Prema Entha Madhuram  Serial Today Episode: పోలీసులు లోకేషన్‌ ట్రేస్‌ చేయగానే అందరూ అక్కడికి వెళ్తుంటారు. మరోవైపు శ్రీను వ్యాన్‌ స్టార్ట్ చేసుకుని రౌడీలు, అమ్మాయిలతో సహా అక్కడికి నుంచి వెళ్లిపోతారు. ఇంతలో అక్కడికి శంకర్‌, పోలీసులు వస్తారు. డెన్‌లో అంతా  గమనిస్తారు. ఎస్సై వాళ్లు ఇక్కడే ఉన్నారంటావా? శంకర్‌ అని అడుగుతుంది. ఇక్కడే ఉన్నారు మనం వచ్చే లోపు వెళ్లిపోయారు. అని బయటకు వచ్చి సర్చ్‌ చేస్తుంటారు. శంకర్‌ కు శ్రీను డ్రైవింగ్‌ లైసెన్స్‌ దొరుకుతుంది. దీంతో శంకర్‌, శ్రీనుకు ఫోన్‌ చేస్తాడు. రౌడీలు ఫోన్‌ లిఫ్ట్‌ చేసి మాట్లాడు అని లౌడ్‌ స్పీకర్‌ పెడతారు.


శ్రీను: హలో అన్న చెప్పన్నా..


శంకర్‌: అరే శ్రీను వైజాగ్‌ వెళ్తానన్నావు కదా బండి బయల్దేరిందా?


శ్రీను: ఇంతకు ముందే బయలుదేరింది అన్నా..


శంకర్‌: అవును డీజీల్‌ ఫుల్‌ ట్యాంక్‌ కొట్టించావా?


శ్రీను: ఆ కొట్టించాను అన్న..


శంకర్‌: వైజాగ్‌‌ లో మా చుట్టాలున్నారు కదా? అబ్బా ఏంట్రా ఆ డిస్టబెంన్స్‌ స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడుతున్నావా? ఆఫ్‌ చేసి మాట్లాడు డిస్టబెన్స్‌ వస్తుంది.


శ్రీను: అలాగే అన్నా.. ఇప్పుడు చెప్పు అన్న..


శంకర్‌: స్పీకర్‌ ఆఫ్‌ చేశావా?


శ్రీను: చేశాను అన్న.. బాగానే వినిపిస్తుంది చెప్పు


శంకర్‌: అరే శ్రీను నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు వైజాగ్‌ తీసుకెళ్లేది కిడ్నాప్‌ అయిన అమ్మాయిలను. రేయ్‌ వాళ్లకు డౌట్‌ వచ్చేటట్టుగా ఎక్స్‌ ప్రెషన్స్‌ పెట్టకు.


శ్రీను: అవునా అన్నా ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పావు అన్నా..


శంకర్‌: నీతో ఎంత మంది ఉన్నారు.


శ్రీను: మా చుట్టాలు అక్కడ ఓ ఇద్దరు ఉన్నారు అన్న.


శంకర్‌: సరే సరే వాళ్లకు డౌట్‌ రాకుండా వెహికిల్‌ ఏ రూట్‌ లో వెళ్తుందో చెప్పు.


శ్రీను: ఓ మీ బంధువుల దగ్గర నుంచి పార్శిల్‌ తీసుకోవాలి అంతే కదా అన్న. ఈ రోడ్డంతా గతుకులే ఉన్నాయి అన్న. షార్ట్‌ కట్‌ అని  అగ్రికల్చర్‌ రోడ్డు మీదుగా హైవే పైకి వెళ్తున్నాము అన్న.


శంకర్‌: సరేరా నువ్వు స్లోగా డ్రైవింగ్‌ చేస్తూ మేనేజ్‌ చేయ్‌ నేను పది నిమిషాల్లో హైవే దగ్గరకు వెస్తాను.


