Satyabhama Today Episode విశ్వనాథం అరెస్ట్ అవ్వడంతో ఇంట్లో ఉన్న శాంతమ్మ కంగారు పడుతుంది. నందిని వచ్చి ఎక్కువ ఆలోచించకుండా ఉండమని అంటుంది. శాంతమ్మ హర్షకి కాల్ చేయమని అంటే నందిని చేయను అనేస్తుంది. ఎందుకని శాంతమ్మ అడిగితే తాను అరిస్తే హర్ష ప్రేమగా మాట్లాడుతాడని తాను ప్రేమగా మాట్లాడితే అరుస్తాడు. నీ మనవడి తీరు అర్థం కాదని తిక్కలోడని అంటుంది. 


నందిని: లేకపోతే ఏంటి ప్రేమగా చెప్పా పెనిమిటి మా బాపు హెల్ప్ తీసుకో అని. అదేదో బూతు అయినట్లు కోతిలా ఎగిరాడు. ఇప్పుడు రోగం కుదిరింది. ఇప్పుడు వరకు నీ కొడుకు బయటకు రాలేదు.
శాంతమ్మ: అలా కాదమ్మా మేం అయితే కాళ్లు చేతులు పట్టుకొని బతిమాలుతాము. మీ నాన్న అయితే కత్తి తీసుకొని వస్తాడు. మొదటికే మోసం వస్తుంది. వాళ్ల తంటాలు ఏవో వాళ్లు పడని. నువ్వు ఎవరికీ ఫోన్ చేయకు.
నందిని: పైకి కనిపించరు కానీ ఈ ఇంట్లో అందరికీ ఆవగింజ అంత పొగరు ఉంది. 


మహదేవయ్య: పార్టీ ప్రెసిడెంట్ మాటలు గుర్తు చేసుకొని కోపంతో ఊగిపోతాడు. నా పరువు గంగలో కలిపింది. ఎమ్మెల్యే కావాలన్న నా ఆశకు పాడి కట్టింది. పార్టీ ప్రెసిడెంట్ ప్రేమగా లంచ్‌కి పిలిస్తే నీ పెళ్లాం వల్ల మాటలు పడాల్సి వచ్చింది. తలెత్తుకొని గర్వం నిలబడాల్సిన జాగాలో తలదించుకోవాల్సి వచ్చింది.
రుద్ర: పెళ్లాన్ని సమర్థించుకొని నెత్తిన పెట్టుకున్నోళ్లు ఎవరూ బాగుపడినట్లు చరిత్రలో లేదు నువ్వు అదే తప్పు చేయకు. 
భైరవి: మనతో వచ్చింది అక్కడే కూర్చొంది. అంతలోనే మాయం అయిపోవడం ఏంటిరా.
క్రిష్: నాకు చెప్పింది. ఫోన్ మాట్లాడి వస్తుందనుకున్నా. 
రుద్ర: మన నెత్తి మీద తడి గుడ్డ వేసింది. బాపు ఎమ్మెల్యే అవడం సత్యకు ఇష్టం లేదు.
భైరవి: మీ బాపు చేసింది తప్పే ప్రెస్ మీటింగ్‌లో మంచిగా మాట్లాడిందని ఎమ్మెల్యే చేసిన బాధ్యత తన మీద పెట్టారు. ఇప్పుడు మధ్యలో వదిలేసి పోయింది. 
క్రిష్: బయటకు వెళ్లి.. ప్రతీ సారి సత్య ఎందుకు ఇలా చేస్తుంది. ఎక్కడికి పోతుందో చెప్పదు. ఫోన్ చేస్తే ఎత్తదు. ఏమైనా ప్రాబ్లమ్‌లో ఉందా. అని సత్యకి కాల్ చేస్తాడు. సత్య తన తండ్రి ప్రాబ్లమ్‌లో ఇరుక్కున్నాడని లాక్‌అప్‌లో ఉన్నాడని చెప్తుంది. 
మహదేవయ్య: సత్య ఏడుందంట.
 క్రిష్‌: పోలీస్ స్టేషన్‌లో..
రుద్ర: అక్కడెందుకుంది.
క్రిష్‌: వాళ్ల నాన్న లాక్‌అప్‌లో ఉన్నాడంట.  అందుకే అర్జెంట్‌గా పోవాల్సి వచ్చింది.
మహదేవయ్య: మరి అది చెప్పాలి కదరా.
క్రిష్‌: బాపు ఇప్పుడు అది ముఖ్యం కాదు. మామయ్య లాక్‌అప్‌లో ఎందుకు ఉన్నాడనేది ముఖ్యం. ఆయన్ను బయటకు తీసుకురావడం ముఖ్యం. 
రుద్ర: మనకేంటి సంబంధం.
క్రిష్‌: అరెస్ట్ అయింది ఈ ఇంటి వియ్యంకుడు. పోలీస్ స్టేషన్‌కి పోవాలి కదా.
భైరవి: కావాలి అంటే నువ్వు పోరా బాపు రాడు. ఎమ్మెల్యే అవ్వాల్సిన మనిషి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే పరువు పోదా.
క్రిష్: బాపు సత్య ఈ ఇంటి మనిషి.
రుద్ర: అది ఆ ఇంటి సమస్య బాపు రాడు పో. 
మహదేవయ్య: మనసులో.. నేను రాజకీయంలో ఉన్న టైంలో నా వియ్యంకుడు జైలులో ఉంటే నాకే నష్టం బయటకు తీసుకురవాలి. ఏయ్ చిన్నా ఆగు నేను వస్తా. రుద్ర నువ్వు కూడా రారా.
భైరవి: ఏందిది..


