Seethe Ramudi Katnam Today Episode సీత దగ్గరకు మధుమిత వచ్చి తనని ఇమిటేట్ చేయడానికా తనలా రెడీ అయి ఆఫీస్‌కు వచ్చావని ప్రశ్నిస్తుంది. దీంతో సీత తనకు అంత అవసరం లేదని.. ఆ డ్రస్ తాను ఇష్టంతో వేసుకోలేదని మధుమితతో చెప్తుంది.


సీత: నువ్వేదో పెద్ద ఫిగర్‌ అనుకొని ఇలాంటి బట్టలు వేసుకొని తింగురంగా అంటూ ఆఫీస్‌కు వస్తున్నావ్ కదా.. అలా నేను కూడా ఉండగలనని నీకు తెలియడానికి ఇలా రెడీ అయి వచ్చా. 
మధు: మరి దీన్ని ఏమంటారు. నాతో పోటీ పడటమే కదా..
సీత: నేను నీతి నిజాయితీతో మంచితో పోటీ పడాలి అని చూస్తా ఇలా వేసుకున్న బట్టలతో కాదు. పూసుకొనే మేకప్‌తో కాదు.
మధు: ఈ డ్రస్‌ నీకు సూట్ అవ్వలేదు సీత. నాకు నచ్చలేదు.
సీత: నీకు నచ్చాల్సిన అవసరం లేదు నా మామకు నచ్చాను అది చాలు. ఒకర్ని చూసి జలసీ ఫీలవ్వడం నీ పాలసీ. నువ్వు ఎలాంటి బట్టలు అయినా వేసుకో కానీ నీ బుద్ధి మాత్రం వంకర కాకుండా చూసుకో..
మహాలక్ష్మి: నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్ మధు. రామ్‌తో కలిసి ఓ ఇంపార్టెంట్ మీటింగ్‌కు వెళ్లాలి అని చెప్పాను కదా. 
మధు: ఆ మీటింగ్‌కు నేను ప్రిపేర్‌ అయ్యాను అండీ. 


రామ్, జనార్థన్‌లు కూడా అక్కడికి వస్తారు. మహా రామ్, మధులతో మీటింగ్ సక్సెస్ చేయమని అంటుంది. తర్వాత తాజ్ హోటల్‌లో లంచ్ చేయమని చెప్తుంది. లంచ్‌ టైంలో మరికొంత మంది మీట్ అవుతారని జనా చెప్తాడు. దీంతో సీత కోపంతో రగిలిపోతుంది. మహా వాళ్లు చెప్పిన ప్లాన్స్‌కి సీత షాక్ అయిపోతుంది. 


సీత: ఆగండి.. నేను వస్తాను..
మహాలక్ష్మి: నువ్వు ఎక్కడికి..
సీత: వాళ్లు ఎక్కడికో నేను అక్కడికే.. 
మహాలక్ష్మి: నీలాంటి స్టోర్ మేనేజర్స్ వెళ్లే ప్లేస్ కాదు అది. రామ్, మధు లాంటి వీఐపీలు మీట్ అయ్యే ప్లేస్. నీలాంటి వాళ్లని గేట్ ముందు కూడా నిలబడనివ్వరు.
మధు: వెళ్దామా రామ్ గారు. 
మహాలక్ష్మి: ఏంటి సీత ఫీలవుతున్నావా.. రామ్, మధులు కలిసి వెళ్తుంటే నీ కడుపులో పేగులు మెలిపెడుతున్నట్లున్నాయి కదా. నీ మనసు రగిలిపోతుంది కానీ నేను ఏమీ చేయలేను అనుకుంటున్నావ్ కదా.. నువ్వు అలాగే అనుకోవాలి సీత అందుకే ఇలా ప్లాన్ చేశా.
జనార్థన్: ఇప్పటికైనా మహాతో పోటీ మానుకో సీత. నీ లైఫ్ బాగుంటుంది. 
మహాలక్ష్మి: నువ్వు ఆఫీస్‌లో మాత్రమే ఉన్నావ్. రామ్ పక్కన లేవు. 


 రామ్, మధుమితలు కలిసి వెళ్లడం చూసిన సీత బాధపడుతుంది. చలపతి సీత దగ్గరకు వచ్చి ఓదార్చుతాడు. ఇక సీత మహాని దెబ్బ తీస్తా అంటుంది. 