 అని చెప్పగానే శ్రీను ఓకే అంటాడు.  శంకర్‌ కూడా పోలీసులను పదండి అని అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత శంకర్‌ వ్యాన్‌ కు ఎదురుగా వెళ్లి రౌడీలను కొట్టి అమ్మాయిలను సేవ్‌ చేస్తాడు. రాకేష్‌ తనను తాను కాపాడుకోవాలని అక్కడి నుంచి ఎస్కేప్‌ అవుతాడు. ఎస్సై, శంకర్‌‌ కు థాంక్స్‌ చెప్పి అమ్మాయిలను తీసుకుని వెళ్లిపోతుంది. మరోవైపు ఇంటి దగ్గర టెన్షన్‌ పడుతున్న గౌరికి బయటి నుంచి అక్కా అని సంధ్య పిలవడంతో ఎమోషనల్‌ అవుతుంది. ఇంతలో సంధ్య వచ్చి గౌరి, శ్రావణిలను హగ్‌ చేసుకుంటుంది.  


గౌరి: దేవుడి దయవల్ల నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చావు నాకు అదే చాలు.


సంధ్య: దేవుడి దయవల్ల కాదు అక్క. శంకర్‌ గారి వల్లే ఇప్పుడు నేను నీ ముందు ప్రాణాలతో నిలబడ్డాను. ఆయనే కనక సమయానికి వచ్చి కాపాడకపోతే నేను మీకు దక్కేదాన్నే కాదు.


శ్రావణి: థాంక్యూ శంకర్‌ గారు.


శంకర్‌: అయ్యోయ్యో మనలో మనకి ఈ ఫార్మాలిటీస్‌ ఏంటమ్మా.. ఎన్ని మిస్‌ అండస్టాడింగ్స్‌ వచ్చినా ప్రాబ్లమ్స్‌ వచ్చిన్నప్పుడు ఒకరికి ఒకరు సపోర్టుగా ఉండాలి.


గౌరి: మీరు దేవుడితో సమానం శంకర్‌ గారు.  


శంకర్‌: అయ్య బాబాయ్‌ కొంపదీసి గుడి కట్టి హారతి ఇస్తార ఏంటి?


యాదగిరి: ఇచ్చినా తప్పు లేదు సార్‌.


శంకర్‌: నువ్వు ఊరుకో బాబాయ్‌ మధ్యలో..


  అనగానే అకి కూడా మీరు నిజంగా దేవుడి లాంటి వారే అంటుంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది నాన్నా.. అనగానే అందరూ షాక్‌ అవుతారు. దీంతో ఐ మీన్‌ మా నాన్నను చూసినట్టే ఉందని చెప్తుంది అకి. ఆయన కూడా మీలాగే అని చెప్తుంది. ఇంతలో మీరేంటి సార్‌ అలా చూస్తున్నారు మీరొక్కరే బాలన్స్‌ ఉన్నారు అని జెండేను అనగానే. నా స్నేహితుడి గొప్పతనం గురించి నేను ప్రత్యేకంగా చెప్పడం ఏందుకు అంటాడు జెండే దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో జెండే నేను శంకర్‌ ఫ్రెండ్ ను అవ్వకూడదా? అనడంతో అందరూ రిలాక్స్‌ అవుతారు. తర్వాత తమ ఇంట్లో జ్యోతి చేయబోయే వరలక్ష్మీ వ్రతానికి అందరూ రావాలని చెప్పి యాదగిరి వెళ్లిపోతాడు. తర్వాత అకి, జెండే కూడా వెళ్లిపోతారు. మరోవైపు అభయ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి దొరికిందా? లేదా అని అటు ఇటూ తిరుగుతుంటాడు. ఇంతలో అకి, జెండే వస్తారు. తమకు నిద్రొస్తుందని వెళ్లిపోతుంటే.. ఆ అమ్మాయి గురించి ఏం చెప్పకుండా వెళ్తున్నారేంటి అని మనసులో అనుకుని అంతా ఓకే కదా అని అడుగుతాడు. అభయ్‌ దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: బ్రహ్మముడి’ సీరియల్‌: గోల్డ్ స్మగ్లింగ్ లో రాజ్ అరెస్ట్ – హార్ట్ స్ట్రోక్ తో కుప్పకూలిన అపర్ణ