మహదేవయ్య, రుద్ర, క్రిష్‌లు పోలీస్‌ స్టేషన్‌కి వస్తాడు. పోలీస్‌లు మన చుట్టూ అయ్యా అంటూ తిరగాల్సింది. మీ మామ వల్ల మనం పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చాడు. 


మహదేవయ్య: అలవాటు లేని పనులు చేస్తే ఇట్లానే ఉంటుంది బావగారు. మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే మాకు చెప్పొచ్చు కదా మేం చూసుకుంటాం కదా. 
విశ్వనాథం: ఇది నా సమస్య నేనే పరిష్కరించుకోవాలి. 
మహదేవయ్య: బాధ పడకు చెల్లమ్మా. నేను వచ్చా కదా మొత్తం నేను చూసుకుంటా. ఒక్క రెండు నిమిషాలు ఓపికపట్టు అందర్ని ఇంటికి తీసుకుపోతా.
విశాలాక్షి: దయచేసి ఆ సాయం చేయండి అన్నయ్య. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. 
ఎస్‌ఐ: సార్ మహదేవయ్య గారు మీరా. సార్‌కి కుర్చీ వెయ్యండిరా..
మహదేవయ్య: నేను వచ్చింది నీ మర్యాదల కోసం కాదు. పోయి తాళం తీయ్‌ విడిపించు మా బావగారిని.
ఎస్‌ఐ: సార్ అది.
రుద్ర: తీస్తావా పగల గొట్టమంటావా.
ఎస్‌ఐ: సార్ ఎఫ్‌ఐఆర్ రాసేశాం సార్.
మహదేవయ్య: కుర్చీ విసిరి కొడుతూ.. ఎవర్ని అడిగి రాశావ్ రా అంతా నీ ఇష్టమేనా. ఆయన నా వియ్యంకుడు అని తెలిసి కూడా ఎలా ఎఫ్‌ఐఆర్ రాశావ్.
ఎస్‌ఐ: ఆయన ఎఫ్‌ఐఆర్ రాసిన వరకు ఒప్పుకోలేదు సార్.
క్రిష్: అది చింపి అవతల పడేయ్.
ఎస్‌ఐ: అది క్రైమ్ సార్.
క్రిష్: రూల్స్ చెప్పకు. మా మామ లాక్‌అప్ నుంచి బయటకు రావాలి. అందుకు ఏం చేయాలో అది చెప్పు.
ఎస్‌ఐ: అంటే అది పేరున్న వేరే ఎవరినైనా లాక్‌అప్‌లో కూర్చొపెడితే.. 
మహదేవయ్య: రుద్ర పోయి ఆ పనిలో ఉండు. 
విశ్వనాథం: ఎవర్ని అడిగి ఇదంతా చేస్తున్నారు. నేను తప్పు చేశాను నాకు శిక్ష పడాలి.
మహదేవయ్య: బావగారు మీరేం శ్రీకృష్ణ పరమాత్మ కాదు నేను అర్జునుడు కాదు. భగవద్గీత షురూ చేయొద్దు. ఇది కలియుగం నిజాయితీగా ఉంటే సరిపోదు.
