Prema Entha Madhuram  Serial Today Episode:  హోమం చేయించడానికి అభయ్‌, అకి, జెండే గుడికి దగ్గరకు వస్తారు. అభయ్‌.. జెండేను పిలిచి అక్కడేదో పెళ్లి జరుగుతున్నట్టు ఉందని అడుగుతాడు. అవునని జెండే చెప్తుండగానే శ్రీను పరుగెత్తుకొచ్చి జెండేను పలకరించి తనను తాను పరిచయం చేసుకుంటాడు. నా పెళ్లి ఇక్కడే జరుగుతుందని శంకర్‌ అన్న వాళ్లు అందరూ వచ్చారు అని చెప్తాడు. శ్రీను మాటలకు రాకేష్‌ షాక్‌ అవుతాడు. ఇప్పుడెలా అని ఆలోచిస్తుంటే అకి వెళ్లి గౌరి, శంకర్‌ లను తీసుకొస్తానని వెళ్లబోతుంటే అభయ్‌ అపుతాడు. హోమానికి టైం అవుతుందని హోమం దగ్గరకు తీసుకెళ్తాడు.

రాకేష్‌:  హోమం అవ్వగానే అభయ్‌ వాళ్లను కలవకుండా ఏదో ఒకరకంగా తీసుకెళ్లిపోవాలి. ( అని మనసులో అనుకుంటాడు.)

మరోవైపు శ్రావణిని ఫాలో అవుతుంటాడు పెద్దొడు.

శ్రావణి: మీరేంటి నా అడుగుల్లో అడుగులేస్తున్నారు.

పెద్దొడు: మీతో ఏడడుగులు వేద్దామని..

శ్రావణి: ఆ ఏంటి..  

పెద్దొడు: అదేనండి ఒక మంచి అమ్మాయితో పెళ్లి కావాలిన కోరుకుంటూ అడుగులేస్తున్నాను. మీ అడుగులో మాత్రం నడవడం లేదండి.

శ్రావణి: అలాగా అయితే మీరు మందు నడవండి నేను వెనకాల వస్తాను.

పెద్దొడు: సరేలేండి… చూశారా..? మీకే తెలియకుండా నాతో ఏడడుగులు వేశారు.

అనగానే శ్రావణి కోపంగా పెద్దొడిని కొట్టబోయి కిందపడబోతుంటే పెద్దొడు పట్టుకుంటాడు. దూరం నుంచి చిన్నొడు.. సంధ్య చూస్తారు. ఇద్దరు దగ్గరకు వెళ్లి వాళ్లను తిడతారు. మరోవైపు నీలకంఠం గుడిలో గౌరి, శంకర్‌ ల కోసం వెతుకుతుంటాడు. శ్రావణి, సంధ్యల దగ్గరకు వెళ్లి గౌరి, శంకర్‌ లను చూపించమని అడుగుతాడు. వాళ్లను చూపించమని అడుగుతాడు. సరేనని వెళ్తారు.

నీలకంఠం: ఎక్కడయ్యా మీ అన్నయ్యా..?

పెద్దొడు: ఇక్కడే ఎక్కడో ఉండాలండి..

చిన్నొడు: అయినా మా అన్నయ్య గురించి మీకెందుకండి.

కోఠి: మా అయ్యగారికి ఉబలాటం ఎక్కువండి. ఊరికి ఎవరొచ్చినా వారిని పరిచయం  చేసుకుని వారి ప్రాణాలు తీయడం అలవాటు.

సంధ్య: అంటే ఈయన హంతకుడా..?

   అని అడగ్గానే ఏదో మాట సామెతకు అన్నాను అంటాడు. తర్వాత అందరం తలొ దిక్కు వెతుకుదాం పదండి అని వెళ్లిపోతారు. మరోవైపు  అభయ్‌ వాళ్లు హోమం చేస్తున్న దగ్గరకు వెళ్లిన గౌరి, శంకర్‌ లను రాకేష్‌ చూస్తాడు. షాక్‌ అవుతాడు. మరోవైపు గౌరి, శంకర్‌ ల కోసం వెతుకుతున్న నీలకంఠం దగ్గరకు గౌరి వెళ్లి దారికి పక్కకు తప్పుకోమని అడిగి వెళ్లిపోతుంది. నీలకంఠం గట్టిగా అరుస్తాడు.  మరోవైపు హోమం అయిపోతుంది.

అకి: హోమం అయిపోయినట్టేనా పూజారి గారు.

పూజారి: అయిపోయినట్టేనండి. చూడు బాబు హోమం పూర్తి అయిపోయింది కాబట్టి మీరు వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోండి.

అకి: నేను గౌరి వాళ్ల దగ్గరకు వెళ్తాను.

అభయ్‌: ఎందుకంత కంగారు వాళ్లను కలవాలి అంతే కదా? సరే వెళ్లు.. వాళ్లను కలిసి పెళ్లి దగ్గర ఉండండి. నేను దర్శనం చేసుకుని వస్తాను.

అని చెప్పగానే అకి వెళ్లిపోతుంది. అభయ్‌, రాకేష్‌ దర్శనం చేసుకోవడానికి వెళ్తారు. జెండే ప్రసాదాలు పంచడానికి వెళ్తాడు. దర్శనం దగ్గర అభయ్‌ పక్కనే వచ్చి నిలబడుతుంది గౌరి. గౌరిని చూసిన రాకేష్‌ భయపడుతుంటాడు. ఇంతలో పక్కనే విబూది అభయ్‌ కళ్లల్లో పడేలా ఫ్యాన్‌ తిప్పుతాడు రాకేష్‌. విడూది పడటంతో రాకేష్‌ కళ్లు మూసుకుని బాధపడుతుంటే.. గౌరి వెళ్లి అభయ్‌ కళ్లు తుడుస్తుంది. వాటర్‌ తీసుకొస్తాను ఉండు అని గౌరి వెళ్లగానే రాకేష్‌, అభయ్‌ ని తీసుకుని వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట