Madhuranagarilo July 7th: శ్యామ్ కారం కలిపిన అన్నం తింటూ ఇబ్బంది పడుతుండటంతో వెంటనే మరో కూర తీసుకొచ్చి బయటకు వెళ్తుంది. మరోవైపు గన్నవరం తన భార్యకు తన ఫ్రెండ్స్ ను హోటల్ లో ఇరికించిన విషయం చెప్పి ఇక వాళ్ళు మన జోలికి రారని అంటాడు. వీడియో చూపించి బాగా బ్లాక్ మెయిల్ చేశారు కాబట్టి వారికి తిరిగి మంచి కౌంటర్ ఇచ్చాను అనటంతో.. తను మాత్రం తమ వీడియో జనాల్లోకి వెళ్లలేదు అని బాధపడుతుంది.


మరోవైపు రాధ పెళ్లి సంబంధాల గురించి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక శ్యామ్ తనని ఎలాగైనా ప్రపోజ్ చేయాలి అని రాధకు ఫోన్ చేస్తాడు. తనను ప్రపోజ్ చేయడానికే ఫోన్ చేస్తున్నాడని రాధ అనుకుంటుంది. ఒకవేళ ప్రపోజ్ చేసే టైంలో ఫోన్ కట్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటుంది. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి ఫస్ట్ కాసేపు మాట్లాడక శ్యామ్ తన మనసులో ఉన్న మాట చెబుతున్న సమయంలో వెంటనే సిగ్నల్స్ లేవు అని డ్రామా అని ఫోన్ కట్ చేస్తుంది.


దాంతో శ్యామ్ రాధకు తను ప్రపోజ్ చేస్తున్నానన్న విషయం పై అనుమానం వచ్చింది అని డౌట్ క్లియర్ చేయడానికి ఒక ప్లాన్ చేస్తాడు. రాధాకు వినబడేలాగా బామ్మ అంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇక తన వీపు మీద పుట్టుమచ్చ ఉందని చెప్పావు కదా తన కాబోయే భార్యకు కూడా ఉంటుందని అన్నావు కదా.. నువ్వు అన్నట్లే నేను ప్రేమించిన అమ్మాయికి వీపు మీద నల్లపూస అంత పుట్టుమచ్చ ఉంది అని అంటాడు.


దాంతో ఆ మాటలు వింటున్న రాధ తన వీపుపై పుట్టుమచ్చ ఉందా అని అనుమానం పడుతుంది. ఇప్పుడే వెళ్లి చూసుకోవాలి అని లోపలికి వెళుతుంది. వెంటనే శ్యామ్ ఇప్పుడు రాధ పుట్టుమచ్చ చూసుకుంటే తనకు నేను ప్రేమిస్తున్న విషయం తెలిసినట్లే అని రాధ ఇంటి దగ్గరికి వెళ్తాడు. కానీ ఎప్పటికీ రాధ తన వీపు మీద పుట్టుమచ్చ లేదని చూసుకుంటుంది. ఇక శ్యామ్ వచ్చి కిటికీలోనుంచి చూడటంతో రాధ తన పని తను చేసుకుంటుంది.


అంటే రాధకు ఏమీ అనుమానం రాలేదేమో అని అనుకుంటాడు శ్యామ్. ఇక శ్యామ్ అక్కడి నుండి వెళ్తుండగా రాధ శ్యామ్ ని చూసి.. అంటే నాకు పుట్టుమచ్చ ఉందా లేదా అని నేను చూస్తానా చూడనా అని వచ్చాడేమో అని అనుకోని మామూలోడు కాదు అని అనుకుంటుంది. మరోవైపు నెల్సన్ తన దగ్గరికి రావటం లేదు అని తనకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు.


కానీ శిరోజా కూడా తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి బాయ్ఫ్రెండ్ ఉన్నట్లు మాట్లాడుతూ ఉంటుంది. దాంతో నెల్సన్ షాక్ అయ్యే తిరిగి మళ్లీ ఆ ఫోన్ కి చేయటంతో అదంతా అబద్ధం అని తెలుసుకుంటాడు. ఇక పండు రాధ దగ్గరికి వచ్చి తనకు బోర్ కొడుతుందని బయటికి తీసుకెళ్ళమని అంటాడు. దానికి రాధ ఒప్పుకోగా అయితే బైక్ మీద వెళ్దామని పండు అంటాడు.


అప్పుడే శ్యామ్ బైక్ తీసుకొని వచ్చి ముగ్గురం కలిసి వెళ్దాం అని అంటాడు. తరువాయి భాగంలో పార్కులో రాధకు తన మనసులో ఉన్న మాట చెప్పటానికి మరోచోటకు చెయ్యి పట్టుకొని రమ్మని బలవంతం చేయటంతో అప్పుడే పోలీసులు వచ్చి శ్యామ్ కు షాక్ ఇస్తారు.


Also Read: Trinayani July 7th: ‘త్రినయని’ సీరియల్: మరింత వయసు తగ్గించుకున్న తిలోత్తమా, సంతకంతో షాక్ ఇచ్చిన గాయత్రి పాప?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial