Satyabhama Serial Today Episode హర్ష ఇంటికి వెళ్లి మైత్రితో ఫస్ట్‌నైట్ అయిపోయిందని తలచుకొని గుమ్మంలోకి అడుగుపెట్టకుండా ఆగిపోతాడు. నందినికి మోసం చేశాను.. అపవిత్రం అయిపోయాను.. నందినికి ముఖం చూపించలేను అని కన్నీరు పెట్టుకుంటాడు. బామ్మ పిలవడంతో వస్తాడు. రాత్రంతా ఎక్కడున్నావని బామ్మ అడిగితే ఆఫీస్‌లో ఉన్నానని తడబడతాడు. 

శాంతమ్మ: పెళ్లాన్ని వదిలేస్తావా.. హర్ష: అలా ఎలా వదిలేస్తాను బామ్మ.శాంతమ్మ: నువ్వు వదిలేకపోయినా అది నిన్ను వదిలేస్తుంది. నీ ప్రవర్తన నచ్చక వదిలేస్తుంది. రాత్రంతా అది నీ కోసం ఎదురు చూసింది. తిండి కూడా తినలే ఎంతో పుణ్యం చేసుకోకపోతే నీకు అలాంటి భార్య రాదురా. వెళ్లి సారీ చెప్పి బతిమాలు.హర్ష: నేను చేసింది క్షమించరాని తప్పు బామ్మ.మహదేవయ్య: అయిన దానికి కాని దానికి చిన్నా గాడిమీద అరుస్తున్నావేంటే. ఇప్పుడు నీ మనసులో ఏముందో చెప్పనా వీలైనంత తొందరగా చిన్నా గాడిని ఇంటి నుంచి తరిమేయాలి అని చూస్తున్నావ్.భైరవి: అలాంటిదేమీ లేదు.మహదేవయ్య: భుకాయించకే. నువ్వు సంజయ్ గాడి మీద పడి ఏడుస్తున్నావని వాడు మన కొడుకు అని చెప్పా. అప్పటి నుంచి చిన్న మీద అరుస్తున్నావ్. వాడు నా కవచకుండలమే వాడు నా ప్రాణాన్ని కాపాడటానికి వాడి ప్రాణాన్ని అడ్డు పెడతాడు. వాడో ఓ విశ్వాసమైన జంతువే. నాకు మాత్రం సంజయ్ మీద ప్రేమ ఉండదా వాడితో బాపు అని పిలిపించుకోవాలి అని ఉండదా. అయినా వాడి మీద ఎప్పుడూ అరిస్తే వాడికి అనుమానం రాదా. ఒక్క మాట అడుగుతా చెప్పే మీదికి అరుస్తున్నావ్ కానీ అసలు నీకు చిన్నా గాడి మీద కోపం ఉందా.భైరవి: పాతి కేళ్లు పెంచినా కోపం ఎందుకు ఉంటుంది. ఇప్పుడు అయినా నా మీద కంటే వాడి పెళ్లాం మీద జరంత ఎక్కువ ప్రేమ చూపిస్తే మనసు చివుక్కుమంటుంది అంతే కానీ చిన్నా మీద ద్వేషం ఎందుకు ఉంటుంది అని ఏడుస్తుంది. కాకపోతే సంజయ్‌లో ఉంది నా రక్తం పేగు తెంచుకున్న బంధం కదా దాచుకోలేకపోతున్నా.మహదేవయ్య: దాచుకోవాలి.

హర్ష తల స్నానం చేస్తూ మైత్రితో జరిగిన ఘటన గుర్తు చేసుకొని గోడకు గుద్దుకొని అరుస్తాడు. నందిని వచ్చి హర్ష ఏమైంది అని కంగారు పడుతుంది. ఏమైందని అడిగితే ఏం లేదు అని హర్ష చెప్తాడు. హర్ష డల్‌గా ఉండటం చూసి నందిని ప్రశ్నిస్తుంది. నందిని హర్ష దగ్గరకు వెళ్లి మీరు రాత్రంతా మా కోసం కష్టపడితే నేను ఇలా అలగడం తప్పని అర్థమైందని అంటుంది. నందిని ప్రేమకు హర్ష కుమిలిపోతాడు. తినడానికి ఏమైనా తీసుకురమ్మని హర్ష చెప్పి నందిని వెళ్లగానే క్షమించు నందిని చాలా పెద్ద తప్పు చేశానని కుమిలిపోతాడు. 

మరోవైపు క్రిష్ తల్లి మాటలు గుర్తు చేసికొని కోపంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. అమ్మ గాజులు వేసుకోమని కూర్చొమంది ఇది చిన్న మాట అని మండిపోతుంటాడు. ఇదే మంచి అవకాశం అనుకొని సంజయ్ మందు తీసుకొచ్చి క్రిష్‌ తాగేలా చేస్తాడు. దాంతో క్రిష్ బాటిల్ మొత్తం తాగేస్తాడు. అమ్మ తిట్టింది అంటే అన్నీ దులిపేసుకో బ్రో అని అంటాడు సంజయ్. అమ్మతో మాట్లాడుతా అంటే దానికి సంజయ్ నేను మాట్లాడి సెట్ చేస్తా అంటాడు. క్రిష్‌ మత్తులో తాగుతూ ఉంటే సంజయ్ సత్య గదిలోకి వెళ్తాడు.

 సత్య పాట పాడుతూ తల దువ్వుకుంటూ ఉంటే ఇంత అందం అనుకొని సంజయ్ సత్య దగ్గరకు వెళ్లి వెనకాలే హగ్ చేసుకుంటాడు. సత్య షాక్ అయిపోతుంది. నీ మొగుడు మందు మత్తులో ఉన్నాడు.. అందర్ని మర్చిపోతాడు. కాసేపు క్లోజ్‌గా ఉందామని అంటాడు. సత్య తిడుతుంది. పశువురా నువ్వు అంటే సత్య చేతులు పట్టుకొని నలిపేస్తాడు. ఇంతలో క్రిష్ వస్తాడు. సంజయ్‌ని చితక్కొడతాడు. కొట్టుకుంటూ కిందకి తీసుకెళ్తాడు. అందరూ ఆపడానికి ప్రయత్నిస్తారు. సంధ్య ఆపితే నీ మొగుడికి పోయే కాలం వచ్చిందని అంటాడు. ఇక రుద్ర ఆపి ఎవరి మీద పడితే వాళ్ల మీదకు వెళ్తున్నావ్ అంటే నా గదిలోకి దూరి తప్పుగా ప్రవర్తించాడని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ఇంట్లో వరసగా అపశకునాలు.. లక్ష్మీ ఆందోళన నిజం అవుతుందా!!