Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ ఇంట్లో సుమంగళి వ్రతానికి ఏర్పాట్లు జరుగుతాయి. సీత విద్యాదేవిని జనార్థన్ పక్కన కూర్చొపెడతానని సాయంగా ఉండమని రేవతికి చెప్తుంది. ఇక ప్రీతిని తనకు సాయంగా ఉండమని మహాలక్ష్మీ చెప్తుంది. పంతులు టైం అయిందని చెప్పడంతో మహాలక్ష్మీ వాళ్లు పీటల మీద కూర్చొవడానికి సిద్ధపడతారు. ఇంతలో సీత రేవతిని తీసుకొని వస్తుంది. అందరూ రేవతిని చూసి షాక్ అవుతారు. నువ్వెందుకు వచ్చావ్ అని మహాలక్ష్మీ రేవతిని అడిగితే సీత నేను పిలిస్తే వచ్చారని ఇది తన  పుట్టిళ్లని చెప్తుంది. 


మహాలక్ష్మీ: అంతా నీ ఇష్టమేనా సీత నా వ్రతానికి కూడా నువ్వే ఎవరిని పిలవాలో నిర్ణయిస్తావా.
సీత: ఇది మీ వ్రతమే కాదు అత్తయ్య నేను రామ్ మామ కూడా వ్రతం చేసుకుంటున్నాం. 
అర్చన: అలా అని ఎవరిని పడితే వాళ్లని పిలుస్తారా.
సీత: మీరు ప్రీతిని పిలిచారు కదా.
గిరిధర్: ప్రీతి ఈ ఇంటి ఆడపడుచు.
సీత: రేవతి పిన్ని కూడా ఈ ఇంటి ఆడపడుచే మామయ్య. మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఉషని పిలవలేదు. అదే ఉద్దేశంతో మీరు రేవతి పిన్నిని కూడా పిలవరు అని నాకు అర్థమైంది.
రేవతి: వదిన మీరు ఎలా ఈ ఇంటి కోడలో సీత కూడా అంతే మీకు ఉన్న హక్కులే సీతకి ఉంటాయి. 
మహాలక్ష్మీ: చూడు జనా సీత అండ చూసుకొని రేవతి ఎలా రెచ్చిపోతుందో. మనం శుభమా అని వ్రతం చేసుకుంటుంటే మనకు ఆస్తిలో నష్టం కలిగించిన పరువు తీసిన రేవతిని సీత పిలిచింది. 
రామ్: రేవతి అత్త పరాయిది కాదు కదా పిన్ని తను వస్తే తప్పు ఏముంది ఇంతటితో గొడవ వదిలేయండి.
జనార్థన్: రామ్ చెప్పింది నిజమే మహా.
చలపతి: నీ కోపంతో నువ్వే ఈ వ్రతం ఆపేలా ఉన్నావ్ చెల్లాయి.


ఇక సీత రేవతిని విద్యాదేవి దగ్గరకు తీసుకెళ్తుంది. ఇక ప్రీతి విద్యాదేవిని అమ్మగా ఒప్పుకోనని అంటుంది. ఇక జనార్థన్‌, మహాలక్ష్మీలు వ్రతం మొదలు పెట్టాలని పీటల మీద కూర్చొంటారు. ఇంతలో జనార్థన్‌కి కాల్ వస్తుంది. జనార్థన్ ఫోన్ తీసుకొని బయటకు వెళ్తాడు. మహాలక్ష్మీ టెన్షన్ పడుతుంది. విద్యాదేవి వ్రతం కోసం ముస్తాబయి కూర్చొంటుంది. రేవతి టీచర్‌తో మాట్లాడుతుంది. అంతా మాయలా ఉందని వదిన సుమతితో మాట్లాడుతుంది. జనార్థన్ పక్కన సీత తనని ఎలా కూర్చొపెడుతుందో అర్థం కావడం లేదని విద్యాదేవి అంటుంది. ఇక సీత ఐదు నిమిషాలు ఆగండి మంచి డ్రామా ఉంటుందని చెప్పి కిందకి వెళ్తారు. ఇక జనార్థన్ ఫోన్ మాట్లాడిన తర్వాత విద్యాదేవితో కలిసి కిందకి వస్తాడు. మహాలక్ష్మీతో పాటు అందరూ షాక్ అయిపోతారు. 


మహాలక్ష్మీ: జనా ఏంటి నువ్వు చేస్తుంది. ఇక్కడ నాతో వ్రతం చేయకుండా ఆమెతో కలిసి వస్తున్నావ్ ఏంటి. 
జనార్థన్: సారీ మహా వ్రతం నీతో కాదు ఈ సుమతి నేను చేసుకోబోతున్నాం. 
మహాలక్ష్మీ: ఏం మాట్లాడుతున్నావ్ జనా పిచ్చి కానీ పట్టిందా తను సుమతి ఏంటి.
గిరిధర్: సీత నిన్ను కూడా మార్చేసిందా అన్నయ్య విద్యాదేవి టీచరే సుమతి వదినా అని నమ్మించేసిందా. 
రామ్: సీత చెప్తే మాత్రం మీరు ఎలా నమ్మారు నాన్న ఆవిడ మా అమ్మ కాదని పిన్ని చెప్తుంది కదా. 
ప్రీతి: అవును నాన్న సీత వదిన నన్ను మోసం చేసింది ఆవిడ అమ్మా అని చెప్పి మీతో కలిసి నాకు కన్యాదానం చేయించింది. పిన్నిని అవమానించింది. 
మహాలక్ష్మీ: తను సుమతి ఏంటి జనా తను హంతకురాలు సుమతిని చంపేసిన హంతకురాలు
జనార్థన్: స్టాపిట్ మహా. తనే సుమతి. ఇంక ఎవరూ మాట్లాడకండి. మాట్లాడితే ఇంట్లో నుంచి గెంటేస్తాను. నేను సుమతి వ్రతం చేసుకుంటున్నాం అంతే. 


ఎవరూ ఏం మాట్లాడకుండా జనార్థన్ అందరి నోరు మూయించి సుమతితో కలిసి పీటల మీద కూర్చొంటాడు. సీత, రామ్‌లను కూడా పీటల మీద కూర్చొపెడతాడు. జనార్థన్, విద్యాదేవి ఒకరికి ఒకరు కంకణాలు కట్టుకుంటారు. ఎవరూ నోరు మెదపకుండా చూస్తూ ఉండిపోతారు. మహాలక్ష్మీ చాలా డిస్సప్పాయింట్ అయిపోతుంది. రేవతి, చలపతిలు మహాలక్ష్మీని కావాలనే ఉడికిస్తారు. జనార్థన్ ఇలా ఎందుకు చేశాడు అసలేం జరిగిందని మహాలక్ష్మీ అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీప రెస్టారెంట్.. నిప్పు రాజేసిన పేరు.. భార్య వల్ల కార్తీక్ బికారీ అయిపోతాడా?