Satyabhama Today Episode సంధ్యకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. విశాలాక్షి కూతుర్ని రెడీ చేస్తుంది. శాంతమ్మ వచ్చి పెళ్లి చూపుల్లో ఎలా ఉండాలో మనవరాలికి చెప్తుంది. ఇక సత్య వచ్చి తన చెల్లిని పొగిడి పెళ్లి కొడుకుకి కచ్చితంగా నచ్చేస్తావ్ అని అంటుంది. దీంతో సంధ్య సిగ్గు పడుతుంది. ఇక సత్య తన నెక్లెస్ సంధ్యకు వెయబోతుంటే తల్లి అడ్డుకుంటుంది.


విశాలాక్షి: సత్య ఇది నీ నెక్లస్. దాని మెడలో వేస్తావెందుకు..


సత్య: నాకు నగలు అంటే ఇష్టం ఉండవు అని నీకు తెలుసుకదమ్మా. పెళ్లిలో మీరు పెట్టారు అని వేసుకున్నాను. ఇప్పుడు సందర్భం వచ్చింది కదా అని ఇప్పుడు నా చెల్లికి ఇస్తున్నా. 


విశాలాక్షి: నీకు తప్పు అనిపించకపోవచ్చు కానీ నీ అత్తారి దృష్టిలో తప్పే. నీకు సంబంధించిన ప్రతీ వస్తువు మీద నీ అత్తారింటికి హక్కు ఉంటుంది. అలాగే అధికారం కూడా ఉంటుంది. నీ నగల లెక్క వాళ్లకి చెప్పాల్సి న అవసరం ఉంటుంది. వాళ్లకి చెప్పకుండా నువ్వేం చేయకూడదు. 


సత్య: ఏంటమ్మ ఈ రూల్స్. నాకు అత్తిళ్లు ఎంత ముఖ్యమో పుట్టిళ్లు కూడా అంతే ముఖ్యం. 


శాంతమ్మ: సాఫీగా సాగుతున్న సంసారంలో ఎందుకు అమ్మ కలతలు తెచ్చుకుంటావ్. నీ భర్త నిన్ను సమర్ధించవచ్చు. కానీ వాళ్ల వాళ్లకి చెప్పలేడు కదా..


సత్య: నేను ఈ నెక్లెస్ సంధ్యకు ఇస్తున్నా అంతే మీరు ఎవరూ మాట్లాడకండి. 


క్రిష్ వచ్చి పెళ్లి వాళ్ల కోసం టిఫెన్లు రెడీ చేశావా అని సత్యని అడుగుతాడు. మామ తన మీదే బాధ్యత పెట్టాడని అన్నీ తనే చూసుకోవాలని అంటాడు. ఇక పెళ్లి వాళ్లని రిసీవ్ చేసుకోవడానిక బయటకు రమ్మంటాడు. సత్య వస్తాను అంటుంది. క్రిష్‌ని చూసి అందరూ మురిసిపోతారు. 


నందిని తల్లి మీద అరుస్తుంది. పండక్కి పిలిచి ఇక ఇక్కడే ఉండిపోతావ్ అని చెప్పి ఇప్పుడు బట్టలు సర్దుకొని వెళ్లిపోమని చెప్తున్నావ్ అంటుంది. దీంతో భైరవి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తుంది. నందినిని తన కాపురం చెడగొట్టడానికి సంధ్య పెళ్లి చూపులు చెడగొట్టమని ఐడియా ఇస్తుంది. అందుకు ఏం చేయాలో చెప్తుంది. క్రిష్ కూడా అక్కడే ఉండటంతో నీ పని సులభం అవుతుందని అంటుంది. ఇంతలో హర్ష రావడంతో భైరవి మంచిగా మాట్లాడుతుంది. ఇక హర్ష నందినిని తీసుకొని ఇంటికి బయల్దేరుతాడు.


సత్య: థ్యాంక్స్.. నీ నుంచి ఇంత పాజిటివిటీ ఊహించలేదు. ఇచ్చిన మాట మీద నిలబడి పెళ్లిచూపులకు దగ్గరుండి అన్నీ ఏర్పాట్లు చూసుకుంటున్నావ్.


క్రిష్: నీ ఇష్ట ప్రకారం నడుచుకుంటే మంచోడిని.. నా ఇష్ట ప్రకారం నడుచుకుంటే చెడ్డొడిని. నేను ఎదుటోడి మనసును అర్థం చేసుకుంటా. 


