Prema Entha Madhuram Serial Today Episode: గౌరి పర్మిషన్ లేకుండా తన చాంబర్ లోకి వచ్చిందని శంకర్ అనగానే గౌరి బయటకు వెళ్లి మే ఐ కమీన్ సార్ అంటుంది. ఎవరూ అంటూ తిరిగి చూసిన శంకర్ ఓ వైస్ చైర్మన్ గారా..? కమీన్ అంటాడు. లోపలికి వచ్చిన గౌరి వెనకాలే శ్రావణి, సంధ్య వస్తారు. వాళ్లను చూసిన శంకర్.. వీళ్లు అంటే.. వాళ్లు నా చెల్లెల్లు వాళ్లు తమ టాలెంట్ తో ఈ కంపనీలో జాబ్ సాధించారు. ఈ ఆఫర్ లెటర్స్ మీద మీ సంతకం కావాలి చెయండి అంటుంది గౌరి. ఆ లెటర్స్ తీసుకున్న శంకర్ ఈ లెటర్స్ కు ఏదో తక్కు వ అయింది అంటాడు.
గౌరి: ఫ్లీజ్ సంతకం పెట్టండి సార్
శంకర్: ఆ ఇప్పుడు బ్యాలెన్స్ అయింది. ఇందాక ఎవరో మీ సంతకానికి అంత విలువ ఉందా..? అన్నారు. ఆ సంతకం కోసమే వచ్చారు. గేమ్ చేంజర్ అంటే ఇది. ఇదిగో నా ఆఫీసులో స్ట్రిక్ట్ గా వర్క్ చేయాలి. టైం వేస్టు చేస్తూ వాగారు అనుకో మనకు అస్సలు నచ్చదు.
గౌరి: ఇప్పుడు మీరు చేస్తుంది కూడా అదే.
శంకర్: ఇప్పటి వరకు నేను చెప్పింది అర్థం అయింది కదా..?
శ్రావణి, సంధ్య: అర్థమైంది శంకర్ గారు
శంకర్: శంకర్‌గారు, టాగూర్ గారు.. నానక్‌రాం గూడ గారు ఇలాంటి సౌండ్స్ పనికిరావు. ఓకేనా.. ఎస్ సర్.. ఓకే సర్.. అని మాత్రమే పిలవాలి.
శ్రావణి, సంధ్య: ఓకే సార్..
గౌరి: మీరు వెళ్లండి నేను వస్తాను.
సంధ్య, శ్రావణి వెళ్లిపోతారు. శంకర్ చైర్‌లోంచి లేచి గౌరి పక్కన నిలబడతాడు.
గౌరి: అవును మా చెల్లెల్ల దగ్గర అంతలా బిల్డప్ ఇచ్చారు మీ తమ్ముళ్ల దగ్గర కూడా అలాగే ఉంటారా..?
శంకర్: వై నాట్ ఈ శంకర్ అంటే ఏమనుకున్నారు. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అతీతంగా ఉంటాడు. కర్తవ్యం ముందు ఈ శంకర్‌కు అందరూ సమానులే..
గౌరి: ఒక్కమాట అన్నందుకు ఇంత క్లాస్ పీకాలా..? మీకో దండం.
అంటుంది. బయట శంకర్ తమ్ముళ్లు పెద్దొడు, చిన్నొడు వచ్చి శంకర్ ను కలవాలనుకుంటారు. ఎఫ్‌ఎం ఆపి వివరాలు తెలుసుకుని లోపలికి పంపిస్తాడు. వాళ్లను చూసిన గౌరి వీళ్లేంటి ఇక్కడికి వచ్చారు మీరే పిలిపించారా..? అని అడుగుతుంది. లేదని శంకర్ చెప్తాడు. లోపలికి వచ్చిన పెద్దొడు, చిన్నోడు ఇద్దరిని గౌరి తిడుతుంది. ఎందుకు వచ్చారు మళ్లీ మీ అన్నయ్యను అవమానించడానికి వచ్చారా..? అంటూ నిలదీస్తుంది. ఇంతలో రాకేష్ వచ్చి నేనే వీళ్లను తీసుకొచ్చాను అని చెప్తాడు. దీంతో శంకర్ వాళ్లకు జాబ్ ఇస్తాడు. నీ తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇచ్చి నీకు నవ్వే ప్రమాదం కొని తెచ్చుకున్నావు మిస్టర్ ఆర్యవర్థన్ అని మనసులో అనుకుంటాడు రాకేష్. అభయ్, జెండే, అకి, రాకేష్ కారులో వెళ్తుంటారు.
అభయ్: ఏంటి ఫ్రెండ్ అమ్మానాన్నలతో కలిసి ఆఫీసు నుంచి ఏ రెస్టారెంట్ క వెళ్లి డిన్నర్ చేద్దామనుకుంటే మమ్మల్ని ముందే తీసుకొస్తున్నారు.
అకి: నీకింకా అర్థం కాలేదా అన్నయ్యా.. అమ్మా నాన్నలకు ప్రైవసీ క్రియేట్ చేసి వాళ్లిద్దరూ దగ్గర అయ్యేలా చేస్తున్నారు.
అభయ్: ఏ పిల్లలైనా అమ్మా నాన్నల పెళ్లి ఆల్బమ్ చూసి సంతోషిస్తారు. మనం మాత్రం అమ్మానాన్నల పెళ్లి చేయబోతున్నాం.
జెండే: సరే వాళ్లింకా.. టామ్ అండ్ జెర్రీలా గొడవ పడుతూనే ఉన్నారు.
అభయ్: ఆ గొడవలు ఎన్ని రోజులలే ఫ్రెండ్
అనుకుంటూ అందరూ ఇంటికి వస్తారు. ఇంటి ఎదురుగా జోగమ్మ కూర్చుని ఉంటుంది. అందరూ ఆమెకు మొక్కి మీ వల్ల అంతా సవ్యంగా జరుగుతుంది. మీ ప్రేమకు వెలకట్టలేము అంటారు. ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండేలా మమ్మల్ని దీవించమని అడుగుతారు. ఇంతలో జోగమ్మ మీ అమ్మా నాన్నల్లో ఒకరికి గత జన్మ గుర్తుకు రాబోతుందని చెప్తుంది. దీంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. జెండే మాత్రం మీ మాటలు వింటుంటే ఎందుకో కంగారుగా ఉంది. గతజన్మ గుర్తుకు రావడం వల్ల ఎవరికైనా ప్రమాదం ఉందా..? అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!