Satyabhama Today Episode విశ్వనాథం జాగింగ్ చేస్తుంటే కాళీ కాల్ చేస్తాడు. జైలులో ఉండాల్సిన వాడు తనకి ఫోన్ చేస్తున్నాడేంటని విశ్వనాథం అనుకుంటాడు. ఇరవై లక్షలు ఇవ్వమని కాళీ మళ్లీ విశ్వనాథాన్ని బెదిరిస్తాడు. సత్య ఫొటో ఒకటి పంపించి తల దించుకునేలా చేస్తాడు. అది మార్ఫింగ్ ఫొటో అని పోలీసులకు పట్టిస్తానని విశ్వనాథం అంటాడు. దానికి కాళీ నువ్వు పోలీసులకు పట్టించేలోపు మార్పింగ్ ఫొటోని దేశమంతా చూసేలా చేస్తానని అంటాడు. డబ్బులు ఇస్తేనే వదిలేస్తానని బెదిరిస్తాడు. దీంతో విశ్వనాథం కంగారు పడతాడు. మరోవైపు మహదేవయ్య ఇంట్లో అందరిని పిలుస్తాడు. పేపర్ మీటింగ్ సక్సెస్ అయిందని పార్టీ ప్రెసిడెంట్ జనార్థన్ తన ఫ్యామిలీ మొత్తాన్ని భోజనానికి పిలిచాడని చెప్తాడు.


 


మహదేవయ్య: అందరూ ఒక మాట గుర్తొంచుకోండి. ఇది నా రాజకీయ భవిష్యత్‌కి సంబంధించిన విషయం అందరూ కలిసికట్టుగా ఉండాలి.
భైరవి: ఆ మాట మాకు కాదు చిన్నకొడుకు కోడలికి చెప్పాలి.
రేణుక: సత్య మాట్లాడటం వల్లే మీటింగ్ సక్సెస్ అయిందంట. అందరూ అంటున్నారు.
భైరవి: ఏంట్రా పెద్దొడా నీ పెళ్లానికి నోరు లేస్తుంది. గర్వం కనిపిస్తుంది.
క్రిష్: ఉంటుంది మరి. మంచిని మంచి అని పొగడాలి అంటే గట్స్ ఉండాలి. దిల్ ఉండాలి. సత్య కొంటెగా క్రిష్‌ని చూస్తుంది.
భైరవి: అబ్బా ఎంత మురిసిపోతున్నావ్‌రా.
క్రిష్: ఎంతైనా నా పెళ్లాం కదా ఆ మాత్రం ఉంటుందిలే. 
భైరవి: చూశావయ్యా నీ చిన్న కొడుకుని పెళ్లాన్ని ఎలా పొగుడుతున్నావ్. నువ్వు ఎప్పుడైనా పొగిడావా.
మహదేవయ్య: చూడు పొగడాలి అంటే సత్య లెక్క ఏదైనా మంచి పని చేయాలి. 
సత్య: ఎందుకు మామయ్య సత్యని అలా అంటారు. అత్తయ్య మాట అలా ఉంటుంది. కానీ మనసు చాలా మంచిది. 
మహదేవయ్య: చూశావా.. చూడు బిడ్డ రేణుక చెప్పిందే నిజం నీ వల్ల నందిని వల్లే ఆ మీటింగ్ సక్సెస్ అయింది కానీ నువ్వు టైం రాకపోవడం వల్ల చాలా టెన్షన్ పెట్టేశావ్ తెలుసా. అయినా ఆ టైంకి గుడికి పోవడం అవసరమా.
సత్య: ఆ రోజు అలా అనుకోకుండా జరిగిపోయింది మామయ్య.
రుద్ర: ఏదీ అనుకోకుండా జరగదు. 
మహదేవయ్య: ఇంకోసారి అలా జరగకూడదు. మంచి చేస్తే మెచ్చుకుంటా. లేదంటే ఏం చేయాలో అది చేస్తే. ఏదైనా ముఖం మీద చెప్తా. పార్టీ ప్రెసిడెంట్ దగ్గర కూడా నువ్వు నా పరువు నిలబెట్టాలి. తేడా వస్తే ఊరుకోను. మీరు ఎంత అన్యోన్యంగా కనిపిస్తే అంత మంచిది. అర్థమైందా.
రుద్ర: బాపు నన్ను పట్టించుకోవడం లేదు. చెట్టంత మనిషిని పట్టించుకోవడం లేదు. ఎంత సేపు సత్య, చిన్నానే. వాడి వల్ల దానికి పేరు వస్తుందో లేక దాని వల్ల వాడికి పేరు వస్తుందో.నాకు ఉంది పెళ్లాం దిబ్బరొట్టి ముఖంది. ఒక సంతోషం లేదు. సుఖం లేదు. ఉపయోగం అంత కన్నా లేదు. ఎట్లన్నా చేసి ఈ రోజు దాని కథ కంచికి పంపాలి. 


రేణుకని చంపాలి అని మోటర్ స్విచ్‌ల దగ్గర కరెంట్ షాక్ కొట్టేలా వైర్లు కలుపుతాడు. సత్య ఆరు బయట మొక్కలకు నీరు పోస్తుంది. రేణుక అక్కడికి వచ్చి బోర్ కొడుతుందని ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. ఇక పై నుంచి రుద్ర చూసి రేణుకని పిలిచి మోటర్ వేయమంటాడు. సత్య ఆపి నేను వెళ్తాను అని అంటే రేణుక ఈ చిన్న పని కూడా నాతో చేయించవా అని అంటుంది.  మామయ్య చూస్తే మా పని దబిడదిబిడే అంటుంది. చివరికి రేణుక వెళ్లడానికి సత్య ఒప్పుకుంటుంది. స్విఛ్ వేయడానికి రేణుక వెళ్తుంది. ఇక క్రిష్‌ రేణుకని అడ్డుకుంటాడు. నీ చెల్లి నీ మాట విన్నా నీ మరిది వినడు మొండి వాడు అని క్రిష్ స్విఛ్ వేయడానికి వెళ్తాడు. క్రిష్ వెళ్లి స్విఛ్ వేస్తే కరెంట్ షాక్ కొడుతుంది. రేణుక కంగారుగా వెళ్లూ పట్టుకోవడానికి వెళ్తే సత్య ఆపి దూరంగా ఉండమని చెప్పి కర్ర తీసుకొని వచ్చి కొడుతుంది. క్రిష్ కింద పడిపోతాడు. సత్య క్రిష్ ముఖం మీద నీరు వేసి గుండె మీద ఒత్తుతుంది. ఇక క్రిష్ లిప్‌లో లిప్‌ పెట్టి ఊపిరందిస్తుంది. రేణుక అత్తామామలను పిలుస్తుంది. వాళ్లు వచ్చి సత్యని అలా చూసి ఇబ్బందిగా ఫీలవుతారు. ఇక క్రిష్ కళ్లు తెరచి చూసి సత్య తన లిఫ్స్‌ని తాడకం చూసి అలా ఉండిపోతాడు. సత్యని చూస్తూ క్రిష్‌ మైకంలో ఉండిపోతాడు. అందరూ పిలిచినా సత్యనే చూస్తూ ఉండిపోతాడు. ఇక మహదేవయ్య పనివాళ్లని కొడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  


Also Read; 'త్రినయని' సీరియల్: చింతామణి రాయితో అబద్దం చెప్పిన విశాల్.. తల పగలగొట్టుకుంటాడా!