Prema Entha Madhuram  Serial Today Episode:  అయోద్యపురంలో సక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరగుతుంటాయి. ముగ్గులు పోటీలు జరుగుతున్న ప్లేస్‌కు అందరూ వెళ్తారు. మరికాసేపట్లో ముగ్గుల పోటీలు ప్రారంభం కాబోతున్నాయి అని మైకులో అనౌన్స్‌ మెంట్‌ వస్తుంది. అభయ్‌ , మాయ నడుచుకుంటూ వస్తుంటారు.


అభయ్‌: మాయ నువ్వు కూడా ముగ్గుల పోటీలో పాల్గొనొచ్చు కదా..?


మాయ: ముగ్గులో దించడమే నా పని అబ్బాయి.. ముగ్గులు వేయడం నాకు రాదు. (అని మనసులో అనుకుంటుంది.) 


అభయ్‌: ఓ సారీ మాయ నీకు ఈ ముగ్గులు అన్ని అలవాటు లేవేమో కదా..? కానీ వచ్చి ఉంటే బాగుండేది. అమ్మాయి ఒక ముగ్గు వేస్తుంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసా..?


మాయ: సరేలే నిన్ను డిసపాయింట్‌ చేయడం ఎందుకు ఒక ముగ్గు వేస్తే సరిపోతుంది. ( అని మనసులో అనుకుంటుంది.) అభయ్‌ నాకు ముగ్గులు రావని ఎవరు చెప్పారు..? నేను కూడా ముగ్గులు వేస్తాను.


అభయ్‌: నిజమా అయితే నీ పేరు కూడా ఇవ్వాల్సిందే.. వెళ్దాం పద..


అని ఇద్దరూ కలిసి వెళ్లి స్టేజీ మీదకు వెళ్లి పేరు రాయిస్తారు. ముగ్గులు తీసుకుని కిందకు రాగానే అకి నవ్వుతూ మాయ కూడా పోటీలో పాల్గొంటుందా..? అని అడుగుతుంది. అవునని చెప్తాడు అభయ్‌. ఇంతలో అక్కడికి నీలకంఠం వస్తాడు. నీలకంఠం రావడం చూసిన అభయ్‌ కోపంగా చూస్తుంటాడు. స్టేజీ మీదకు వెళ్లిన నీలకంఠం కోప్పడుతుంటాడు.


నీలకంఠం: ఏమయ్యా పెద్దమనిషి ఏంటిది..? ఏంటిదని అడుగుతున్నాను..


వ్యక్తి: ముగ్గుల పోటీ అండి..


కోటి: అంటే ఏంటండి ఇది ముగ్గుల పోటీ అని కూడా అర్థం కానంతగా కళ్లు మూసుకుపోయాయి అనుకున్నారా..? మా అయ్యగారికి. లేక మా అయ్యగారేమైనా పని పాట లేని వెధవ అనుకుంటున్నారా..? ఇలాంటి పనికిమాలని ప్రశ్నలు అడుగుతుంటాడు అనుకుంటున్నారా..?


నీలకంఠం: అరేయ్‌ వాళ్లు ఏమీ అనుకోరు కానీ నువ్వు లేనిపోని ఐడియాలు ఇవ్వమాకు.. ఇదిగో పెద్దమనిషి ఇవి ముగ్గుల పోటీలు అని నాకు తెలుసు కానీ.. ఊళ్లో నేనొక పెద్దమనిషిని ఉన్నానని కానీ.. ఈ పోటీల్లో బహుమతులు నా చేతుల మీదుగా ఇస్తున్నామని కానీ మైకులో చెప్పారా..?



వ్యక్తి: ఏంటండి మీ రుబాబు ఇందాకటి నుంచి మీరు ఈ ఊరికి ఏం చేశారని మిమ్మత్ని పెద్దమనిషిగా గుర్తించాలి. ఈ ఊరికి సర్పంచ్‌గా ఉండి మా సొమ్మే దోచుకున్నారు. మీరు బహుమతులు ఇస్తానంటే ఆడవాళ్లు ఎవ్వరూ రారు.


 అంటూ ఆ వ్యక్తి చెప్పగానే నేను కాకుండా ఇక్కడ బహుమతులు ఇచ్చేదెవరు అంటూ నీలకంఠం నిలదీస్తాడు. వర్దన్‌ కుటుంబం వాళ్లు ఇస్తారు. అదిగో వాళ్లు వస్తున్నారు అని చెప్పగానే.. శంకర్‌ వస్తుంటాడు. శంకర్‌ను చూసి నీలకంఠం షాక్ అవుతాడు. అతను అచ్చం ఆర్యవర్థన్‌ లాగే ఉన్నాడని భయపడిపోతాడు. ఇంతలో నీలకంఠం రాకేష్‌ను పిలుస్తాడు. రాకేష్‌ ముగ్గుల పోటీ దగ్గరకు వస్తాడు. రాకేష్‌ను చూసిన శంకర్‌ పూనకం వచ్చినవాడిలా రాకేష్‌ను కింద పడేసి కొడతాడు. రాకేష్‌ కింద పడి గిలాగిలా కొట్టుకుంటుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!