Seethe Ramudi Katnam Serial Today Episode విద్యాదేవి వ్రతం గురించి తెలిసి బాధ పడుతుంటే సీత ఓదార్చి వ్రతంలో మీరు మామయ్య పక్కన కూర్చొనేలా చేస్తానని మహాలక్ష్మీని తప్పిస్తానని అంటుంది. సీత, విద్యాదేవిల మాటలు అర్చన చాటుగా వింటుంది. అర్చన మహాలక్ష్మీ దగ్గరకు పరుగులు తీసి రేపు వ్రతం జరిగేలా లేదని చెప్తుంది. వ్రతంతో బావగారి పక్కన నువ్వు కూర్చొవు ఆ సుమతి కూర్చొనే ఉందని సీత సుమతితో చెప్తుంటే విని నీ దగ్గరకు వచ్చానని అంటుంది. మహాలక్ష్మీ అర్చన మాటలు కొట్టిపడేస్తుంది. దానికి అర్చన సీత ఏదో ప్లాన్ చేస్తుంది జాగ్రత్త పడమని చెప్తుంది.
మహాలక్ష్మీ: అందరి ముందు నన్ను కాదని తనని తీసుకొచ్చి నా స్థానంలో ఎలా కూర్చొపెడుతుంది. అలా చేస్తే నేను ఊరుకుంటానా పైగా జనా ఊరుకుంటాడా. రామ్ కూడా ఒప్పుకోడు.
అర్చన: మరి సీత పెళ్లిలో బావగారి పక్కన ఆమెను కూర్చొపెట్టింది కదా సీత స్ట్రాంగ్‌గా ఉంది మహా.
మహాలక్ష్మీ: దాని ముఖం అంత లేదులే నువ్వు వెళ్లి పడుకో.
అర్చన: మహా ఇలా మాట్లాడుతుంది. సీత అంత కాన్ఫిడెంట్గా ఉంది రేపు ఏం జరుగుతుందో ఏంటో.
సీత రామ్ దగ్గరకు పాలు తీసుకొని వస్తుంది. రామ్ సీతని మనం రేపు వ్రతం చేసుకుంటున్నామా అంటే సుమంగళి వ్రతం కదా చేసుకుంటున్నాం అని సీత అంటుంది. రేపు శుభకార్యం కదా అనుకోనివి జరిగితే సర్దుకోవాలని సీత అంటే రేపు ఏమైనా చేయబోతున్నావా ఏంటి రేపు వ్రతం చెడగొడతావా అంటాడు. అలా ఏం లేదని సీత అంటుంది. ఇక రామ్ రేపు నీకు ఓ సర్‌ఫ్రైజ్ ఇస్తానని అంటాడు. సీత మనసులో రేపు నేను మీకు షాక్ ఇస్తానని అనుకుంటుంది. ఇక జనార్థన్, మహాలక్ష్మీలు వ్రతానికి ఎవరెవరిని పిలవాలా అని మాట్లాడుకుంటారు. ఇక ప్రీతికి కాల్ చేసి పిలుస్తా అని మహాలక్ష్మీ చెప్తుంది. ఇక రేవతిని పిలవాలా అంటే జనార్థన్ అవసరం లేదని చెప్తాడు. ఇక మహాలక్ష్మీ ప్రీతికి కాల్ చేసి వ్రతానికి పిలుస్తుంది. నీ భర్త, అత్తామామల్ని తీసుకురావొద్దని అంటుంది. ఇక అర్చనతో మహాలక్ష్మీ ఉషని పిలవాలా అంటే అర్చన వద్దని తను నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని అందుకే పిలవొద్దని అంటుంది. ఇక మహాలక్ష్మీ అర్చనతో ప్రీతిని పిలవడంతో సీత ఆగడాలకు ప్రీతితో చెక్ పెట్టొచ్చని అనుకుంటుంది. ఇక ఆ మాటలు సీత విని మీరు మీ పిలుపులు చేయండి నేను నా పిలుపులు చేస్తానని అంటుంది.
ఉదయం అందరూ వ్రతానికి ఏర్పాట్లు చేస్తారు. అందరూ అందంగా రెడీ అవుతారు. ఇక రామ్, జనార్థన్ కూడా వ్రతానికి పట్టుపంచెలో రెడీ అయి వస్తారు. ఇక ప్రీతి వస్తుంది. ఇక ప్రీతి, అర్చనలు మహా దగ్గరకు వెళ్తారు. ఇంతలో రేవతి వస్తుంది. రేవతిని సాంబ గేటు దగ్గరే ఆపేస్తాడు. దాంతో సీత వచ్చి రేవతిని తీసుకొని వెళ్తుంది. ఇక సీత రేవతితో సుమతి, విద్యాదేవి ఒక్కరే అని జరిగిన స్టోరీ చెప్తుంది. ఇక జనార్థన్ మామయ్య పక్కన విద్యాదేవిని కూర్చొపెడతాను ఆ టైంలో మీరు మాట సాయం చేయండి అని చెప్తుంది. మరోవైపు మహాలక్ష్మీ సీత ప్లాన్‌ని ప్రీతితో చెప్తుంది. ప్రీతి షాక్ అయిపోతుంది. అదెలా సాధ్యం అవుతుంది అని అడుగుతుంది. యాడ్ గురించి కూడా చెప్తారు. ఇక ప్రీతి మహాలక్ష్మీకి సాయం చేస్తానని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: మందారాన్ని పొడిచి పొడిచి చంపేసిన దీపక్.. రూప మీద విరుచుకుపడ్డ రాజు.. రూప ప్రెగ్నెంట్!