Prema Entha Madhuram Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో జెండే ఫోన్ చేసి డిఎన్ఎ టెస్ట్ వల్ల పెద్దగా ఫలితాలు కనిపించడం లేదని డాక్టర్ గారు చెప్తున్నారు అంటాడు.


ఆర్య : మనకి ఉన్న ఆఖరి చాన్స్ కెనడీ గీసే పిక్చరే, త్వరగా గీయమని చెప్పు. ఒకసారి పెళ్లి పీటల మీదకి వెళ్ళిపోతే పెళ్లి ఆపే ఛాన్స్ ఉండదు అంటాడు.


సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు జెండే.


తర్వాత బట్టలు మార్చుకోవడానికి బాక్స్ తీస్తుంటే దానిమీద ఉన్న రక్తం మరకలు గమనిస్తాడు ఆర్య. అయితే పెద్దగా దాని గురించి పట్టించుకోడు.


మరోవైపు హరీష్ భయంతో ఆ రూమ్ ఖాళీ చేసి వేరే రూమ్ కి షిఫ్ట్ అయిపోతాడు.


బట్టలు మార్చుకున్న ఆర్య అను కి ఫోన్ చేస్తాడు.


ఆర్య : పెళ్లి దగ్గర పడుతున్న కొద్ది మీలో టెన్షన్ పెరిగిపోతుందని నాకు తెలుసు, కానీ పెళ్లి ఆపలేకపోతున్నాను. ఇక అంతా మీ చేతిలోనే ఉంది ఇప్పటికైనా మీ భర్త ఎవరో చెప్పండి తీసుకుని వస్తాను. లేదంటే ఈ పెళ్లి జరిగినట్లయితే నేను జీవితాంతం నా భార్యకి మోసం చేశానని బాధతో ఉండాలి మీరు కూడా సంతోషంగా ఉండలేరు అని చెప్తాడు.


అను మాట్లాడాలనుకుంటుంది కానీ ఇంతలో జ్యోతి రావడంతో కంగారులో ఫోన్ పెట్టేస్తుంది. జ్యోతి అనుని పెళ్లి పీటల మీదకి తీసుకు వెళుతుంది.


మరోవైపు యాదగిరి ఆర్య దగ్గరికి వచ్చి టైం అవుతుంది పెళ్లి పీటలు బయటకు తీసుకు రమ్మంటున్నారు అని చెప్తాడు.


ఆర్య: నేను రాలేను పెళ్లి పీటల మీద కూర్చుంటే పరిస్థితి చేయి దాటిపోతుంది కాసేపు ఇక్కడే వెయిట్ చేద్దాం. ఈ లోపు జెండే ఫోన్ చేస్తాడు అంటాడు.


యాదగిరి: మీరేమీ పరేషాన్ అవ్వకండి ఈ పెళ్లి వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది. ఆ వెయిట్ చేసేదేదో పెళ్లి పీటల మీద వెయిట్ చేద్దాం అని చెప్పి మండపానికి తీసుకువెళ్తాడు.


హరీష్, ఆర్య ఇద్దరు పెళ్లి పీటల మీద కూర్చుంటే సుగుణ ఆశీర్వదిస్తుంది. అప్పుడు ఒకసారి గా ఉష ఫ్రెస్టేట్ అవుతుంది.


ఉష: అతనిని ఆశీర్వదించకు, అతనికి నీ ఆశీర్వచనాలు అందుకునే హక్కు లేదు అతను నీ కొడుకు సూర్య కాదు అంటుంది.


అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ కేకలు వస్తుంది సుగుణ.


యాదగిరి: నీ మైండ్ ఎవరో ఖరాబ్ చేసినట్లున్నారు.. ఆయన మీ అన్నయ్య కాకపోవడం ఏమిటి అంటాడు.


ఉష : నాకు ఎవరో చెప్పలేదు ఆయన మినిస్టర్ గారితో మాట్లాడటం నేను విన్నాను ఆయన గ్రేట్ బిజినెస్మేన్ ఆర్య వర్ధన్ గారు అంటుంది.


సుగుణ: వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటావేమి నేను సూర్య నని చెప్పు అంటుంది.


ఆర్య: నేను సూర్యుని కాదు ఆర్య వర్ధన్ ని అని చెప్పడంతో అందరూ కంగారు పడతారు.


దివ్య: ముందు నుంచి నాకు అనుమానంగానే ఉంది అయినా మా అన్నయ్య ప్లేస్ లోకి నువ్వు ఎందుకు వచ్చావు మా అన్నయ్య ఏడి అని అడుగుతుంది.


హరీష్: ఇంకేముంది ఆ ల్యాండ్ మీద పడి ఉంటుంది ఆ ల్యాండ్ కోసమే మీ అన్నయ్యని కిడ్నాప్ చేసో, చంపో ఆ ప్లేస్ లో ఇక్కడికి వచ్చి ఉంటాడు అని వెటకారంగా అంటాడు.


సుగుణ కూడా భార్యని నిజం చెప్పమని నిలదీస్తుంది. అంతలోనే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోతుంది.


అప్పుడే షాక్ నుంచి బయటికి వచ్చిన ఉష నేను అమ్మకి నిజం చెప్తే ఇలాగే జరుగుతుంది ఇప్పుడు ఎవరికి నిజం చెప్పాలి అని ఏడుస్తూ ఉంటుంది.


అప్పుడే అటువైపుగా హరీష్, ఆర్య,యాదగిరి వెళ్తూ ఉంటారు. హరిష్ ను పంపించి ఆర్య, యాదగిరి ఉష తో మాట్లాడతారు.


ఆర్య : ఎందుకు ఏడుస్తున్నావు, నేను మినిస్టర్ గారితో మాట్లాడటం నువ్వు విన్నావా అని అడుగుతాడు.


ఉష : అవును విన్నాను, మీరు అంత పెద్ద బిజినెస్ మాగ్నెట్ అయి ఉండి మా ఇంట్లో ఉండి మా బాధ్యతలు ఎందుకు తీసుకుంటున్నారు అని నిలదీస్తుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.