Satyabhama Today Episode మహదేవయ్య పార్టీ వాళ్లు మీటింగ్‌కి పిలిచారు అని తనకి కుదరదు అని రుద్రకు వెళ్లమని చెప్తాడు. రుద్ర బయటకు వెళ్తుంటే రేణుక ముగ్గుపిండితో ఎదురుగా వస్తుండగా ఒకరికి ఒకరు ఢీ కొట్టుకుంటారు. ఇక తనకు భార్య సమాధానం చెప్పింది అని రుద్ర రేణుక మీద చేయి ఎత్తుతాడు. ఇంతలో సత్య బావగారు అని పిలిచి ఆపుతుంది. భార్య మీద అన్ని హక్కులు ఉంటాయి కానీ కొట్టే హక్కు ఉండదని చెప్తుంది. 


సత్య: అక్క అమాయకురాలు ఎవరు ఎంత బాధ పెట్టినా లోపలే కుమిలిపోతుంది కానీ ఎదురు తిరగదు. అందుకని ప్రతీ విషయంలో అక్కనే తప్పు పట్టి శిక్షించాలి అనుకోవడం ఎంత వరకు న్యాయం బావగారు.
రుద్ర: నువ్వు ఈ ఇంటికి పెద్ద రాయుడు అనుకుంటున్నావా తీర్పులు చెప్పడానికి చూడు ఏం చేసిందో.. 
సత్య: నేను మొత్తం చూశాను బావగారు తప్పు ఎవరిదో నీకు తెలుసు నాకు తెలుసు.
రుద్ర: రేయ్ చిన్నా.. రేయ్ చిన్నా.. 
క్రిష్: చెప్పు అన్న.
రుద్ర: ఆడ పిల్ల ఆడపిల్ల లెక్క ఉండాలి పులి పిల్లలా ఉండకూడదు. ఆ మాట నీ భార్యకు చెప్పు. నీకు పెళ్లానికి కంట్రోల్ పెట్టడం రాకపోతే గొళ్లెం పెట్టు. మా మొగుడు పెళ్లాల మధ్యలోకి రావొద్దని చెప్పు.
క్రిష్: అన్నా సత్యకి ఓ అలవాటు ఉంటుంది. తను చూసిందే నిజం అనుకుంటుంది. ఎవరు ఏం చెప్పినా నిజం అనుకుంటుంది. మనం ఏం చేయలేం. కాకపోతే ఒకటి ఇప్పుడు సత్య మీ ఇద్దరి మధ్య నిలబడటం అస్సలు తప్పు కాదు. ఇప్పుడు ఇక్కడ జరిగింది మొత్తం నేను చూశా. అయినా అయినదానికి కాని దానికి వదినను ఎందుకు అలా సతాయిస్తావు చెప్పు. సత్యకు మంచి అలవాటు ఉంది. ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ దిక్కు నిల్చొని మాట్లాడుతుంది. నువ్వే సత్యతో మాట్లాడుకొని సెటిల్ చేసుకో. 
భైరవి: రేయ్ క్రిష్..
క్రిష్: అమ్మ పిలుస్తుంది.
సత్య: అక్క నువ్వు లోపలికి వెళ్లు.. వెళ్లు అక్క. మొగుడు పెళ్లాల మధ్యకు మూడో మనిషి రాకూడదు అని నాకు తెలుసు. కానీ ఏం చేస్తాను సాటి ఆడపిల్లాలా వచ్చాను. దయచేసి అక్కని ఇవ్వండి పెట్టకండి. గీత దాటితే క్షమించండి.


క్రిష్: ఫ్రెండ్స్‌ కాల్ చేసి పార్టీకి రమ్మంటే నేను రాను అని చెప్పి.. అందరూ నా నెత్తినెక్కి డ్యాన్స్ చేసేటోళ్లే..
భైరవి: చేసుకున్నోళ్లకు చేసుకున్నంత.. పెళ్లాన్ని నెత్తికెక్కించుకుంటే అంతే.. రేయ్ నీ పెళ్లాం కాళ్లు నువ్వు విరక్కొడతావా.. నన్ను విరక్కొట్టమంటావా..
క్రిష్: నువ్వు నా పెళ్లాం వెనకపడ్డావేంటే.. 
భైరవి: అది ఈ ఇంట్లో అందరి వెంట పడుతుంది. వాళ్ల పంచాయితీల్లో ఇది ఎందుకు తల దూర్చడం ఎందుకు. ఇంట్లో ఎవరి జోలికి రావొద్దని చెప్పు. 
క్రిష్: అంతే కదా నేను చూసుకుంటాలే.
భైరవి: ఏంట్రా నువ్వు చూసుకునేది. ఇప్పటికైనా సత్య నిన్ను దగ్గరకి రానిస్తుందా..
క్రిష్: నా నెత్తి నొప్పులేవో నేనే పడతా నన్ను విడిచిపెట్టు. 
భైరవి: చూస్తా నీ పెళ్లాన్ని నువ్వు కంట్రోల్‌లో పెట్టలేదు అనుకో ఏం చేయాలో అదే చేస్తా.. 


