Prema Entha Madhuram  Serial Today Episode:    అకి కారులో యాదగిరిని ఇంటి దగ్గర డ్రాఫ్ చేయడానికి వచ్చిన అకి ఇంట్లోకి వెళ్తుంది. రవికి జాబ్‌ ఇప్పించినందుకు సంతోషంగా ఉందని జ్యోతి చెప్తుంది. తలకు మించిన భారం నెత్తిన పెట్టుకున్నావు అంటూ రవిని యాదగిరి హెచ్చరిస్తాడు. తర్వాత రవి అకికి టీ పెట్టడానికి కిచెన్‌ లోకి వెళితే అకి.. రవినే చూస్తుంటుంది. అది గమనించిన యాదగిరి వ్యవహారం చాలా దూరం వెళ్తుంది వెంటనే జెండే సార్‌కు చెప్పి రవిని, అకికి దూరం పెట్టాలని అనుకుంటాడు. మరోవైపు చిన్నొడు, పెద్దొడిని తన ఇంటికి తీసుకెళ్లిన ఇంటి ఓనరు పాండు వాళ్లిద్దరికీ బలవంతంగా మందు తాగిస్తాడు. పుల్లుగా మందు కొట్టిన తర్వాత చిన్నొడు, పెద్దొడు కోపంగా శంకర్‌ ను తిడతారు.


పాండు: ఇప్పుడు కరెక్టు పాయింట్‌ కు వచ్చారు. ( అని మనసులో అనుకుంటాడు) అసలు మీకో విషయం చెప్పనా..? ఆ గౌరి చెల్లెల్లకు జాబ్స్‌ ఎలా వచ్చాయో తెలుసా..?


చిన్నొడు: క్యాంపస్‌ సెలక్షన్స్‌ లో వచ్చింది.


పాండు: అంత లేదు. ఆ గౌరి జెండేను కాళ్లవేల్లా పడి జాబ్‌ వచ్చేలా చేసింది. కానీ క్యాంపస్‌ సెలెక్షన్‌ అని చెప్పేస్తున్నారు.


పెద్దొడు: నిజమా..?


పాండు: మీకు అబద్దం చెప్పాల్సిన అవసరం నాకేంటి బాబు


 అంటూ వాళ్లిద్దరి మనసులో లేనిపోని విషాలు నింపుతాడు పాండు. మీకు అర్జెంట్‌ గా ఉద్యోగాలు కావాలా..? అని అడుగుతాడు. అవునని ఇద్దరూ చెప్పగానే అయితే చెరో లక్ష రెడీ చేసుకోమని చెప్పగానే సరేనని మా అన్నయ్యను అడిగి చెప్తామని వెళ్లిపోతారు. తర్వాత రాకేష్‌కు ఫోన్‌ చేసి నీ ప్లాన్‌ సక్సెస్‌ వాళ్లకు పుల్లుగా తాగించి ఆ శంకర్‌ గాడి మీదకు పంపించా అని చెప్తాడు. దీంతో రాకేష్‌ హ్యాపీగా ఫీలవుతాడు. తర్వాత సంధ్య, యాదగిరికి ఫోన్‌ చేసి శంకర్‌ వాళ్లకు ఆయన బ్రదర్స్‌కు గొడవ అయిందని వాళ్లు అలిగి ఎక్కడికో వెళ్లిపోయారు అని చెప్తుంది. దీంతో యాదగిరి వాళ్లను వెతికి తీసుకొస్తానని చెప్తాడు.


గౌరి: ఎవరితోనే మాట్లాడుతున్నావు. అది కూడా ఈ టైంలో పక్కకు వచ్చి మాట్లాడుతున్నావు. ఈ మధ్య నువ్వు క్రమశిక్షణ తప్పుతున్నావు.


సంధ్య: అక్కా నేను ఫోన్‌ చేసింది యాదగిరి అంకుల్‌కు


గౌరి: యాదగిరి అంకుల్‌ కా.. ఎందుకు..?


సంధ్య: శంకర్‌ గారికి వారి బ్రదర్స్‌ కు గొడవ జరిగింది. పాపం శంకర్‌ గారు చాలా దిగాలుగా ఉన్నారు. యాదగిరి అంకుల్‌ అయితేనే వాళ్లకు సర్ది చెప్పి తీసుకొస్తారని చెప్పాను.


గౌరి: అలాగా..? శంకర్‌ గారు వాళ్ల కోసం చాలా కష్టపడుతున్నారు. వాళ్లు ఏం మనుషులో ఏమో..? అయినా వాళ్ల సంగతి మనకెందుకు.


సంధ్య: శంకర్‌ గారు కూడా అలాగే అనుకుంటే మనం ఇవాళ ఇలా ఉండేవాళ్లమ్మా..?


గౌరి: సరేలే నేను వెళ్లి శంకర్‌ గారితో మాట్లాడతాను. నువ్వు వెళ్లి పడుకో..


అని చెప్పగానే సంధ్య లోపలికి వెళ్లిపోతుంది. గౌరి, శంకర్‌ దగ్గరకు వెళ్లి మీరెందుకు వాళ్లను తిట్టారు అయినా వాళ్లకు కోపం తగ్గగానే వస్తారులేండి అని చెప్పగానే కోపమా..? నా తమ్ముళ్లకు అలా ఏం ఉండదు అంటూ వాళ్లను వెనకేసుకొస్తాడు. ఇద్దరు తమ్ముళ్ల గురించి చెప్తూ ఎమోషనల్ అవుతాడు. వాళ్లొచ్చాక మళ్లీ గొడవ పెట్టుకోవద్దని చెప్పి గౌరి వెళ్లిపోతుంది. తర్వాత చిన్నొడు, పెద్దొడు తాగి ఇంటికి వస్తారు. ఇంటి ముందు గొడవ చేస్తుంటారు. యాదగిరి వాళ్లను సముదాయిస్తుంటాడు. లోపలి నుంచి గౌరి, శ్రావణి, సంధ్య వచ్చి షాక్‌ అవుతారు. గౌరి వాళ్లను తిడుతుంది. చిన్నొడు, పెద్దొడు మైకంలో ముగ్గురు అక్కాచెల్లెల్లను తిడతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  



ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!