Satyabhama Serial Today Episode పార్టీ యూత్ ప్రెసిడెంట్ పదవి క్రిష్, రుద్రల్లో ఎవరికి ఇవ్వాలో చెప్పమని మహాదేవయ్యని పార్టీ వాళ్లు అడుగుతారు. దాంతో మహదేవయ్య రుద్ర అభిప్రాయం అడిగితే మనసులో రుద్ర తండ్రి ఆ పదవి తనకే ఇస్తాడు అనుకొని బయటకు మాత్రం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను బాపు అని చెప్తాడు. దాంతో మహదేవయ్య క్రిష్‌ని యూత్ లీడర్ చేయమని అంటాడు. రుద్ర షాక్ అయిపోతాడు.
భైరవి: అదేంటి పెనిమిటి పెద్దొడిని కాదు అని చిన్నోడిని యూత్ లీడర్ చేయడం ఏంటి. వాడికి ఏం తక్కువ ఒకసారి ఆలోచించు.
మహదేవయ్య: పెద్దొడు దమ్మున్నోడు చిన్నోడు దమ్మున్నోడే కానీ రాజకీయానికి దమ్ము ఒక్కటి సరిపోదు. శత్రువుల్ని దుమ్ము దులిపే తెలివి కూడా ఉండాలి. అందుకే చిన్నా గాడి పేరు ఖాయం చేశా. నా నిర్ణయాన్ని అధిష్టానికి చెప్పండి రావుగారు.
క్రిష్: అది కాదు బాపు.
మహదేవయ్య: నిర్ణయం అయిపోయిందిరా. అమ్మ సత్య ఇంట్లో స్వీట్స్ ఉన్నాయి కదా ఈ శుభ సమయాన అందరికీ పెట్టు. వరలక్ష్మీ వ్రతం నీకు అన్నీ రకాలుగా కలిసొచ్చిందిరా కలిసొచ్చే కాలం అంటే ఇలాగే ఉంటుందేమో.
రుద్ర సత్య ఇచ్చిన స్వీట్ కోపంతో నలిపేసి పడేస్తాడు. ఇక నందిని గదిలో అరటి పండు తింటూ ఉంటే హర్ష వచ్చి పక్కన కూర్చొంటాడు. తొక్క పక్కన పడేస్తుంది. పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావ్ అని హర్ష అడుగుతాడు.
నందిని: ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలకు పోలికలు ఉంటాయా.
హర్ష: ఎందుకు ఉండవు. కచ్చితంగా ఉంటాయి.
నందిని: ఒకేలా ఆలోచిస్తారా.
హర్ష: కచ్చితంగా
నందిని: ఇప్పుడు మీ పెద్ద చెల్లి ఏం చేసింది మొగుడితో ప్రేమగా ఉన్నట్లు పైకి నటించి లోపల లోపల పెద్ద కుంభకోణం చేసింది. విడాకులకు ప్లాన్ చేసింది. నువ్వు కూడా మీదకి నా మీద ప్రేమ చూపిస్తున్నావ్ లోలోపల విడాకుల కోసం ప్లాన్ చేయడం లేదు అని నమ్మకం ఏంటి. అంటే ఒకే తల్లి రక్తం కదా ఆలోచనలు ఒకే తీరున ఉంటాయని నువ్వే చెప్పావు కదా.
హర్ష: బుద్ధి తక్కువై ఏదో అన్నాను.
నందిని: దొరికిపోయావని కవర్ చేసుకోకు.
హర్ష: చూడు జీవితంలో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్లవి ఎవరి ఇబ్బందులు వాళ్లవి ఎవరికి తగ్గట్టు వాళ్లు నడుచుకుంటారు. ఏం ఆలోచించకు.
నందిని: నాకు మీ చెల్లిలా మనసులో ఒకటి పెట్టుకొని ఉండటం తెలీదు ఏమైనా ఉంటే ముఖం మీదే కుల్లం కుల్లం. విడిపోయే ఆలోచన ఉంటే ఇప్పుడే చెప్పేయ్ పబ్లిక్‌లో తేల్చుకుందాం.
హర్ష: అమ్మా తల్లి నా మనసులో అలాంటి ఆలోచనలు ఏం లేవు.
