Prema Entha Madhuram  Serial Today Episode:  చిన్నొడు విదేశాలకు వెళ్లాలనుకుంటున్నట్టు ఆ విషయం యాదగిరి దగ్గర చెప్తారు. ఇదే విషయం మీ అన్నయ్యకు చెప్పారా..? అని యాదగిరి అడగ్గానే చెప్పలేదని చిన్నొడు, పెద్దొడు అనగానే ఇక్కడ ఎవరిని బకరాను చేయాలనుకుంటున్నారు అంటూ తిడతాడు యాదగిరి. ఇంతలో శ్రావణి, సంధ్య వస్తారు. ఏంటి అంకుల్‌ బకరా అంటున్నారు అని అడగ్గానే విషయం మొత్తం యాదగిరి చెప్తాడు. వీళ్లకు ఐర్లాండ్‌కు వెళ్లడానికి ముఫ్ఫై లక్షలు కావాలంటున్నారు అని చెప్పగానే.. శ్రావణి, సంధ్య షాక్‌ అవుతారు. ఇప్పటికిప్పుడు ముప్ఫై లక్షలు అంటే ఎవరిస్తారు అని పెద్దొడు అంటుంటే నేనిస్తాను అంటూ అభయ్‌ వస్తాడు. ఎవరికి కావాలి డబ్బులు అని అడుగుతాడు. చిన్నోడు ఐర్లాండ్‌ వెళ్తున్నాడని పెద్దొడు చెప్పగానే సరే  మీకు ఏం కావాలన్నా మాయ చూసుకుంటుంది అని చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు. ఈ విషయం అన్నయ్యకు చెప్పొద్దు అనగానే అభయ్‌ పలకకుండా వెళ్లిపోతాడు. మరుసటి రోజు మాయ, అభయ్‌ మేడ మీద ఎక్సర్‌సైజ్‌ చేస్తుంటారు. శంకర్‌ వచ్చి చూస్తుంటాడు.


మాయ: శంకర్‌ ఇప్పుడు చూడు నిన్ను ఎలా డిస్టర్బ్‌ చేస్తానో.. అబ్బా..


అభయ్‌: ఏమైంది మాయ..


మాయ: కాలు స్లిప్‌ అయింది అభయ్‌.. చాలా ఫెయిన్‌ గా ఉంది.


అభయ్‌: కాస్త ఓపిక తెచ్చుకో మాయ..


మాయ: కాలు చాలా పెయిన్‌ గా ఉంది అభయ్‌.. నా వల్ల కావడం లేదు.


అభయ్‌: సరే ఒక్క నిమిషం రిలాక్స్‌ గా ఉండు నేను వెళ్లి పెయిన్‌ బామ్‌ తీసుకొస్తాను. గుడ్‌ మార్నింగ్‌ శంకర్‌ గారు నేను ఇప్పుడే వస్తాను తన కాలు స్లిప్‌ అయింది.


మాయ: ఏంటి శంకర్‌ గారు.. మీ అభయ్‌ నా కాళ్లు పట్టుకోవడం చూసి బాగా ఫీల్‌ అయినట్టు ఉన్నారు. దీనికే ఇంత ఫీల్‌ అయితే రేపు ఫీచర్‌ లో వర్దన్‌ ఫ్యామిలీ మొత్తం నా కాళ్ల పట్టుకుంటే నీ కన్నీళ్లు కారిపోతాయేమో. ఇప్పుడు నేనాడే డ్రామా మామూలుగా ఉండదు.


శంకర్‌: ఎవడు తీసుకున్న గొయ్యిలో వాడు పడటం అంటే ఇదేనేమో.. కర్మ.


అభయ్‌: మాయ..


శంకర్‌: ఏంటి అభయ్‌ ఇంత లేటు అసలు పెళ్లి కావాల్సిన అమ్మాయి. పైగా అన్నయ్య కూడా వదిలేశాడు.


మాయ: శంకర్‌ వాంటెడ్‌గా నన్ను టార్చర్‌ చూస్తావా..?


శంకర్‌: వర్దన్‌ ఫ్యామిలీని కాళ్ల దగ్గరకు తెచ్చుకుంటావా..? నాతో పెట్టుకుంటే సినిమా చూపిస్తా..


 అంటూ కిందకు వెళ్తాడు. కింద శంకర్‌ ఎవరితోనో ఫోన్‌ మాట్లాడుతుంటే రవి వచ్చి చూస్తుంటాడు. ఫోన్‌ కట్‌ చేసిన శంకర్‌ ఏంటి రవి అని అడగ్గానే చూస్తూ ఉండు అంటూ అకిని పిలిచి టార్చర్‌ చేస్తాడు. నాకు నువ్వే వంట చేయాలని ఆర్డర్‌ వేస్తాడు. వంట చేస్తున్న అకి చేయి కట్‌ అవుతుంది.  శంకర్‌ బాధపడతాడు. ఇంతలో జెండే వచ్చి ఏం ఆలోచిస్తున్నావు శంకర్‌ అని అడుగుతాడు.



శంకర్‌: జెండే సార్‌ ఫ్లీజ్‌ నన్ను టెన్షన్‌ పెట్టకండి.. అసలే నా బుర్ర జాయింట్‌ వీల్‌ లా తిరుగుతుంది. ఈ రవి సడెన్‌ గా మారతారని నేను కలగన్నానా..? మాయ వచ్చి శపథం చేస్తుందని అనుకున్నానా..?


యాదగిరి: జెండే సార్‌ ఏంటి ఆలోచిస్తున్నారు. ఇక్కడి విషయాలు అక్కడికి చేరవేసేది ఎవరో తెలిసిందా..?


శంకర్‌: ఊరికో బాబాయ్‌ మీరు అడిగిందే పదే పదే అడుగుతారు. మీరు అడిగినా నేను చెప్పలేను..


యాదగిరి: అదేంటి సార్‌ అలా అన్నారు..


జెండే: అంటే శంకర్‌ ఉద్దేశం మాకు తెలిస్తే కదా నీకు చెప్పేది అని


ఇంతలో శంకర్‌ నేను ఆఫీసుకు వెళ్లాలి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు బయట శంకర్‌ కోసం కొంత మంది రౌడీలు శంకర్‌ను వెయిట్‌ చేస్తుంటారు. శంకర్‌ ఆఫీసుకు బయలుదేరగానే.. రౌడీలు ఇన్మఫర్మేషన్‌ ఇచ్చుకుంటారు. శంకర్‌ను ఫాలో అవుతుంటారు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!