Prema Entha Madhuram  Serial Today Episode:   అకి, అభయ్‌ అనురాధ, ఆర్యవర్థన్‌ ల ఫోటోలు తీసుకొచ్చి హాల్ లో పెడతారు.   ఆ ఫోటోలో ఉన్నది మీరే కదా శంకర్‌ అని ఓనరు అడగ్గానే కాదు అకి, అభయ్‌ వాళ్ల నాన్న అనురాధ, ఆర్యవర్ధన్‌ అని అచ్చం మాలాగే ఉన్నారు అనుకుంటున్నావా..? అంటే అవునని ఓనరు చెప్పగానే కాదు వాళ్లే మేము..మేము వాళ్లు అంటాడు శంకర్‌.  అర్థం కాలేదు కదా..? నాది గౌరిది జన్మజన్మల బంధం మా ప్రేమను మళ్లీ బతికించుకోవడానికి పుట్టాము అని శంకర్‌ చెప్పగానే.. ఓనరు ఈ విషయం నాకు ముందే తెలుసు అని జెండేకు చెప్పగానే  తెలిస్తే తెలియని కానీ ఆ విషయం శంకర్‌కు చెప్పోదు అని వార్నింగ్‌ ఇస్తారు. ఇంతలో శంకర్‌ పొట్టోడు నమ్మేశాడు అని జెండే సార్‌ మీరు చెప్పండి అనగానే


జెండే: అనురాధ, ఆర్యవర్థన్‌ ప్రేమ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. వాళ్లు ఒకరి కోసం ఒకరు బతికారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఒకరి గురించి ఒకరు త్యాగాలు చేశారు. దూరాన్ని భరించారు. చివరికి చావులో కూడా ఒకరికొకరు తోడుగా నిలిచారు. అందుకే వాళ్ల ప్రేమకు చావు లేదు. అనురాధ, ఆర్యవర్థన్‌ ల ప్రేమ అమరం.


 అని చెప్తూ జెండే ఎమోషనల్‌ అవుతాడు. అకి, అభయ్‌, రవి యాదగిరి కూడా ఎమోషనల్‌ అవుతారు. మరోవైపు గౌరిని దాచిన ప్లేస్‌కు వెళ్లిన రాకేష్‌ రౌడీలను పట్టుకుని ఆ ఆర్యవర్థన్‌ ఇంట్లో ఏం జరుగుతుంది అని కోపంగా తిడుతుంటాడు. అసలు ఏం ప్లాన్‌ చేస్తున్నావు శంకర్‌ అంటూ కోప్పడతాడు. మరోవైపు అందరూ ఎమోషనల్‌లో ఉండగా..


ఓనరు: వాహ్‌ వాట్‌ ఏ గ్రేట్‌ లవ్‌ మీ గురించి వింటుంటే ఒళ్లు పులకరించి పోతుంది. మీ ప్రేమ గొప్పది. అందుకే మళ్లీ పునర్జన్మ ఎత్తారు. శంకర్‌ మరి నేను వెళ్లి వస్తాను.


శంకర్‌: ఏమోద్దు ఇక్కడే ఉండు.


ఓనరు: అబ్బా మళ్లీ ఏమైంది శంకర్‌.. నేను వెళ్లొద్దా..?


శంకర్‌: మాప్రేమ గురించి ఎవ్వరికీ తెలియనక్కర లేదు. మీరు ఇక్కడే ఉండాలి.


ఓనరు: నేను ఎందుకు వెళ్లకూడదు.


శంకర్‌: ఎందుకంటే ఇది నీ ఇల్లు అవును ఇది నీ ఇల్లే.. ఈ ఇంటి మీద నీకు సర్వ హక్కులు ఉన్నాయి.


ఓనరు: శంకర్‌ ఏం మాట్లాడుతున్నావు. నేను ఈ ఇంటికి ఓనరు ఏంటి అని అడుగుతాడు.


శంకర్‌: మేము పునర్జన్మ ఎత్తినట్టు నువ్వు నమ్ముతున్నావు కదా..? అయితే మేము ఎందుకు మీ ఇంట్లోనే రెంట్‌కు ఉన్నాము. మీకు మాకు ఏదో సంబంధం ఉంది.


జెండే: గౌరి, శంకర్‌లు ఎలాగైతే పునర్జన్మ ఎత్తారో మీరు కూడా పునర్జన్మ ఎత్తారు.


ఓనరు: నేను పునర్జన్మ ఉందా..? అసలు ఏంటిదంతా..?


శంకర్‌: ఎందుకంటే మీరు గత జన్మలో ఈ కుటుంబానికి అంతటికీ మీరు పెద్ద..


జెండే: గత జన్మలో శంకర్‌, గౌరిలు అను, ఆర్యవర్ధన్‌ అయితే మీరు గత జన్మలో ద గ్రేట్‌ భూపతి రాజా.


 అంటూ చెప్పగానే ఓనరు షాక్‌ అవుతాడు. మీకే తెలియకుండా మీ కుటుంబానికి దగ్గరయ్యారు అని జెండే చెప్పగానే ఓనరు నో అంటూ ఆరుస్తాడు. నేను అసలు నమ్మను అంటాడు. దీంతో మీరు నమ్మరని తెలిసే ఫ్రూప్స్‌ అన్ని రెడీ చేయించాను అని ఓనరును పక్కకు తీసుకెళ్లి శంకర్‌ రెడీ చేయించిన భూపతి రాజా లా ఉన్న ఓనరు ఫోటోను చూపిస్తాడు.  ఫోటో చూసిన ఓనరుతో పాటు అందరూ షాక్‌ అవుతారు. నేను గత జన్మలో భూపతిరాజానా..? అని ప్రశ్నిస్తాడు. అవునని శంకర్‌ చెప్పగానే యాదగిరి రాజా భూపతి రాజా గారికి జై అంటాడు. శంకర్‌ తన మాటలతో పొగుడుతుంటాడు. ఇంతలో ఓనరు కళ్లు తిరిగి కింద పడిపోతాడు. మరోవైపు గౌరి తప్పించుకుని పారిపోతుంటే రాకేష్‌ వచ్చి కొట్టి మళ్లీ కట్టేస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!