Prema Entha Madhuram  Serial Today Episode: గౌరి వాళ్లను హరాస్మెంట్‌ చేస్తున్నావని వెంటనే ఇల్లు ఖాలీ చేయాలని లేందంటే పోలీస్‌ కేసు పెడతానని  ఓనరు వచ్చి శంకర్‌ను బెదిరించడంతో శంకర్‌ కోపంగా ఇంటి ఓనరును  కొడతాడు. దీంతో ఓనరును కొట్టోద్దని గౌరి, శంకర్‌ ను బతిమాలుతుంది. అయితే ఈ ఇంటికి ముందు  వచ్చింది నేను వెళ్లాల్సి వస్తే వాళ్లు వెళ్లాలి కానీ నేను వెళ్లను అంటూ శంకర్‌ వార్నింగ్‌ ఇవ్వగానే  నేను మరింత శక్తితో తిరిగి వస్తానని వెళ్లిపోతాడు...  ఓనరు వెళ్లిన తర్వాత ముగ్గురు  అక్కాచెళ్లెల్లు, ముగ్గురు అన్నదమ్ములు మళ్లీ గొడవ పడతారు. మరోవైపు రాకేష్‌ ఎవరికో ఫోన్‌ చేసి అకి ఎక్కడికి వెళ్లిందో కనుక్కున్నావా? అని అడిగితే అకి ఈవెంట్‌  అర్గనైజర్స్‌ గౌరి, శంకర్‌ ల దగ్గరకు వెళ్లిందని చెప్తాడు. ఇంతలో లోపల అభయ్‌ అకిని పిలుస్తూ కిందకు వస్తాడు.

జెండే: అకి ఇప్పుడే బయటకు వెళ్లింది అభయ్‌.

అభయ్‌: నాతో షాపింగ్‌ కు వెళ్లాలని చెప్పింది. ఇంతలో ఎక్కడికి వెళ్లింది.

జెండే: అది తను.. ( రాకేష్‌ లోపలికి రావడం చూసి ) ఏమో నాకు కూడా తెలియదు.

అభయ్‌: ఏంటి ఫ్రెండ్‌ అకి మీతో చెప్పకుండా ఎక్కడికీ వెళ్లదు. అది నాకు తెలుసు.

జెండే: నిజంగా తెలియదు అభయ్‌

రాకేష్‌: అభయ్‌.. జెండె అంకుల్‌ కు తెలియదు. అకి ఇప్పుడే కంగారుగా ఎక్కడికో వెళ్లింది. జెండే అంకుల్‌ ఇక్కడే ఉన్నారనుకో అయినా కూడా తెలియదు  అనుకుంటా?

అభయ్‌: ఏంటి ఫ్రెండ్‌  ఈ మధ్య నువ్వు అకి నా దగ్గర ఏదో దాస్తున్నారు. అది నాకు అర్థం అవుతుంది. కానీ ఎందుకో ఏంటో నాకు తెలియడం లేదు.

   అని అభయ్‌ బాధపడితే అదేం లేదని జెండే చెప్పగానే రాకేష్‌ తన మాటలతో అభయ్‌‌ ని రెచ్చగొడతాడు. దీంతో జెండే అభయ్‌‌ కి సర్ది చెప్పి రాకేష్‌‌ కు వార్నింగ్‌ ఇస్తాడు. నేను అభయ్‌‌ తో పర్సనల్‌ గా మాట్లాడాలని రాకేష్‌ ను బయటకు పంపించి అభయ్‌ కి జాగ్రత్తలు  చెప్తాడు జెండే. తర్వాత అభయ్‌ వెళ్లిపోతాడు. వీలైనంత త్వరగా రాకేష్‌‌ ను అభయ్‌ కి దూరం చేయాలని అనుకుంటాడు. మరోవైపు అకి కోసం ఎదురుచూస్తున్న యాదగిరి లోలపి నుంచి సామాన్లు తన మీద పడుతుంటే ఇబ్బంది పడతాడు. ఇంతలో అకి వస్తుంది.   

అకి: మామయ్యా ఇక్కడ బయట ఏం చేస్తున్నారు. లోపలికి వెళ్లి సర్ది చెప్పొచ్చు కదా?

యాదగిరి: వచ్చావా? తల్లి. ఇంకా నయం వీళ్ల చేతకి రోళ్లు రోకళ్లు దొరకలేదు. చచ్చి ఊరుకునే వాడిని.

అకి: మరీ ఇంత గొడవా?

యాదగిరి: అలా అడుగుతావేమ్మా…?

 అని యాదగిరి చెప్పగానే ఇంతలో ఇంటి ఓనరు వస్తాడు. శంకర్‌‌ ను తిడుతుంటే అకి ఓనరును తిట్టి కాలుతో తన్నుతుంది. ఇంతలో ఇంటి ఓనరు తీసుకొచ్చిన కిరాయి రౌడీలు ఫైటింగ్‌  చేయడానికి వస్తారు వాళ్లందరూ 60 ఏండ్ల ముసలొళ్లు ఉంటారు. దీంతో శంకర్‌ వాళ్లకు నమస్తే  తాతయ్యలు అంటాడు. దీంతో ఓనరు వాళ్లు తాతయ్యలు కాదు నిన్ను కొట్టడడానికి వచ్చిన రౌడీలు అని చెప్పి  ఇంకా  చూస్తారేం కానివ్వండి అంటాడు. దీంతో ముసలాయన దగ్గుతూ, వణుకుతూ శంకర్‌ దగ్గరకు వెళ్లి వార్నింగ్‌  ఇస్తుంటారు. శంకర్‌ నవ్వుకుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: దిల్ ధడక్నే దో To హమ్ సాత్ సాత్ హై- రాఖీ రోజు చూడాల్సిన బాలీవుడ్ బెస్ట్ మూవీస్ ఇవే!