అన్వేషించండి

Harsha Nagapal: మ్యాడీగా తెలుగు ప్రజలు గుండెల్లో నిలిచిపోయిన హర్ష...బెంగళూరులో పుట్టి, మోడల్‌గా ఎదిగిన నాగపాల్‌

Harsha Nagapal: మోడల్‌గానే గాక నటనలోనూ అదరగొడుతున్న హర్షనాగపాల్‌...లక్ష్మీరావే మాఇంటికిలో మ్యాడీగా తెలుగు ప్రేక్షకులకు చేరువ

Harsha Nagpal: అందం, అభినయంతోపాటు  తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అతి తక్కువ కాలంలో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యాడు హర్షనాగపాల్‌. ఏంటి పేరు చూసి ఈ అబ్బాయి తెలుగువాడు కాదా అనుకుంటున్నారా...ఖచ్చితంగా  తెలుగువాడు కాదు.  కానీ చూడగానే తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తున్న హర్ష...బెంగళూరులో పుట్టాడు. అన్నపూర్ణ సంస్థ వారి కొత్త సీరియల్‌ లక్ష్మీరావే మాఇంటికిలో మ్యాడీగా కీలక రోల్‌ పోషిస్తున్న ఈ 20 ఏళ్ల కుర్రాడికి  చిన్నప్పటి నుంచి నటనపై ఎంతో మక్కువ ఉన్న హర్ష నాగపాల్‌కు స్టేజీ షోలు చేయడమంటే ఎంతో ఇష్టం. పెళ్లిళ్లు, బర్త్‌డే పార్టీలు, ఫంక్షన్లలో ఈమ్సీగా చేసి మెప్పించేవాడు. అలా చిన్నప్పుడే స్టేషీషోలతో ఆకట్టుకున్నాడు.
            యుక్త వయసు వచ్చిన తర్వాత  నటను కెరీర్‌గా మలుచుకోవాలని నిర్ణయించుకున్న హర్ష...ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టి మోడల్‌గా మారాడు.  ప్రొఫెషనల్ ఈమ్సీగా  కెరీర్‌లో నిలదొక్కుకున్నాడు.  అతర్వాత అనేక ప్రముఖ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ పనిచేశాడు. ఆ తర్వాత బుల్లితెరపై అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. లైవ్‌ షోలు నిర్వహించడంలో ఎంతో అనుభవం సాధించడంతో సీరియల్‌లో సహజ నటనతో ఆకట్టుకుంటున్నాడు. బుల్లితెరతోపాటు.డిజిటల్ మీడియా, బ్రాండెడ్‌ ఉత్పత్తుల్లో నటిస్తూ అన్నిరకాల ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
                      మెడల్‌గా కెరీర్‌ దూసుకుపోతుండగానే....సన్‌టీవీలో ప్రసారమైన పుంగాయిపోవే అనే సీరియల్‌లో లీడ్‌రోల్‌ దక్కించుకున్నాడు. ఆ సీరియల్‌లో నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో టెలివిజన్‌రంగంలో వెంటవెంటనే అవకాశాలు దక్కాయి. కలర్స్‌ కన్నడ ఛానెల్‌లో వివిధ షోలల్లో నటించి మెప్పించాడు. అలాగే అనేక షార్ట్‌ఫిల్మ్‌ల్లోనూ  నటించి తన నటనకు సానబెట్టాడు. హర్ష నటించిన అనేక షార్ట్‌ఫిల్మ్స్‌ జాతీయస్థాయి ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు. అలాగే అనేక వర్‌ సాంగ్స్‌లోనే మెరిశాడు. హర్షనటించిన అనేక పాటలు మిలియన్‌కు పైగా వ్యూస్‌తో ఇప్పటికీ యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. నటననే కెరీర్‌గా ఎంచుకున్న హర్ష....అందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. అది తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడిందిని పలు సందర్భాల్లో హర్ష తెలిపాడు. 