విశ్వనాథం: నా సంగతి నేను చూసుకుంటా.
మహదేవయ్య: ఏం చూసుకునేది. జైలుకి వెళ్లే 14 ఏళ్ల వరకు బయటకు రాలేవు.
విశ్వనాథం: అన్నింటికి సిద్ధపడే లొంగిపోయాను.
మహదేవయ్య: అరే ఏంట్రా ఇది. మాట్లాడితే లొంగిపోయా అంటున్నాడు. ప్రభుత్వం అవార్డు ఇస్తుందా ఇతనికి. అయినా హత్య చేస్తే సిగ్గు పడక్కర్లేదు. దొరికిపోతే సిగ్గు పడాలి. జైలుకు పోవడానికి ఇష్టపడుతున్నాడు. చిప్పకూడు తినడానికి సిద్ధపడుతున్నాడు. పిచ్చోడా మంచోడా. 
సత్య: మామయ్య నాన్న.
మహదేవయ్య:  ఆ మొండితనం చూస్తుంటే బాధనిపిస్తుందమ్మా. నువ్వైనా చెప్పు. నీకు అర్థమవుతుందా నువ్వు లోపల ఉంటే నీకు జరిగే నష్టం కంటే నాకు జరిగే నష్టమే ఎక్కువ. నా చెల్లమ్మని ఖైదీ భార్య అంటారు. నా కోడలిని ఖైది కూతురు అంటారు. నువ్వు సపోర్ట్ చేస్తే బయటకు తీసుకొస్తా.
విశ్వనాథం: అవసరం లేదు.
మహదేవయ్య: రేయ్ ఏంట్రా ఇది.
క్రిష్: బాపు నేను మాట్లాడుతా నువ్వు బయట ఉండు. 
 
భైరవి మహదేవయ్యకి కాల్ చేస్తుంది. మహదేవయ్య భైరవిని తిడతాడు. మామ జైలులో ఉంటే మన కూతురికి పరువు తక్కువ అని భైరవి అంటే ఈ వంకతో కూతుర్ని ఇంటికి తెచ్చే ప్రయత్నం చేస్తే అవుతుందని అంటాడు. విశ్వనాథానికి ఎన్ని చెప్పినా వినడు. ఇక ఎస్‌ఐ హర్ష చేతికున్న గాయం చూసి చేయి చూపించమని అడుగుతాడు. హర్ష చేతి మీద కాళీ తోసేసినప్పుడు తగిలిన గాయాల గురించి అడుగుతాడు. విశ్వనాథం కవర్ చేయాలని చూస్తాడు. ఎస్‌ఐ అనుమానిస్తాడు. సత్య వాళ్లకి కూడా డౌట్ వస్తుంది. క్రిష్ విశ్వనాథంతో మీరు మీ పిల్లల బాధ గురించి ఆలోచించమని జైలుకి వెళ్తే జీవితం నాశనం అయిపోతుందని అందరిని పరేషాన్ అయిపోతున్నారని.. మీ వల్ల కాళీ చచ్చిపోలేదని క్రిష్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రేవతికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కిరణ్.. త్వరలోనే పెళ్లి!