Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ, అర్చన సీత వెలిగించిన దీపం గురించి మాట్లాడుకుంటారు. సీత తెలివిగా ముందే ఆలోచించి ఇద్దరినీ గదిలో లాక్ చేసిందని అనుకుంటారు. మన ప్లాన్ దానికి ఎలా తెలిసిపోయింది లేక గెస్ చేసి అలా చేసిందా అని మహాలక్ష్మీ అంటుంది. దానికి అర్చన మన మాటలు సీత చాటుగా వినుంటుందని అంటుంది. అంతేలే దానికి అంత సీన్ లేదు మనల్ని డైరెక్ట్‌గా ఎదుర్కొలేదని అంటుంది. ఇంతలో విద్యాదేవి వచ్చి సీత ఏమైనా డైరెక్ట్‌గా చేస్తుంది మిమల్ని గదిలో లాక్ చేసింది నేను అని చెప్తుంది.
మహాలక్ష్మీ: అంటే మీ శిష్యురాలికి సీక్రెట్‌గా సాయం చేస్తున్నావ్ అన్నమాట.
విద్యాదేవి: సీత నా శిష్యురాలే కాదు నా మేనకోడలు కూడా.
అర్చన: మీ రక్త సంబంధం గురించి మీకు తప్ప ఇంకెవరికీ తెలీదు.
మహాలక్ష్మీ: ఎలా తెలుస్తుంది అర్చన తను గొంతు చించుకొని అరిచినా ఎవరూ నమ్మరుగా.
విద్యాదేవి: ఇంట్లో ఉన్న కొడుకు కోడలు విడిపోవాలి అనుకున్న మీకు ఎలా అర్థమవుతుంది రక్త సంబంధం గురించి. ఒక వైపు సుమంగళి వ్రతం చేస్తూనే ఇంకోవైపు అమంగళకరమైన పనులు చేసే మీకు ఈ బంధం గురించి ఎప్పటికీ అర్థం కాదు.
మహాలక్ష్మీ: ఏం మాట్లాడుతున్నావ్ సుమతి.
విద్యాదేవి: రామ్ నీ కన్న కొడుకు కాదు కాబట్టి ఇలా కుళ్లు కుతంత్రం చేస్తున్నావ్. ప్రీతి నీ కన్న కూతురు కాదు కాబట్టి స్వార్థానికి వాడుకుంటున్నావ్. రామ్, ప్రీతి నా కన్న బిడ్డలు, సీత నా మేనకోడలు అందుకే నేను వాళ్లని రక్షించే ప్రయత్నం చేస్తున్నా. మీ లాంటి నీచులు ఉన్న ఇంట్లో నాలాంటిది సీతకి అండగా లేకపోతే మీరు తనని బతకనిస్తారా మిమల్ని గుడ్డిగా నమ్ముతున్న రామ్ ప్రీతిల జీవితాలు మీ లాంటి దుర్మార్గుల చేతిలో పెట్టి నేను వెళ్లిపోతాను అనుకున్నారా. పిల్లల కోసం నిన్ను పెళ్లి చేసుకున్న నా భర్తని నువ్వు మోసం చేస్తుంటే చూస్తూ ఉంటాననుకున్నావా. సీతని రామ్‌ని మీరు ఏ రకంగా విడగొట్టాలని ప్రయత్నించినా ఈ సుమతి వాళ్లకి అండగా ఉంటుంది. ఏదో ఒక రోజు నేనే సుమతి అని అందరికీ తెలుస్తుంది ఆ రోజు త్వరలోనే వస్తుంది.
అర్చన: వామ్మో ఏంటి మహా ఇది సుమతి అక్క సాఫ్ట్ అనుకున్నా మరీ ఇంత స్ట్రాంగ్ అనుకోలేదు. తను అంత గట్టిగా ఈ ఇంట్లోనే ఉంటాను అంటే మనం ఏం చేయలేం పైగా దీపాలు ఆరిపోలేదు కాబట్టి సీతని కూడా పంపలేం
మహాలక్ష్మీ: దీపాలు లాంటి సెంటిమెంట్‌ని నేను నమ్మను. సీత మీదకు ఆల్రెడీ ఓ రాకెట్ వదిలాను అది ఎనీ టైం అటాక్ అవుతుంది.
