గరకు చేరుకుంటారు. గాయత్రీ పిల్లలు అని అదీ ఇదీ అంటూ మాట్లాడబోతే మహాలక్ష్మీ మాటి మాటికి అడ్డుకుంటుంది. సీత, విద్యాదేవిలకు అనుమానం వస్తుంది. మహాలక్ష్మీ గాయత్రీదేవిని బయటకు తీసుకెళ్లి చాటుగా మాట్లాడి ఏవేవో చెప్తుంటుంది. సీత చాటుగా చూస్తుంటుంది కానీ ఏం అర్థం కాదు. గాయత్రీ చెప్పిన ఏదో విషయానికి మహాలక్ష్మీ షాక్ అయి ఆమె చేతులు పట్టుకొని బతిమాలుతుంది. దాంతో ఆవిడ వెళ్లిపోతుంది. సీత అంతా పరిశీలించి మహాలక్ష్మీకి తెలీకుండా దాక్కుంటుంది. 


ఇక సీత జనార్థన్ దగ్గరకు వెళ్లి ఎందుకు మామయ్య మీరు నమ్మడం లేదు ఎవరూ నమ్మకపోయినా ఓకే కానీ మీరు ఎందుకు నమ్మడం లేదని అంటుంది. ఆవిడ పడుతున్న తపన మీకు అర్థం కావడం లేదా సుమతి అత్తమ్మ మీద మీకు ఉన్న ప్రేమతో ఆలోచించండి మీకే అర్థమవుతుందని అంటుంది. ఇక విద్యాదేవి ఇంటికి వచ్చిన డాక్టర్ గాయత్రీ దేవి గురించి ఆలోచిస్తుంది. సీత అక్కడికి రావడంతో మహాలక్ష్మీలో ఏదో కలవరపాటు ఉందని మహాలక్ష్మీ ఏదో దాస్తుందని ఆ రహస్యం మనకు ఉపయోగపడుతుందని అప్పుడు మనం మహాలక్ష్మీని ఇరుకున పెట్టొచ్చని సీత అంటుంది.


ఇంతలో రామ్ వచ్చి మీ ఇద్దరూ ఎప్పుడూ సీక్రెట్స్ మాట్లాడుతూ ఉంటారా ఏంటి అని అడుగుతాడు. మా పిన్ని గురించి తప్పుగా అనుకుంటున్నారని పిన్ని గొప్పదని నువ్వు మాత్రం ఈవిడను వదలడంలేదని తిడతాడు. మరోవైపు రాత్రి ఒక అమ్మాయి ముసుగు వేసుకొని మహాలక్ష్మీ గదికి వెళ్లి మహాలక్ష్మీని పొడవడానికి ప్రయత్నిస్తుంది. మహాలక్ష్మీ లేచి తప్పించుకుంటే ఆ అమ్మాయి పారిపోతూ విద్యాదేవిని ఢీ కొని ఆ చాకు విద్యాదేవి చేతిలో పెట్టి పారిపోతుంది. విద్యాదేవి చేతిలో చాకు చూసి మహాలక్ష్మీ షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


 Also Read: 'త్రినయని' సీరియల్: ఫింగర్ ఫ్రింట్స్‌తో పట్టించే ప్రయత్నం.. చిట్టి పాప రాకతో ఏదో జరిగిందే?