హర్ష నందినితో వాదించడం తన వల్ల కాదు అని వెళ్లబోతు అరటి తొక్క తొక్కి నందిని మీద పడిపోతాడు. ఇంతలో శాంతమ్మ నందినిని పిలుస్తూ వచ్చి ఆ సీన్ చూసి బిత్తరపోతుంది. దాంతో ఇద్దరూ హడావుడిగా లేస్తారు. తలుపు వేసుకోకుండా ఏంటి ఇదంతా అంతా అని శాంతమ్మ కామెడీ చేసి వెళ్లిపోతుంది. ఇక హర్ష సిగ్గు పడితే నందిని పక్కింటోడి పెళ్లాన్ని చూసినట్లు ఇంత సిగ్గు పడుతున్నాడేంటని అనుకుంటుంది.
క్రిష్ సత్య ఫొటో చూస్తూ మాట్లాడుకుంటాడు. పెళ్లి వరకు తన ప్రేమ పెళ్లి కథ తన చేతిలో ఉండేదని ఇప్పుడు నీ చేతిలోకి మారిపోయిందని కథ ఎవరి చేతిలో ఉన్నా కొంచెం కూడా ముందుకు జరగలేదని అనుకుంటాడు. పెళ్లి కాక ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నామని అనుకుంటాడు. ఎవరి ఇంట్లో వాళ్లు ఉన్నప్పుడు ఎలా అయితే ఫొటో చూసుకుంటున్నానో ఒకే ఇంట్లో ఉన్న ఇప్పుడు కూడా అదే పరిస్థితి అని అనుకుంటాడు. సత్య ఫొటోకి ముద్దు పెట్టుకుంటాడు. ఇంతలో సత్య సిగ్గు పడుతూ వచ్చి క్రిష్ పక్కన కూర్చొంటుంది.
క్రిష్: అర్థమైంది. నీకు నాలెక్కే తొందరగా ఉందని.
సత్య: దేనికి.
క్రిష్: తెలీకుండానే నాకు ఇంత దగ్గరగా కూర్చొన్నావా.
సత్య: రోజూ లానే కూర్చొన్నాను కదా.
క్రిష్: అంతేనా.
సత్య: మరి నువ్వేమనుకున్నావ్.
క్రిష్ సత్యని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టే టైంకి జయమ్మ వస్తుంది. వచ్చి ఏంటి సంగతి అని అడుగుతుంది. దాంతో నలక పడితే తీశానని అంటాడు. ఇక జయమ్మ దిండు, దుప్పటితో వచ్చి నేను మీ తొలిరాత్రి అయ్యే వరకు ఇక్కడే పడుకుంటా అని అంటుంది. దాంతో క్రిష్ చిరాకుతో తన నానమ్మని వెళ్లిపోమని అంటాడు. వాళ్ల మాటలు కామెడీగా ఉంటాయి. ఇక జయమ్మ వెళ్లి బెడ్ మీద పడుకొని ఇద్దరూ చెరోవైపు పడుకోండి అని చెప్తుంది. కస్సుబుస్సులాడి పడుకుంటాడు క్రిష్. ఇక సత్య క్రిష్ ఇద్దరూ సైగలు చేసుకుంటారు. బయటకు వెళ్దామని లేస్తే జయమ్మ తిట్టి పడుకోమని అంటుంది. తర్వాత జయమ్మ నవ్వుకుంటుంది.
తనని యూత్ లీడర్ చేయలేదని రుద్ర మందు తాగుతూ తెగ ఫీలవుతాడు. రేణుక వచ్చి అంత ఎక్కువ తాగొద్దని భర్తకి చెప్తే రేణుక మీద రుద్ర అరుస్తాడు. ఫుల్లుగా తాగుతాడు. కుక్క లెక్క తాను పని చేయాలని చిన్నోడికి స్వీట్స్ ఇచ్చి తన కంట్లో కారం కొడుతున్నాడని రగిలిపోతాడు. ఎదురు తిరగలేక నీ మామ ముందు తల వంచేలేదని వెళ్లి నీ మామకి చెప్పు అంటాడు. దేని కోసం చేయి చాచను అని నా ప్రతాపం ఏంటో నీ మామకి చూపిస్తాను అని అంటాడు. ఇక రేణుక ఏం అనార్థం జరగబోతుందో అని అనుకుంటుంది. గదిలో సత్య చీర మార్చుకుంటుంటే క్రిష్ వస్తాడు. ఇక ఇద్దరూ చెరోవైపు తిరుగుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.