మరోవైపు సుమతిని తన తల్లి ఇంటికి తీసుకొని వస్తుంది. సుమతి ఇంటిని చూసి గతాన్ని గుర్తు చేసుకుంటుంది. ఆనందంగా సుమతిని తన తల్లి లోపలికి పిలుస్తుంది. లలిత, నీలాని పిలుస్తుంది. వాళ్లు సుమతిని చూసి చాలా సంతోషంతో సుమతిని హగ్ చేసుకొని ఏడుస్తారు. అందరూ ఎమోషనల్ అవుతారు. ఇక లలిత సుమతికి తన భర్త సంసారం గురించి అడుగుతుంది. దాంతో సుమతి వదినా నేను ఇప్పుడే కదా వచ్చాను అంటుంది. దీంతో సుమతి తల్లి కాసేపు విశ్రాంతి తీసుకోని తర్వాత అన్నీ చెప్తుందని అంటుంది. 


సుమతి: నేను అన్నయ్యకి గుర్తున్నానా అమ్మా..
లలిత: అవేం మాటలు సుమతి. ఆయనకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు. పైకి కోపం చూపించినా లోపల మాత్రం చాలా ప్రేమ ఉంది. 
సుమతి: అన్నయ్య మాటలు కాదని వెళ్లిపోయాను కదా వదిన ఇప్పటి వరకు కలవలేదు.


మరోవైపు రామ్, మధు మీటింగ్ ఫినీష్ చేస్తారు. రామ్ మధుతో టాకింగ్ స్కిల్స్ పెంచుకోమని చెప్తాడు. ఇక ఇద్దరు మహాలక్ష్మి గురించి మాట్లాడుకొని పొగుడుతారు. రామ్ తనకు అన్నీ మహాలక్ష్మినే అని చెప్తాడు. మరోవైపు రామ్, మధులు ఇంకా ఇంటికి రాలేదని సీత టెన్షన్ పడుతుంది. రామ్‌కి కాల్ చేస్తే స్విఛ్‌ ఆఫ్ వస్తుంది. ఇక చలపతి వచ్చి రామ్, మధులు డిన్నర్‌ పార్టీకి వెళ్తారని చెప్తాడు. దీంతో సీత మామ మీద నాకు నమ్మకం ఉంది అంటుంది. దానికి రేవతి రామ్‌ మంచోడే కానీ మీ అక్కని, మహాలక్ష్మిని నమ్మడానికి వీల్లేదు అంటుంది. దాంతో సీత తన అక్క తరఫున రేవతికి సారీ చెప్తుంది. 


రేవతి: మీ అక్క పూర్తిగా మహాలక్ష్మి ట్రాప్‌లో పడిపోయింది సీత. తనేం చెప్తే అది చేస్తుంది.
చలపతి: రామ్ అయితే సరే సరి.. మహా మీటింగ్‌కి వెళ్లమంటే మీటింగ్‌కు వెళ్తాడు. డిన్నర్ పార్టీకి వెళ్లమంటే డిన్నర్ పార్టీకి వెళ్తాడు.
రేవతి: అసలు మహా ఆ పార్టీలో ఏం ప్లాన్ చేసిందో. 


మరోవైపు మహాలక్ష్మి పార్టీ దగ్గర వెయిటర్‌కి కాల్ చేస్తుంది. రామ్, మధులు వచ్చిన తర్వాత వాళ్లకు ఇచ్చిన కూల్‌డ్రింక్‌లో ఆల్కాహాల్‌ కలిపి ఇవ్వమని తన ప్లాన్ చెప్తుంది. ఇంతలో అర్చన రావడంతో రామ్, మధులను ఒక్కటి చేయడానికి మత్తు మందు కలిపి ఇవ్వమన్నాను అని అంటుంది. అలా చేస్తేనే ఇద్దరూ ఒకటవుతారని అనుకుంటారు. ఇద్దర్ని కలిసి సీతని మనశ్శాంతి లేకుండా చేయాలని అంటుంది మహాలక్ష్మి. ఈ రాత్రితో రామ్ సీతకు దూరమై మధుకి సొంతమై పోతాడని అంటుంది. 


ఇక రామ్, మధుమితలు పార్టీకి వెళ్తే అందరూ రామ్‌, మధులను భార్యభర్తలని అంటారు. అలాగే ట్రీట్ చేస్తారు. ఇక వెయిటర్ ఆల్కాహాల్ కలిపి రామ్, మధులకు ఇస్తాడు. మరోవైపు సీత టెన్షన్ పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌కి కారం తినిపించి చుక్కలు చూపించిన సత్య.. హర్షని ఇళ్లరికం ఉండిపోమన్న భైరవి, వద్దన్న మహదేవయ్య!