Madhuranagarilo June 30th: సంయుక్త రాధ ఇంటికి వచ్చి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమని చెబుతుంది. అంతేకాకుండా శ్యామ్ నిన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయం నాకు తెలుసు.. ఈ విషయం గురించి శ్యామ్ నీకు చెప్పినా చెప్పకపోయినా ఈపాటికి ఈ విషయం గురించి తెలుసుకోవచ్చు.. అందుకే నువ్వు ఇకనుంచి వెళ్ళిపోవాలి.. లేదంటే శ్యామ్ తో నా పెళ్లి జరగదు అంటూ వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడుతుంది.


అంతేకాకుండా పండుని సొంత కొడుకు కాదన్న విషయం కూడా తెలుసు అని.. హాస్పిటల్లో నువ్వు మాట్లాడిన మాటలన్నీ విన్నాను అని రాధ షాక్ అవుతుంది. ఇక నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్తేనే మంచిదని లేకుంటే పండుకు నువ్వు కన్న తల్లివి కాదని నిజం చెప్పేస్తాను అని బెదిరిస్తుంది. ఇక వెంటనే రాధ అవి ఏవి చెప్పొద్దు అని వెళ్ళిపోతాను అని అంటుంది.


ఉదయాన్నే రాధ జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తను ఇక్కడ ఉంటే సంయుక్త శ్యామ్ తో పెళ్లి జరగదని భయపడుతుందని అనుకుంటుంది. ఇక ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి అంటే ఎవరో ఒకరు చూసి మధుర మేడం వాళ్ళకి చెబుతారు అని కాబట్టి పెళ్లి అయిపోయాక తిరిగి వస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని కేవలం బట్టలు మాత్రమే సర్దుకుంటుంది.


అప్పుడే పండు వచ్చి బట్టలు సర్దుతున్నావా ఏంటి అని అడగటంతో.. ఊరు వెళ్తున్నాము అని అంటుంది. అదేంటి మనం శ్యామ్ అంకుల్ పెళ్ళికి ఉండమా పెళ్లికి మనం లేకుంటే ఎలాగా అంటూ మాట్లాడుతూ ఉంటాడు. కానీ రాధ మాత్రం ఇప్పుడు వెళ్లాల్సిందే తాతయ్య ఫోన్ చేసి రమ్మన్నాడు అని మళ్లీ పెళ్లి అయిపోయాక వచ్చేద్దాము అని అంటుంది. కానీ పండు మాత్రం మొండి చేస్తూ ఉంటాడు.


ఈ విషయం ఇప్పుడే నానికి చెబుతాను అనటంతో రాధ పండు పై అరుస్తుంది. మళ్లీ సారీ చెప్పి తను చెప్పింది వినమని అంటుంది. మరోవైపు అపర్ణ వాళ్లు మధుర ఇంటికి వచ్చి పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే శ్యామ్ ని కూడా పిలవడంతో తనకు బయట పని ఉందని వెళ్తుండగా.. అక్కడ రాధ డోర్ కు తాళం వేసింది చూసి రాధ ఎక్కడికో బయలుదేరుతున్నారు అని అనటంతో వెంటనే మధురవాళ్ళు బయటికి వచ్చి చూస్తారు.


రాధ అక్కడ్నుంచి వెళ్తుండగా మధురవాళ్ళు వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. అయినా ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు పెళ్లి అయ్యాక వెళ్ళు అని.. పెళ్లికి నువ్వు లేకుంటే ఎలా అని మాట్లాడుతూ ఉంటారు. కానీ రాధ వెళ్లాల్సిందే.. పండు వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు అని పెళ్లి సమయానికి తిరిగి వస్తాము అని అనటంతో వెంటనే పండు ఇదంతా అబద్ధం.. తనతో తాత ఫోన్ చేశాడని.. పెళ్లి అయ్యాక వస్తామని అన్నది కానీ ఇప్పుడేమో ఇలా చెబుతుంది అనటంతో.. వెంటనే శ్యామ్, మధుర గట్టిగా అడుగుతారు.


ఇక్కడి నుంచి నిన్ను ఎవరైనా వెళ్ళిపోమని బెదిరించారా వాళ్ళు ఎవరో చెప్పు వాళ్లకు సరైన బుద్ధి చెబుతా అనటంతో సంయుక్త వాళ్ళు భయపడుతూ ఉంటారు. దాంతో రాధ నిజం చెప్పకుండా రౌడీలు వచ్చి రచ్చ రచ్చ చేయడం వల్ల పదేపదే అదే గుర్తుకొస్తుందని అందుకే భయమేస్తుంది అని చెబుతుంది. దాంతో మధుర వాళ్ళు అయితే మా ఇంట్లోనే ఉండు అని అంటారు. కానీ రాధ మాత్రం ఉండనని చెప్పిన కూడా వాళ్ళు బలవంతం చేసి ఉంచుతారు.


ఆ తర్వాత రాధ ఇంట్లోకి వెళ్లి బట్టలు అన్ని తీస్తుండగా సంయుక్త వచ్చి ఎవరికి తెలియకున్న వెళ్లాలని చెబితే ఇలా చేశావ్ ఏంటి అంటే కోపంగా అడుగుతుంది. దాంతో రాధ మధుర మేడం వాళ్ళు చూశారు.. అయినా నేను వెళ్లడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ పండు అలా చెప్పటం వల్ల ఏం చేయలేకపోయాను అని అంటుంది. దాంతో ఇదంతా పండువల్లే జరిగిందా లేకుంటే నువ్వే కావాలని పండుతో చెప్పించావా అంటుంది.


వెంటనే రాధ నాకటువంటి 420 ఐడియాస్ రావు అంటుంది. ఇక సంయుక్త ఆ సమయంలో పండు అలా చెప్పినందుకు వచ్చి గట్టిగా కొట్టాలనిపించింది అని.. అయిన పెద్దవాళ్లు మాట్లాడే దగ్గర ఎలా మాట్లాడాలో తెలియదా అంటూ పండు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఇక తరువాయి భాగంలో కూడా సంయుక్త పండు గురించి నానా రకాలుగా మాట్లాడుతుంటే మరోసారి పండు గురించి మాట్లాడితే నాలుక కోస్తా అంటూ బెదిరిస్తుంది. ఇక నువ్వు నన్ను బెదిరిస్తున్న విషయం, బ్లాక్మెయిల్ చేస్తున్న విషయం శ్యామ్ సార్ కి చెప్పేస్తాను అనటంతో సంయుక్త భయపడుతుంది.


Also Read: Naga Panchami June 29th: ‘నాగపంచమి’ సీరియల్: పంచమికి వార్నింగ్ ఇచ్చిన నాగమణి, ఇంట్లో వాళ్లకు షాకిచ్చిన మోక్ష?