ఇంతలో నందిని, హర్ష ఇంటికి వస్తారు. హర్ష నందినిని దగ్గరకు తీసుకోవడంతో నందిని ఏంటి అన్న ఎదురు పడితేనే ప్రేమ చూపిస్తావా లేకపోతే పట్టించుకోవా అని అడుగుతుంది. దీంతో సత్య అలా ఏం లేదు మీ అన్నయ్య నీ గురించి తలచుకుంటూనే ఉంటారు అని అంటుంది. దీంతో నందిని పిల్లికి ఎలుక సాక్ష్యం అంటే ఇదే అని అంటుంది. 


సత్య: ఆ మాటకు వస్తే మీ అన్నయ్యే కాదు మా అన్నయ్య కూడా అంతే అలా అని నేను సాధిస్తున్నానా ఏంటి. మనమే అర్థం చేసుకోవాలి.


హర్ష: నువ్వు లేకుండా నేను మీ ఇంటికి వెళ్లి వచ్చాను.


సత్య: అది నా ఇళ్లు కాదు. మీ అత్తగారిళ్లు. నేను అక్కడకి వస్తే అది నా ఇళ్లు.


క్రిష్: బావ ఇంకా రెండు దినాలు ఆగితే మేమే అక్కడికి వచ్చేవాళ్లం. సరదాగా కలిసి ఉండేవాళ్లం. 


హర్ష: చెల్లి పెళ్లి చూపులు కదా అందుకే వచ్చేశాం.


నందిని: అవును ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మా కోసమా ఏంటి.


క్రిష్: అంత లేదు పెళ్లి వాళ్ల కోసం. మీరు లోపలికి వెళ్లి సంధ్యతో ఉండండి.. ఇక్కడ మేం చూసుకుంటాం.


నందిని: అట్లానే నేను చేయాల్సిన పని కూడా మస్త్ ఉంది. 


నందిని లోపలికి వచ్చి సంధ్య మంచిగా రెడీ అవ్వలేదు అని దెప్పిపొడుస్తుంది. ఇక విశాలాక్షి తన దైన స్టైల్‌లో క్లాస్ ఇస్తుంది. ఇక నందిని సంధ్య వేసుకున్న నగ చూస్తుంది. విశాలాక్షి అది సత్య నగ అని చెప్తుంది. దీంతో అక్క నగ సంధ్య మెడలో వేయడం లేనిపోని ఆడంబరం అని అంటుంది. సంధ్య చిన్నబోతుంది. ఇక నందిని తనని వేరుగా చూస్తున్నారు అని చిరాకు పడి వెళ్లిపోతుంది. 


భైరవి పనిమనిషి పంకజానికి ఓ ఫోన్ ఇచ్చి పెళ్లి వాళ్లకి కాల్ చేసి సంధ్య గురించి చెడుగా చెప్పిస్తుంది. సంధ్య ఓ అబ్బాయిని ప్రేమించింది అని బలవంతంగా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని పెళ్లి జరగినా ఏదో ఒక రో.జు సంధ్య లేచి పోతుందని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది. పెళ్లి వాళ్లు ఆలోచనలో పడతారు. కానీ ఇంత వరకు వచ్చాం అని పెళ్లి చూపులకు వెళ్దామని బయల్దేరుతారు. భైరవి నందినికి కాల్ చేసి విషయం చెప్తుంది. 


మరోవైపు పెళ్లి వాళ్లు వస్తారు. క్రిష్ తనని తాను పరిచయం చేసుకొని సత్యని పరిచయం చేస్తాడు. ఇక పెళ్లి కొడుకు తల్లి సత్యతో ఏమ్మా నువ్వు కూడా ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతుంది. సత్య, క్రిష్‌లు షాక్ అవుతారు. దీంతో క్రిష్ నేనే తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటాడు. దీంతో పెళ్లి కొడుకు తల్లి ఓహో ఫ్యామిలీలోనే ఇలా ఉందా అంటుంది. సత్యకు ఏమీ అర్థం కాదు. పెళ్లి వాళ్లు లోపలికి వస్తారు. నందిని ఎలా అయినా పెళ్లి చూపులు చెడగొట్టాలి అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ : సరోగసీకి వెళ్దామని మురారికి చెప్పిన కృష్ణ.. ఇక మురారి తన కొంగు పట్టుకొని తిరగడం ఖాయమన్న ముకుంద!