మహాలక్ష్మీ బయట వెయిట్ చేస్తుంటే పోలీస్ తిలక్ వ్రతం రోజు అధికారులుగా వచ్చిన వారిలో ఒకాయన తీసుకొని వస్తారు. ఈయన్ను ఎందుకు తీసుకొచ్చారని అడుగుతుంది. వ్రతంలో వెరిఫికేషన్ కోసం వచ్చి హడావుడి చేసింది ఈయనే అని మహా చెప్తుంది. దాంతో తిలక్ ఆయను ఒక్కటి కొట్టి జరిగింది చెప్పమని అంటాడు. ఆయన మొత్తం చెప్పడంతో మహాలక్ష్మీ షాక్ అయిపోతుంది. తిలక్ మహాలక్ష్మీతో మీ కోడలు సీత మిమల్ని ఇలా మోసం చేసిందని అంటాడు. ఈ విషయం అందరికీ తెలియాలి అని మహాలక్ష్మీ వాళ్లని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇంట్లో అందరినీ పిలుస్తుంది. అందరూ మళ్లీ ఏ వెరిఫికేషన్ కోసం వచ్చారని అందరూ అడుగుతారు. ఆ వెరిఫికేషన్ అంతా అబద్ధం అని సీత నాటకం ఆడించిందని చెప్తుంది. పెళ్లి అంటే ఆటలులా ఆడుతుంది. జనాతో వ్రతం చేయాలని నేను అనుకుంటే జనా పెక్కన ఈ సీత ఈవిడ గారిని కూర్చొపెట్టాలని అనుకుంది. జనా ఈవిడను రిజిస్టర్ ఆఫీస్‌కి తీసుకెళ్లడంతో దాన్ని అలుసుగా తీసుకొని సీత ఈ కుట్ర చేసింది. ఇక పోలీస్ ఆయనకు కొట్టి విషయం చెప్పమంటే సీత తనకు వ్రతం ముందు రోజు కాల్ చేసి జనార్థన్‌ని భయపెట్టమని చెప్పిందని అంటాడు. మహాలక్ష్మీ కంప్లైంట్ చేయడంతో వీడు దొరికాడని తిలక్ చెప్తాడు. ఇక తిలక్ ఆయన్ను తీసుకొని జైలుకి వెళ్లిపోతాడు.
రామ్, జనార్థన్ అందరూ సీతని ఎందుకు ఇలా చేశావని అడుగుతారు. జనార్థన్ అయితే నన్ను మహాని దూరం చేయాలని ఇలా చేస్తున్నావా అని అడుగుతాడు. ఈ టీచర్ని నీతో కలపడానికి నిన్నూ నన్నూ దూరం చేసిందని రేపు అర్చన, గిరిలను దూరం చేస్తుంది రామ్‌ని కూడా గెంటేస్తుందని మహాలక్ష్మీ అంటుంది. సీత ఇంట్లో ఉంటే మనం ఎవరూ కలిసి ఉండలేం అని అందరినీ తలోవైపు గెంటేస్తుందని మహాలక్ష్మీ అంటుంది. అర్చన కూడా మహాకు సపోర్ట్ చేసింది. జనార్థన్ కూడా విద్యాదేవితో వ్రతం అంటే ఆటలా అలా ఎలా కుట్ర చేస్తారని అడుగుతాడు. ఇక విద్యాదేవి సీతని క్షమించమని అడుగుతుంది. మహాలక్ష్మీ తనకు అంత ద్రోహం చేసిన సీతని క్షమిస్తావా రామ్ అని అడిగితే రామ్ 5నిమిషాలు టైం అడిగి సీతని గదికి తీసుకెళ్తాడు. అందరూ సీతకి ఇంట్లో ఉండే అర్హత లేదని అనుకుంటారు. రామ్ సీతని తిడతాడు. అలాంటి తప్పు ఎందుకు చేశావ్ అని అంటాడు దానికి సీత నేను తప్పు చేయలేదు రైటే అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.