మరోవైపు రేణుక బాధ పడుతుంటే సత్య వచ్చి మాట్లాడుతుంది. ఈ ఇంట్లో కోడలు అంతే బానిస అని చెప్పుకొని రేణుక బాధపడుతుంది. దీంతో సత్య కోడలిగా మనం మన బాధ్యత నెరవేర్చాలి ప్రేమ పంచి ప్రేమలు ఆశించడం తప్పు కాదు కదా అంటుంది. దీంతో రేణుక నీకు నీ మొగుడి సపోర్ట్ ఉంది నా నా మొగుడి సపోర్ట్ లేదు అని బాధ పడుతుంది. దీంతో సత్య అక్కకి సపోర్ట్ చేస్తాను అని రాజీ పడొద్దని చెప్తుంది. దీంతో రేణుక అలాంటివి ఈ ఇంట్లో కుదరవు అన్నింటికి సర్దుకోవాలి అని అంటుంది. 


మరోవైపు విశ్వనాథం ఇంట్లో అందరూ హాల్‌లో కూర్చొంటారు. ఇక పండగకు అల్లుడు కూతుర్ని పిలవాలని శాంతమ్మ విశ్వనాథానికి చెప్తుంది. నేరుగా ఇంటికి వెళ్లి చెప్పాలి అని అంటుంది. ఇక హర్ష కస్సుబుస్సులాడుతాడు. శాంతమ్మ సర్దిచెప్తుంది. వాళ్ల ఇంటికి వెళ్లాలి అనిపించడం లేదు అని విశ్వనాథం అంటే సత్యని శాశ్వతంగా మర్చిపోమని అంటుంది. దీంతో విశ్వనాథం రాజీపడి పిలవడానికి ఒప్పుకుంటాడు. విశ్వనాథాన్ని చూసి సత్య ఎమోషనల్ అవుతుంది. 


సత్య: ఇన్నాళ్లకు నన్ను చూడాలి అనిపించిందా నాన్న.
విశ్వనాథం: నీకు అది కూడా చూడాలి అనిపించలేదు కదమ్మా. అందుకే పారి పోయి వచ్చేశావ్. క్రిష్‌ని చూసి ఎలా ఉన్నావ్ బాబు.
క్రిష్: బాగానే ఉన్నాను లోపలికి రండి.
మహదేవయ్య: కూర్చొండి బావగారు. చాలా దూరం వచ్చారు. తప్పిపోయారా ఏంటి. సత్య నీళ్లు ఇవ్వడంతో.. చూశారా బావగారు కూతురి ప్రేమ ఎలా ఉంటుందో. మీకే నీళ్లు ఇచ్చింది. నన్ను కనీసం అడగలేదు కూడా. సరే బావగారు నిజం చెప్పండి మీ అంతట మీరు వచ్చారా లేదంటే కూతురు కంప్లైంట్ చేస్తే ఇక్కడికి వచ్చారా..
విశ్వనాథం: అలా ఏం లేదు బావగారు తను నాకే కాదు మీకు కూడా కూతురు లాంటిదే. తనకు ఏదైనా సమస్య వస్తే మీతోనే చెప్తుంది. ఉగాది వస్తుంది పెళ్లి తర్వాత మొదటి పండగ కదా అందుకే అల్లుడు కూతుర్ని పిల్లుద్దామని  వచ్చా.
మహదేవయ్య: అమ్మ ఏమంటావ్ పంపియాలనా.. గంట ఊపుతుంది. 
భైరవి: అల్లుడిని పిలవగానే సరిపోదు. మర్యాద కూడా అలాగే చేయాలి. వాడు అల్లాటప్ప అల్లుడు కాదు మహదేవయ్య కొడుకు.
మహదేవయ్య: నీ నాలుకకి దురద పుడుతుందా ఏంటే. ఏదో ఒక వంకర మాట అనకపోతే తోచదానే. కత్తిరించి పడేస్తా నాలుక. ప్రేమతో అల్లుడిని పిలవడానికి వచ్చాడు నీ మాటలకు బాధపడతారుగా.. ఈడ ఇద్దరం మగవాళ్లం మాట్లాడుకుంటున్నాం అవసరమా నీకు. అమ్మ చెప్పవే కొత్త కొడల్ని పంపేయమంటావా.. మా అమ్మ  పర్మిషన్ ఇచ్చేసిందని మహదేవయ్య చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: కలిసి భోజనం చేసిన రామ్‌, మధులు, సీత సువాసనలకు ఫిదా.. మరో కిష్కిందకాండే అంటూ అత్తకి వార్నింగ్!