                   పుట్టి పెరిగింది బెంగళూరు, పనిచేస్తుంది ముంబయిలో అయినప్పటికీ చూడగానే తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే రూపం హర్షనాగపాల్‌ది.అందుకే అన్నపూర్ణ సంస్థ జీ-తెలుగు ఛానెల్‌ కోసం నిర్మిస్తున్న లక్ష్మీరావే మా ఇంటికి సీరియల్‌ కోసం లీడ్‌ రోల్‌ వెతుకుతుండగా...మనవాడు కంటపడ్డాడు. అగ్రశ్రేణి నిర్మాణ సంస్థ, అతిపెద్ద నెట్‌వర్క్‌ ఛానెల్‌ కావడంతో వెంటనే ఈ సీరియల్‌ చేసేందుకు అంగీకరించాడు. ఇందులో ఎంతో చలాకీ అయిన మ్యాడీ పాత్రకు హర్ష అతికినట్లు సరిపోయాడు. కాలేజీకి వెళ్లే కుర్రాడిలా, హీరో అవ్వాలని కలలు కనే యువకుడిగా....తాతయ్య మాటకు ఎదురుచెప్పలేని అమాయక పాత్రలో నటించి మెప్పించాడు. హీరోయిన్ లక్ష్మీ పాత్రకు సరైనా జోడీగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు. ఈ సీరియల్‌లో వీరిద్దరి జోడీ కన్నులపండువగా ఉంటుంది.
                         కేవలం టీవీ సీరియల్స్‌, షార్ట్‌ఫిల్మ్‌ల్లో నటించడమే గాక...ప్రకటనలతోనూ  రెండు చేతులా సంపాదిస్తున్నాడు హర్షనాగపాల్‌. మోడల్‌గా  ప్రముఖ ఫొటోగ్రాఫర్లు, స్టైలిస్టులతో కలిసి అనేక ఎడిటోరియల్ షూట్లు, ప్రకటనల్లో నటించాడు. దాదాపు వందకుపైగా ప్రముఖ బ్రాండ్లకు పనిచేశాడు. అలీన్‌సోలీ, రేమాండ్‌, వీట్‌, బోట్‌, సెట్‌వెట్‌, నీల్‌కమల్‌, ప్రైస్టైజ్‌, పాండ్స్‌,లేక్మీ, జియో, టైటాన్ వాచెస్‌, సోనెటా, పార్క్‌అవెన్యూ,మేక్‌మైట్రిప్‌ వంటి అగ్రశ్రేణి బ్రాండ్లలో నటించాడు. 
                    టీవీ సీరియల్స్‌, సినిమాల్లో కెమెరా ముందు నటించడం వేరు...స్టేజీపై లైవ్‌ ప్రోగ్రామ్‌ చేయడం వేరు. ఎందుకంటే సినిమాల్లో, సీరియల్‌లో ఒకటికి రెండు టేక్‌లు తీసుకునే అవకాశం ఉంది. కానీ లైవ్‌ ప్రోగాం అలా కాదు.అప్పటికప్పుడు స్పాంటినియస్‌గా  మాటలు కలపాలి.వచ్చిన వేలాదిమంది ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా మాట్లాడాలి. అతిథులను మెప్పించాలే మాటలు కలపాలి. కానీ ఇవన్నీ మనలోడి మంచినీళ్లు తాగినంత ఈజీగా చేసేస్తాడు. నటనలో శిక్షణ తీసుకోవడం వల్లే....ఇదంతా సాధ్యమైందని హర్షనాగపాల్ చెబుతుంటాడు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Podharillu Serial Today March 9th:  నారాయణ చేసిన పనికి షాక్‌ తిన్న మహాలక్ష్మీ..? అన్న మాధవ్‌ను అపార్థం చేసుకున్న కేశవ్‌ ఏం చేశాడు...?
పొదరిల్లు: నారాయణ చేసిన పనికి షాక్‌ తిన్న మహాలక్ష్మీ..? అన్న మాధవ్‌ను అపార్థం చేసుకున్న కేశవ్‌ ఏం చేశాడు...?
Nindu Manasulu Serial Today March9 th:  ప్రేరణ తండ్రిని దాచిపెట్టిందెవరు...? గణ, ఈశ్వరీ ప్రేరణకు సారీ ఎందుకు చెప్పారు..?
నిండుమనసులు: ప్రేరణ తండ్రిని దాచిపెట్టిందెవరు...? గణ, ఈశ్వరీ ప్రేరణకు సారీ ఎందుకు చెప్పారు..?
Meghasandesam Serial Today march 9th: ‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ను మెచ్చుకున్న కేపీ – కోపంతో వెళ్లిపోయిన శరత్‌
‘మేఘసందేశం’ సీరియల్‌: గగన్‌ను మెచ్చుకున్న కేపీ – కోపంతో వెళ్లిపోయిన శరత్‌
Illu Illalu Pillalu Serial Today March 9th: బుజ్జమ్మ, నర్మద మళ్లీ కలిపోయారా..? అత్తాకోడళ్ల అనుబంధం చూసి శ్రీవల్లి ఏం చేసింది..?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: బుజ్జమ్మ, నర్మద మళ్లీ కలిపోయారా..? అత్తాకోడళ్ల అనుబంధం చూసి శ్రీవల్లి ఏం చేసింది..?
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Embed widget