Prema Entha Madhuram  Serial Today Episode:    తన వల్ల రెండు కుటుంబాల్లో డిస్టబెన్స్‌ రాకూడదని అందుకే వెళ్లిపోతున్నానని రవి ఫోన్‌ కట్‌ చేస్తాడు. అకి బాధపడుతుంది. మరోవైపు పెద్దడిని, చిన్నొడిని కలుస్తాడు రాకేష్‌. ఎందుకు రమ్మన్నారని రాకేష్‌ను అడుగుతారు. ఫస్ట్‌ రోజు ఆఫీసు ఎలా ఉందని అడుగుతాడు రాకేష్‌. మా అన్నయ్య ఉండటం వల్ల వర్క్‌ మీద ఫోకస్‌ చేయలేకపోతున్నామని చెప్తారు అయితే మిమ్మల్ని ముంబై ఆఫీసుకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తానని కానీ కొంత అసైన్‌ మెంట్‌ చేయాలని చెప్తాడు. ఇది పూర్తి అయ్యే వరకు ఎవ్వరితో చెప్పకూడదని ప్రామిస్‌ తీసుకుంటాడు. ఇక మీరేం చేయాలో చెప్తాను అని దీంతో మీ బ్రదర్‌ ‌పని పినిష్‌ అని మనసులో అనుకుంటాడు రాకేస్‌. మరోవైపు అకిని భోజనానికి తీసుకొస్తుంది గౌరి.


జెండే: చూశావా యాదగిరి టైం కు తినాలని అమ్మ కూతురుకు చెప్పి బలవంతంగా తీసుకొస్తుంది.


అకి: ఫ్రెండ్‌ శంకర్‌ గారు రాలేదా…?


యాదగిరి: నేను పిలిచాను అమ్మా ఒక ఐదు నిమిషాల్లో వచ్చేస్తారు. అదిగో వచ్చారు.


అభయ్‌: శంకర్‌ గారు ఇంటి పెద్ద ఇక్కడ కూర్చోవాలి. ఇది మీ సీటు.


శంకర్‌: ఇంటి పెద్ద  జెండే గారు కదా ఆయన కదా ఇక్కడ కూర్చోవాల్సింది. నన్ను కూర్చోమంటావేంటి…


జెండే: శంకర్‌ నువ్వు కంపెనీ చైర్మన్‌ కదా అందుకే నువ్వు అక్కడ కూర్చోవాలి.


అని శంకర్‌ ను ఆ సీట్లో కూర్చోబెట్టి అందరూ తింటుంటారు. ఇంతలో అభయ్‌ గౌరిని అమ్మా ఫస్ట్‌ డే ఆఫీసు ఎక్స్‌ ఫీరియన్స్‌ ఎలా ఉంది. అని అడగ్గానే అందరూ షాక్‌ అవుతారు.  


అభయ్‌: సారీ అండి ఏంటండి అనబోయి అమ్మా అని వచ్చేసింది.


గౌరి: పొరపాటున పిలిచినా వినడానికి చాలా బాగుంది అభయ్‌.


జెండే: అమ్మా గౌరి ఒక్కరోజు ఆఫీసు వర్క్‌ కే అలసిపోయావా..? చాలా టైడ్‌ గా కనిపిస్తున్నావు.


గౌరి: అలాంటిదేం లేదు సార్‌. వైస్‌ చైర్మన్‌ పోస్ట్‌ కొత్త కదా.. కాస్త హెడేక్‌ గా అనిపిస్తుంది.


జెండే: ఏంటమ్మా గౌరి నువ్వేంటి తినకుండా ఆలోచిస్తున్నావు..


శంకర్: కారులో జరిగిన దానికి ఫీలయినట్టు ఉందండి.


అభయ్‌: ఏం జరిగింది.


శంకర్‌: కారు అలా రోడ్డు మీద స్పీడుగా వెళ్తుంటే.. స్పీడు బ్రేకర్‌ వచ్చింది. గౌరి గారు వెంటనే..


గౌరి: స్పీడు బ్రేకర్‌ వేయగానే నేను ముందుకు పడ్డాను. శంకర్‌ గారు నవ్వారు నాకు కోపం వచ్చింది.


అని చెప్పగానే శంకర్‌ డల్లుగా చూస్తుంటాడు. ఇంతలో అకి ఏమీ తినకుండా..? ఆలోచిస్తుంది. గౌరి ఎందుకు తినడం లేదని అడుగుతుంది. అకి ఎందుకు తినడం లేదో నాకు తెలుసు అని శంకర్‌ మనసులో అనుకుని అభయ్‌ని నాకోసం ఒక పని చేయాలని అడుగుతాడు. ఏంటని అభయ్‌ అడగ్గానే రవిని నాకు పర్సనల్‌ పిఏగా అపాయింట్‌ చేయమని అడుగుతాడు. సరే అంటాడు అభయ్‌. దీంతో అకి హ్యాపీగా భోజనం చేస్తుంది. తర్వాత యాదగిరి ఒంటరిగా ఇంటికి వెళ్లడం చూసిన రాకేష్‌ చంపడానికి వెళ్తాడు. ఇంతలో తెలిసిన వ్యక్తి వచ్చి యాదగిరిని పికప్‌ చేసకుని వెళ్తాడు. మరుసటి రోజు అకి దేవుడికి మొక్కుతుంటే అభయ్‌ వస్తాడు.


అభయ్‌: అకి దేవుడికి మొక్కి మొక్కి అమ్మానాన్నలను ఇంటికి వచ్చేలా చేశావు. వాళ్లు కంపెనీ బాధ్యతలు తీసుకునేలా చేశావు. మళ్లీ ఎందుకు మొక్కుతున్నావు.


జెండే: ఇంకేముంది. అమ్మానాన్నలకు పెళ్లి జరగాలని..


అకి: ఆ కోరిక కూడా ఉంది అనుకోండి. కానీ ఇవాళ మనకు స్పెషల్‌ డే.. మొన్న జోగమ్మ ఏం చెప్పిందో గుర్తు ఉందా..?


అభయ్: ఓ ఎస్‌ అమ్మా నాన్నలల్లో ఎవరో ఒకరికి గతం గుర్తుకు వస్తుందని చెప్పింది కదా..?


అకి: అవును అమ్మా నాన్నాల్లో ఎవరికి గుర్తుకు వస్తుందో మనల్ని  ఎలా రిసీవ్‌ చేసుకుంటారో.. అసలు అమ్మా నాన్న ఎలా ఫీలవుతారో అని చాలా క్యూరియాసిటీగా ఉంది నాకు


అభయ్‌: అమ్మకు గుర్తుకు వస్తే.. ఇక మనల్ని అసలు విడిచిపెట్టదు.


అకి: నాన్నకు గుర్తుకు వచ్చిన కూడా చాలా సర్‌ఫ్రైజ్‌ అవుతారు.


అని అందరూ మాట్లాడకుంటూ మనం అనుకోవడం కాదు విధి ఏం డిసైడ్‌ చేసిందో అనుకుంటారు. ఈరోజంతా అమ్మా నాన్నలతో ఉండటానికి ట్రై చేద్దామని అనుకుంటారు. మరోవైపు గౌరి, శంకర్‌ లు కారులో జరిగిన ఇన్సిడెంట గుర్తు చేసుకుంటారు. గౌరి మాత్రం శంకర్‌ కన్నా ముందే ఆఫీసుకు వెళ్లాలనుకుంటుంది. శంకర్‌ మాత్రం గౌరితో సేమ్‌ కారులో సేమ్‌ ఇన్సిడెంట్‌ జరగాలని కోరుకుంటాడు.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!