Peddi TV Premiere : వరల్డ్ టీవీ ప్రీమియర్ పెద్ది - మెగా పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ మూవీ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Ram Charan Peddi TV : రామ్ చరణ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది టీవీల్లోకి రానుంది. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ జీ5 సొంతం చేసుకోగా వీకెండ్ రోజున టెలికాస్ట్ చేయనుంది.

Ram Charan's Peddi TV Premiere Date Locked : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్ల కలెక్షన్స్ సాధించింది. జులై 9 నుంచి ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతూ ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు టీవీల్లోకి రాబోతోంది.
టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
ఈ మూవీ శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'జీ తెలుగు' (Zee Telugu) సొంతం చేసుకోగా... ఈ నెల 11న (ఆదివారం) సాయంత్రం 5:30 గంటలకు ప్రీమియర్ కానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. థియేటర్స్, ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ అందుకున్న మూవీ టీవీల్లోనూ అంతే రెస్పాన్స్ అందుకుంటుందని భావిస్తున్నారు.
ఈ మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహించగా... రామ్ చరణ్ సరసన అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. అలాగే, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ, సత్య తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా... సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు.
స్టోరీ ఏంటంటే?
విజయనగరం జిల్లాలోని కొండ కింది ఊరిలో దాదాపు వందల మంది జీవనం సాగిస్తున్నా... వారెవరికీ ప్రభుత్వం తరఫు నుంచి గుర్తింపు ఉండదు. ఎలాంటి పథకాలు, పెన్షన్స్ అందవు. కనీసం రహదారి సౌకర్యం కూడా ఉండదు. అందుకే ఆ ఊరన్నా అక్కడి నుంచి వచ్చిన మనుషులన్నా అందరికీ చిన్న చూపు ఉంటుంది. చివరికి వారు చేసిన పనికి ఇచ్చే కూలీలోనూ వివక్ష చూపుతుంటారు. ఆ ఊళ్లో పుట్టి పెరిగిన వాడే పెద్ది (రామ్ చరణ్). రోజూ విజయనగరం వెళ్లి కూలీ పనులు చేసుకుంటుంటాడు. దీంతో పాటే క్రికెట్‌లో రాటు దేలిన ఆటగాడు.
అందుకే ఆట కూలీగా పెద్దిన వేలంలో పోటీ పడి పాడుకుంటుంటాయి విజయనగరం, బొబ్బిలి జట్లు. అలాంటి పెద్ది తన ఊరిలో ఓ మరణంతో ఆటను డబ్బు కోసం కాకుండా గుర్తింపు కోసం ఆడాలని నిర్ణయించుకుంటాడు. క్రికెట్ వదిలి కుస్తీ బాట పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కుస్తీలో జాతీయ స్థాయికి వెళ్లినా ఎందుకు అనుకున్న గుర్తింపు రాదు? తమ ఊరి గుర్తింపు కోసం పెద్ది ఎంచుకున్న క్రీడ ఏంటి? ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేదే ఈ మూవీ స్టోరీ.
ట్రెండింగ్ వార్తలు























