Satyabhama Serial Today Episode చీర కట్టు సూపర్‌గా ఉందని క్రిష్‌ సత్యతో చెప్తాడు. దాంతో సత్య మీ బామ్మ చూస్తే నీ పని అయిపోతుందని సత్య అంటుంది. ఇక క్రిష్ సత్యతో ఫస్ట్ నైట్ ముహూర్తం ఇంకా పెట్టడం లేదు అడగొచ్చు కదా అని అంటాడు. దానికి సత్య నాకు సిగ్గు నేను ఎలా అడుగుతా అని అంటుంది. దాంతో క్రిష్ ముసలిది ఈ సారి గదిలోకి రాని దాని సంగతి చెప్తా అని కర్ర తీస్తాడు.


సత్య: కొడతావా ఏంటి.
క్రిష్: కొట్టాలా చంపాలా నా నోటి దగ్గర కూడు లాగేసుకున్నా బాధ పడను కానీ నా నోటికి అందాల్సిన ముద్దు లాగేసుకుంది. అరే ఎట్లా ఉంటుంది చెప్పు.
సత్య: అట్లుంటుంది మల్లా.
క్రిష్: సర్లే కానీ ఒకసారి దగ్గరకు రా. నిన్న రాత్రి ముద్దు బ్యాలెన్స్ ఉంది కదా ఇచ్చేస్తా.
సత్య: ఇప్పుడు కాదు.
క్రిష్: మరెప్పుడు దానికి కూడా పంతులు గారు వచ్చి ముహూర్తం పెట్టాలా. నువ్వు మంచి దానివి కదా నా బుజ్జి కదారా. నువ్వు రావు కానీ నేనే వస్తా అని దగ్గరకు వెళ్లి ముద్దు పెట్టుకోవాలని అనుకుంటాడు.
జయమ్మ: ఓరేయ్ పగులుతుంది.
క్రిష్: నేనేం చేయడం లేదు బామ్మ నేనేం చేయడం లేదు. అని మంచం కింద వెతుకుతాడు.
జయమ్మ: రేయ్ నేను అక్కడ లేనురా ఇక్కడ ఉన్నా అంతా  చూస్తున్నా ఏం చేస్తున్నావ్ రా అని కొడుతుంది క్రిష్‌ని.
క్రిష్: ఏందే నీ ప్రాబ్లమ్ కలవము అంటే కలవమంటావ్ కలుస్తాం అంటే ముహూర్తం అంటావ్ నిమ్మకాయ పిండినట్లు పిండేస్తున్నావ్ కదే.


వీడివన్నీ వీడి తాత బుద్ధులే తొందర ఎక్కువ అని జయమ్మ సత్యని తీసుకొని వెళ్లిపోతుంది. క్రిష్ సత్యకి ముద్దు కావాలని సైగ చేస్తాడు దాంతో సత్య ఫ్లైయింగ్ కిస్ ఇస్తే దాన్ని పట్టుకొన్నట్లు క్రిష్ బెడ్ మీదకు ఎగురుతాడు. ఆఖరికి గాల్లో ముద్దులు పట్టుకోవాల్సిన పరిస్థితి అని అనుకుంటాడు. మరోవైపు హర్ష గది నుంచి బయటకు వస్తూ శాంతమ్మని చూసి తలుపు దగ్గరకు వేసి నానమ్మ తలుపు వేసేశా అంటాడు. దానికి శాంతమ్మ తలుపులు వేసుకోవాల్సింది మీరు బయట ఉంటే కాదు గదిలో ఉన్నప్పుడు అని నవ్వుకొని వెళ్లిపోతుంది. హర్ష సిగ్గు పడుతూ టిఫెన్ పెట్టమని అంటాడు. సంధ్య కూడా ఆకలి వేస్తుంది టిఫెన్ పెట్ట అమ్మా అని వస్తుంది. ఇక నందిని టీఫెన్ చేసి తీసుకొని వస్తే హర్ష చూస్తూ ఉండిపోతాడు. ఈ రోజు నీ వంటనా వదినా అని సంధ్య అడుగుతుంది. నందిని నీ ఇష్టాన్ని తెలుసుకొని టిఫెన్ చేసిందని నువ్వు చాలా అదృష్టవంతుడివి అని విశాలాక్షి అంటుంది. నందిని టిఫెన్ పెడుతుంది. సంధ్య, హర్ష ఇద్దరూ బుక్ అయిపోయాం అని అనుకుంటారు.  



సంధ్య: అమ్మా ఈ రోజు ఉపవాసం ఉంటానని మొక్కుకున్నా సారీ వదిన మంచి పొంగలి మిస్ అయిపోయా.
హర్ష: సంధ్య చిన్నప్పుడు నుంచి అన్యోన్యంగా కలిసి పెరిగాం. అమ్మ ఏం చేసినా కలిసే పంచుకున్నాం. ఎన్నోసార్లు నీ కష్టాన్ని నేను పంచుకున్నాను. కానీ ఇప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు ఒంటరిగా వదిలేస్తావా అన్యాయం సంధ్య.
నందిని: అత్తమ్మ ఎలా ఏడిపిస్తున్నారో చూడు.
విశాలాక్షి: రేయ్ పిచ్చి వాగుడు కట్టిపెట్టి తిను. సంధ్య నువ్వు కూడా తిను. తినండి ఇద్దరూ. 


ఇద్దరూ తింటారు. మరోవైపు మైత్రి తల్లిదండ్రుల ఫొటో దగ్గర కూర్చొని బాధ పడుతూ ఉంటుంది. ఇంతలో మైత్రి ఫ్రెండ్ ఫోన్ చేసి మైత్రి మనసు బాలేదని మాట వినడం లేదని సరిగా ఏం తినడం లేదని నీరసంగా ఉందని చెప్తుంది. దాంతో హర్ష వెంటనే వస్తున్నా అని అమ్మతో చెప్పి మైత్రి దగ్గరకు వెళ్తా అని చెప్తాడు. నందిని ఫీలవుతుంది. తినేసి వెళ్లమని చెప్తుంది. మరోవైపు వరంగల్ ఎమ్మెల్యే రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోయినట్లు వస్తుంది. ఎమ్మెల్యే టికెట్ కోసం తానే ఆ ఎమ్మెల్యేను చంపానని మహదేవయ్య అంటే తనకు తెలీకుండా ఇంత చేశావా అని క్రిష్, రుద్ర సంతోషం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తే సత్య మాత్రం అన్యాయం అని ఫీలవుతుంది. 


హర్ష మైత్రి దగ్గరకు వెళ్తాడు. ధైర్యం చెప్తాడు. మైత్రి మాత్రం ఈ బతుకు నాకు వద్దుని ఏడుస్తుంది. నాకు ఎవరూ లేరని కుమిలి పోతుంది. దాంతో హర్ష నీకు నేను లేనా. నువ్వు కన్నీరు పెట్టుకుంటే నీ పక్కన ఉన్నాను కదా. నువ్వు తినడం లేదని తెలిసి కంగారుగా పరుగెత్తుకుంటూ వచ్చాను కదా నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను ఉన్నాను కదా అని అంటాడు. దాంతో మైత్రి ప్రతీరోజు ఇలా రాగలవా పక్కన కూర్చొగలవా అని అడిగితే నీ దగులు పొగొట్టి ఒకప్పటి మైత్రిలా చేసే బాధ్యత నాది అని హర్ష అంటాడు. దాంతో మైత్రి ఏం మాట్లాడకుండా హర్ష భుజం మీద వాలిపోతుంది. నువ్వు తినకపోతే నేను కడుపు మాడ్చుకుంటాను అని హర్ష అంటే మైత్రి టిఫెన్ ప్లేట్ హర్షకి ఇచ్చి తినిపించమని చెప్తుంది.


ఇక సత్య అందరికీ టిఫెన్ వడ్డిస్తుంది. మహదేవయ్యకు వడ్డించబోతూ ఆగుతుంది. దాంతో మహదేవయ్య నువ్వు ఎందుకు ఆగావో నాకు తెలుసమ్మా ఆరోజు అరిచాను అనే కదా అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు వ్రతంలో అందరి ముందు నీ తప్పు ఒప్పుకొని చిన్నాతో కలిసి ఉంటాను అని చెప్పి నీ మామ మనసు గెలుచుకున్నావని చెప్తాడు సత్య సంతోషిస్తుంది. చిన్న కోడలిగా ఈ ఇంట్లో అన్ని హక్కులు దక్కించుకున్నావని నీ చేతితో వడ్డించమ్మా అని మహదేవయ్య అంటాడు. ఇక క్రిష్ సత్య నడుము గిల్లేస్తాడు. సత్య అరుస్తుంది. దాంతో ఏమైందని అందరూ అడిగితే దోమ కుట్టిందని క్రిష్ అంటాడు. దానికి జయమ్మ నీకు బాగా బలిసిన దోమే కుట్టింది నేను చూశానని అంటుంది. ఇక మహదేవయ్య క్రిష్‌ పోస్టర్లు పని అయిందా అని రుద్రని అడిగితే రుద్ర తీసుకొచ్చి చూపిస్తాడు. రుద్ర టిఫెన్ తినకుండా లేచేస్తాడు. ఏమైందని అడిగితే కడుపు నిండిపోయిందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: తండ్రిని ముద్దాడిన కొడుకు ఎమోషనలైన మిత్ర.. ఈసారి తండ్రీకొడుకులకు గండం!