Prema Entha Madhuram  Serial Today Episode: రంగను తీసుకుని శంకర్‌, జెండేలు రాకేష్‌ దగ్గరకు వెళ్తారు. వాళ్లను చూసిన రాకేష్‌ షాక్‌ అవుతాడు. శంకర్‌ కోపంగా రాకేష్‌కు వార్నింగ్‌ ఇస్తాడు. దీంతో ఇప్పుడు నేనేం చేయాలని రాకేష్‌ అడుగుతాడు. మాయకు ఫోన్‌ చేయమని చెప్తాడు శంకర్‌. రాకేష్‌ ఫోన్‌ చేయగానే మాయ ఆ శంకర్‌ చెప్పిన టైంకి ఇంకా మనకు ఏడు నిమిషాలే మిగిలి ఉంది అంటుంది. దీంతో సింబాలిక్‌ గా మనకు ఆ ఏడుపే మిగిలింది అంటాడు రాకేష్‌. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్యా అని మాయ అడుగుతుంది.

జెండే: నిజం మాట్లాడుతున్నాడు మాయ..

శంకర్‌: అబ్బా టైం వేస్ట్‌ చేయకుండా అసలు విషయం చెప్పేయ్‌ రాకేష్‌.

మాయ: వాళ్లు నీ దగ్గరకు ఎందుకు వచ్చారు అన్నయ్యా..?

శంకర్‌: ఇందాక వచ్చినప్పుడు మీ అన్నయ్యకు ఫ్రూట్స్‌ ఇవ్వడం మర్చిపోయాను పాపం పేషెంట్‌ కదా అందుకే ఇచ్చి పోదామని వచ్చాను. మెయిన్‌గా బత్తాయి.

మాయ: ఏంటి జోక్‌ గా ఉందా..? అసలు ఏం జరగుతుంది అన్నయ్యా..?

శంకర్‌: అన్నా చెల్లెల్ల ప్రివ్యూ షో జరుగుతుంది. అవును మాయ నాకు తెలియక అడుగుతున్నాను. నువ్వేదో అవార్డు షోలో అవార్డు ఇచ్చిన్నట్టు కెమెరాకు ఫేవర్‌గా నిలబడి డబ్బులు ఇవ్వడం అవసరమా..? ఇప్పుడు చూడు స్టోరీ మొత్తం రివీల్‌ అయిపోయింది.

మాయ: ఏంటన్నయ్యా వాళ్లు మాట్లాడుతున్నది.

శంకర్‌: మాయ క్వార్టర్స్‌ దగ్గర నువ్వు రంగా చేత మా తమ్ముళ్ల బైకుల్లో మత్తు పదార్థాలు పెట్టించడం. హాస్పిటల్‌ లో డబ్బులు ఇవ్వడం మొత్తం సీసీటీవీ లో రికార్డు అయింది. అదంతా నా ఫోన్‌లో సేవ్‌ చేశాను.

మాయ: వాట్‌ ద హెల్‌..

శంకర్‌: హెల్‌కు తీరుబడిగా వెళ్దువు కానీ వెంటనే రవికి ఫోన్‌ చేసి ఇంటికి రమ్మని చెప్పమ్మా..

మాయ: నేనా..?

శంకర్‌: అబ్బా సినిమా అంతా చూసి విలన్‌ ఎవరు అని అడుగుతుంది ఏంటి సార్‌..?

రాకేష్‌: మాయ వాళ్లు చెప్పింది చేయ్‌..

జెండే: ఇంకోక ఐదు నిమిషాల్లో మా అకి మా ఇంట్లో ఉండాలి.

మాయ: వాళ్లు హాస్పిటల్‌ లో అంతా చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అన్నయ్యా..?

రాకేష్‌: నేనా.. ఇదిగో మత్తు పదార్థాలు పెట్టిన రంగాను స్టేషన్‌లో లొంగిపోమ్మని చెప్తున్నాను. మన పేర్లు బయటకు రాకుండా ఉండాలంటే తప్పదు. నువ్వు రవికి కాల్‌ చేయ్‌.

శంకర్‌: శభాష్‌ అన్నా చెల్లెళ్ల అనుబంధం అంటే ఇలా ఉండాలి.

మాయ రవికి ఫోన్‌ చేసి ఉన్నపళంగా ఇంటికి రమ్మని చెప్తుంది. రవి సరే అంటాడు. ఇంతలో లోపల యాదగిరి దగ్గరకు వెళ్లిన అకి రాత్రికి వంట ఏం చేయమంటారు అని అడుగుతుంది. నాకేం వద్దమ్మా.. ఇంకొద్ది సేపట్లో రవి వచ్చి నిన్ను ఇంటికి తీసుకెళ్తాడమ్మా అని చెప్తుండగానే రవి లోపలికి వచ్చి కంగారుగా అకిని తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు. ఇంతలో యాదగిరికి శంకర్‌ ఫోన్‌ చేసి రవి ఎక్కడున్నాడు అని అడుగుతాడు. ఇప్పుడే అకిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు అని చెప్తాడు. వెంటనే శంకర్‌ సంధ్యకు ఫోన్‌ ఇంకొద్ది సేపట్లో నా తమ్ముళ్లను వదిలేస్తారు వెళ్లి మీరే క్వార్టర్స్‌కు తీసుకురండి అని చెప్తాడు. సరే అని శ్రావణి, సంధ్య లోపలికి వెళ్తారు. రంగ వచ్చి పోలీసులకు లొంగిపోతాడు. తర్వాత చిన్నోడు, పెద్దొడు, సంధ్య, శ్రావణి క్వార్టర్స్‌ కు వెళ్తారు.

శ్రావణి: మీ అన్నయ్యకు కూడా మీ ప్రేమ గురించి అర్థం అయినట్టు ఉంది.

పెద్దోడు: ఒకవేళ మా అన్నయ్య అర్థం చేసుకుని వీళ్ల ప్రేమకు ఓకే చెప్పినా..? మీ అక్కా ఒప్పుకోకపోతే.. వీళ్ల ప్రేమ విషయం చెప్పడం వల్ల మా అన్నయ్యకు గౌరి గారికి గొడవ అయితే.. అప్పుడు పూర్తిగా దూరం అయ్యే పరిస్థితి వస్తుంది.

అంటూ పెద్దోడు భయపడగానే సంధ్య ఏడుస్తూ వెళ్లిపోతుంది. శ్రావణి కూడా వెళ్లిపోతుంది. చిన్నోడు ఎమోషనల్‌ అవుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

   

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!