Janaki Kalaganaledhu August 10th:  మా అమ్మాయి గురించి మీరు ఏమైనా అడగాలి అంటే అడగండి అని జ్ఞానంబ అనటంతో వెంటనే కిషోర్ తండ్రి ఆల్రెడీ అంతా తెలిసిందే కదా అనటంతో.. అంత తెలియటం ఏంటి అని జ్ఞానంబ అనుమానం పడుతుంది. ఈ పెళ్లి చూపులకు తీసుకొచ్చిన వ్యక్తి చెప్పాడు అని అంటాడు. ఆ తర్వాత జ్ఞానంబ జానకిని పిలవడంతో జానకి వెన్నెలను తీసుకొని వస్తుంది.


వెన్నెల సంతోషంగా వచ్చి కూర్చుంటుంది. ఇక ఒకరికొకరు చూసుకుంటూ తెగ సిగ్గు పడుతూ ఉంటారు. అమ్మాయి మాకు నచ్చేసింది అని.. చూడగానే ఇంటి కోడలు అని ఫిక్స్ చేసుకున్నాము అని అంటారు. ఇక జానకి ఏమైనా మాట్లాడాలి అంటే కాసేపు పక్కకు వెళ్లి మాట్లాడండి అని వెన్నెలను, కిషోర్ ను పంపిస్తుంది. అదే సమయంలో అక్కడికి రామ రావటంతో రామ ఇంట్లోకి వచ్చి ఆలస్యమైంది అని అంటాడు.


ఇక పెళ్లి చూపులు పూర్తయ్యాయి.. మాట్లాడుకోవటమే అని వాళ్ళు అంటారు. అదే సమయంలో వెన్నెల, కిషోర్ వచ్చి కూర్చోగా కిషోర్ ని చూసి రామ షాక్ అవుతాడు. ఆరోజు బైక్ పై ఒక వ్యక్తిని గుద్దేసి వెళ్లింది ఇతడే కదా అని అనుకుంటాడు. వెంటనే ఆ విషయాన్ని జానకికి కూడా చెబుతాడు. ఇక జానకి ఈ సమయంలో ఏమి అనకండి.. సంబంధం ఓకే అయ్యింది అని అంటుంది. కానీ రామ ఇటువంటి వాడు అల్లుడవుతే  మనకు మంచిది కాదు అని అంటాడు.


పంతులతో మాట్లాడమని రామతో ఇంట్లో వాళ్ళు అనడంతో.. ఫస్ట్ వీడితో మాట్లాడాలి అనే రామ అంటాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. వెంటనే జ్ఞానాంబ అలా ఎందుకు అంటున్నావు అతడు ఇంటికి కాబోయే అల్లుడు అనడంతో ఇటువంటి వాడు అల్లుడు కాకూడదు అని కోపంగా చెబుతాడు. కిషోర్ ఎందుకలా అంటున్నారు ఏం జరిగింది అనటంతో బైక్ యాక్సిడెంట్ గురించి చెబుతాడు రామ.


ఇక ఈ సంబంధం మాకు వద్దు అని ఇక్కడి నుంచి మీరు వెళ్లిపోండి అనటంతో వాళ్ళు అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతారు. ఇక వెన్నెల బాధపడుతూ లోపలికి వెళుతుంది. ఇక ఎవరికి వాళ్లు వాళ్ళ గదిలోకి వెళ్తారు. ఇక గోవిందరాజులు జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి రామ అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా.. అంత మంచి సంబంధం పోతే మళ్ళీ రాదు ఒకసారి వారికి ఫోన్ చేసి మాట్లాడనా అని అనటంతో.. జ్ఞానంబ ఇక మళ్లీ వాళ్లు ఒప్పుకుంటారా అని ఒకసారి రామ తో మాట్లాడి వారికి ఫోన్ చెయ్యి అని అంటుంది.


మరోవైపు జానకి దగ్గరికి వెన్నెల వెళ్లి బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అన్నయ్య ఏంటి ఇలా చేశాడు అని బాధపడుతుంది. దాంతో జానకి మీ అన్నయ్యని మంచి కోసమే చేశాడు అని అనటంతో.. సరే అన్నయ్య చెప్పిన దానికి అర్థం ఉంది.. ఇక నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని అంటుంది. అప్పుడే కిషోర్ ఫోన్ చేయటంతో తన వదినతో మాట్లాడమని వెన్నెల ఆ ఫోన్ జానకికి ఇస్తుంది. ఇక అతడు ఎలాగైనా ఈ సంబంధం ఒప్పించేటట్లు చేయమని అనడంతో సరే అని జానకి మౌనంగా ఫోన్ కట్ చేస్తుంది.


also read it : Prema Entha Madhuram August 9th: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: అను బాబును కిడ్నాప్ చేసిన రౌడీలు, మదన్ చెంప పగలగొట్టిన అంజలి?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial