Seethe Ramudi Katnam Today Episode అందరూ పడుకొని ఉంటే సీత గన్ తీసుకొని వచ్చి హల్‌చల్ చేస్తుంది. మహాలక్ష్మి బయటకు రావే అని పిలుస్తుంది. గన్ ఫైర్ చేస్తుంది. దీంతో అందరూ హాల్‌లోకి వస్తారు. సీత చేతిలో గన్ చూసి షాక్ అవుతారు. నా గన్ ఎందుకు తీశావే అని మహాలక్ష్మి సీతని ప్రశ్నిస్తుంది. దీంతో సీత నిన్ను చంపేస్తానే నిన్ను కాల్చేస్తానే అంటూ మహాలక్ష్మిని గురి చేస్తుంది వద్దూ అంటూ మహా తప్పించుకుంటుంది. అందరూ వద్దని సీతకు చెప్తారు. అయినా సీత ఫైరింగ్ ఆపదు. దీంతో రామ్ బలవంతంగా గన్ తీసుకుంటాడు.


రామ్: సీత నీకేమైనా పిచ్చి పట్టిందా పిన్నికి బులెట్ తగిలితే.. సీత ఏమైంది నీకు..
సీత: ఏమైంది నాకు నేను ఎక్కడ ఉన్నాను. ఏం జరిగింది. 
చలపతి: నువ్వేం చేశావో నీకు తెలీదా సీత.
సీత: లేదు బాబాయ్.. అందరూ హాల్‌లో ఉన్నారేంటి. నిద్ర పోలేదా.. అక్క నేను నీ పక్కన ఉన్నాను కదా ఇక్కడికి వచ్చాను ఏంటి. 
రామ్: అది నువ్వే చెప్పాలి గన్ తీసుకొని వచ్చి హడావుడి చేసి అందర్ని భయపెట్టావు. పిన్నిని షూట్ చేయబోయావ్.. 
సీత: సారీ అత్తయ్య మీకు ఏమైనా చేశానా.. అత్తయ్య మీకు చెప్పడం మర్చిపోయాను నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. నిద్రలో నడిచి నాకు ఎవరి మీద కోపమో వాళ్ల మీద పగ తీర్చుకునే అలవాటు ఉందని మా వాళ్లు చెప్పేవారు. కేవలం నాకు అలవాటు అయిన చోట పడుకుంటే చక్కగా పడుకుంటాను అంట వేరే చోట అయితే ఇలా చేస్తా అంట. సీత మాటలకు మహాలక్ష్మి కూడా భయపడుతుంది. అందరూ మహాని ఒప్పించడంతో మహాలక్ష్మి సీతని రామ్ గదిలో పడుకోవడానికి ఒప్పుకుంటుంది. దీంతో సీత హ్యాపీగా రామ్‌ గదిలోకి వెళ్లిపోతుంది. సీత, రామ్‌లు ముచ్చట్లు పెట్టుకొని నవ్వుకుంటారు. 


మహాలక్ష్మి: రామ్ ఈరోజు నేనే మీ డాడీ మీటింగ్ పని మీద ముంబయి వెళ్తున్నాం. మూడు రోజులు అక్కడే ఉంటాం. నువ్వు, గిరిధర్, అర్చనలు ఆఫీస్ పనులు చూసుకోవాలి.
జనార్థన్: మేం లేం అని నువ్వు సీతతో ముచ్చట్టు పెట్టకు. 
మహాలక్ష్మి: మేం ఉన్నా లేకపోయిన నువ్వు నీ కంట్రోల్‌లో ఉండాలి రామ్. సీతతో నువ్వు ఏమైనా చేశావ్ అని తెలిసిందో.. 
రామ్: మీ పర్మిషన్ లేకుండా ఏం చేయను పిన్ని..


ఇంతలో మహాలక్ష్మి కంపెనీలో పని చేస్తున్న వర్కర్ మహాలక్ష్మి దయవల్ల తనకు ఉద్యోగం వచ్చిందని పెళ్లి జరిగి పాప పుట్టింది అని పాపని ఎత్తుకొని వస్తాడు. పాపకు పేరు పెట్టమని కోరుతాడు. దీంతో అర్చన మహాలక్ష్మి కంటే మంచి పేరు ఏముంటుంది లక్ష్మీ అని పెట్టమని చెప్తుంది. ఇంతలో సీత మహాలక్ష్మిని అడ్డుకుంటుంది. లక్ష్మీ అనే పేరు వద్దని అంత కంటే మంచి పేరు పెడదామని తన పెద్ద అత్తయ్య సుమతి పేరు పెట్టమని చెప్తుంది. దీంతో మహాలక్ష్మి గతిలేక సుమతి అని పేరు పెడుతుంది. రామ్‌తో పాటు అందరూ క్లాప్స్‌ కొడతారు. అంతే కాకుండా సీత పాప పేరెంట్స్‌కు డబ్బులు ఇప్పిస్తుంది. అందరూ సీతని పొగిడేస్తారు. మహాలక్ష్మి కోపంతో రగిలిపోతుంది. రామ్, జనార్థన్ ఇద్దరూ సీత మంచి పని చేశారు అనడంతో ఇంకా రగిలిపోతుంది మహాలక్ష్మి. మరోవైపు మధు బయటకు వెళ్లాగా అక్కడ తనకు తెలిసిన వాళ్లు మధుతో మాట్లాడతారు. సూర్యని వదిలేసి రామ్‌తో సంబంధం పెట్టుకున్నావ్ అని తప్పుగా మాట్లాడుతుంది.  దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: గాయత్రీదేవి జాడ కోసం పిండి పూజ.. సుమన బిడ్డను నాగలోకం తీసుకెళ్లిపోతానన్న పెద్దబొట్టమ్మ!