Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో నేను ఈ దొంగతనం చేయలేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది నాకు దొంగతనం చేయవలసిన అవసరం లేదు అంటుంది అను.


పూజారి : అంతలో పూజారి అక్కడికి వచ్చి ఆమె అలాంటిది కాదు ఏదో పెద్ద కష్టం వచ్చి ఇలా దీక్ష చేస్తుంది అని చెప్తాడు.


పోలీసులు: అంతలా వెనకేసుకొస్తున్నావ్ ఈ దొంగతనంలో నీ వాటా ఎంత పద పోలీస్ స్టేషన్ కి అనటంతో వెనక్కి జంకుతాడు పూజారి.


పోలీసులు పద పోలీస్ స్టేషన్ కి అనటంతో నేను పోలీస్ స్టేషన్ కి వస్తాను కానీ ఈ ఒక్కరోజు వదిలేయండి నా దీక్ష పూర్తయిపోతుంది అని బ్రతిమిలాడుకుంటుంది అను.


అయినా వినకుండా పోలీసులు ఆమెని బలవంతంగా వాన్ ఎక్కించబోతే ఒక వ్యక్తి బట్టల నుంచి కత్తి జారీ కింద పడిపోతుంది. అది గమనిస్తుంది అను.


అను: వాళ్లని అనుమానిస్తుంది కత్తి చేతిలోకి తీసుకొని ఎవరు మీరు నిజం చెప్పండి. నా దీక్ష భగ్నం చేయటానికి వచ్చారా దగ్గరకు వస్తే పొడి చేస్తాను అని బెదిరిస్తుంది.


అయినా ఆమెని బలవంతంగా వ్యాన్ ఎక్కించబోతుంటే అక్కడ ఉన్న బిచ్చగాళ్ళందరూ సపోర్ట్ గా వస్తారు. పోలీసులతో గొడవకి దిగుతారు. ఒక బిచ్చగత్తే వాళ్ళందరి మొత్తం బిచ్చాన్ని అను జోలిలో వేసి నువ్వు వెళ్లి నీ దీక్ష పూర్తి చెయ్యమ్మా వీళ్ళ సంగతి మేము చూస్తాము అని చెప్పి పంపించేస్తుంది.


అది చూస్తున్న మాన్సీ, ఛాయాదేవి మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే బెటర్ లేదంటే వాళ్లు మనల్ని కూడా కొట్టేలాగా ఉన్నారు అని చెప్పి మెల్లగా అక్కడి నుంచి జారుకుంటారు.


మరోవైపు సుగుణ ఆర్య కి ఫోన్ చేస్తుంది.


సుగుణ: ఆర్యతో మాట్లాడుతూ ఈరోజు రాధని దివ్య ని పెళ్లికూతుళ్ళని చేస్తాము ఆ తర్వాత నిన్ను పెళ్ళికొడుకుని చేస్తాము త్వరగా పని మిగించుకొని రా అని చెప్తుంది.


నీరజ్: ఫైనల్ స్కెచ్ రెడీ అయిన వెంటనే నేను మీకు ఫోన్ చేస్తాను అంటాడు.


సరే అని ఆర్య అక్కడ నుంచి బయలుదేరబోతుంటే జెండే నేను కూడా వస్తాను అనటంతో ఇద్దరూ కలిసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు.


మరోవైపు పూజా కార్యక్రమానికి అన్ని రెడీ చేస్తూ ఉంటారు ముత్తైదువులు. సుగుణ మాత్రం గుమ్మం వైపు ఎదురు చూస్తూ ఉంటుంది.


జ్యోతి: ఏంటమ్మా అంతలా ఎదురు చూస్తున్నావు అంటుంది.


దివ్య: ఇంకెవరి కోసం ఆ రాధ గారి కోసం అయి ఉంటుంది అంటుంది.


సుగుణ: ఒక పది నిమిషాలు ఆగి చూద్దాం ఇంతలో రాధ వచ్చేస్తుంది అంటుంది.


అందుకు దివ్య కోప్పడుతుంది.


సుగుణ: ఎవరి కోసము ఎవరు వెయిట్ చేయక్కర్లేదు అని కోపంగా జ్యోతితో నువ్వు దివ్యకి చీర కట్టి రెడీ చెయ్యు ఇంతలో నేను రాధని తీసుకొని వస్తాను అని బయలుదేరుతుంది.


మరోవైపు కెనడీ ఫైనల్ స్కెచ్ రెడీ చేస్తూ ఫోన్ మాట్లాడటం కోసం బయటికి వెళ్తాడు. అప్పుడు మాన్సీ తాలూకా మనిషి వచ్చి అక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ మిమ్మల్ని కెనడి రమ్మంటున్నాడు అని చెప్పడంతో బయటికి వెళ్తారు అప్పుడు ఫైనల్ స్కెచ్ మార్చేసి వేరే స్కెచ్ ఆర్య కి పంపిస్తాడు.


అది చూసిన ఆర్య ఇతను రాధ గారి భర్త అవునా కాదా అని ఆవిడ దగ్గర క్లారిటీ తీసుకుందాము అని జెండే తో చెప్పి ఆవిడ ఎక్కడ ఉంటారో నాకు తెలుసు అని చెప్పి శివాలయం దగ్గరికి వస్తారు.


అప్పుడే దీక్ష పూర్తి చేసిన అను దగ్గరికి దీక్ష ఇచ్చిన స్వామి వస్తారు.


అను : నా దీక్ష పూర్తయింది, పెళ్లి ఆగిపోయి నా కోరిక తీరుతుంది కదా అని అడుగుతుంది.


స్వామి: దీక్ష చేయడం నీ వంతు ఫలితం ఇవ్వడం స్వామి వంతు. పెళ్లి ఆగిపోవడం మంచిది అని నువ్వు ఎలా అనుకుంటావు. పెళ్లి జరిగితేనే మంచిదేమో ఎవరికి తెలుసు. ఫలితాన్ని ఆశించకు ఆ భగవంతుడే చూసుకుంటాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.


అంతలోనే సుగుణ వచ్చి నీ దీక్ష పూర్తయిందా వెళ్దామా అని అడుగుతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఆర్య అక్కడికి వస్తాడు. ఇతను మీ భర్తేనా అంటూ ముసుగు వేసుకొని ఉన్న అనుకి చూపిస్తాడు. ఫోటో చూసిన అను షాక్ అవుతుంది.


 


అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.