Prema Entha Madhuram Serial Today Episode: ఇంటి ఓనరును ట్రాప్ చేయడానికి శంకర్ చిన్నొడితో అమ్మాయి వేషం వేయిస్తాడు. ఓనరు రావడం చూసి వాడు వస్తున్నాడు నువ్వు వెళ్లి వాడిని ప్లాట్ చేయి వెళ్లు అని చెప్తాడు. లేడీ గెటప్‌లో ఉన్న చిన్నొడు వెళ్తాడు. చెట్టు చాటుకు వెళ్లిన శంకర్ కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేస్తాడు.
ఓనరు: ఇదేదో కొత్త నెంబర్ లా ఉందే..? చూద్దాం.. హలో..
శంకర్: నమస్తే సార్.. నేను ఫ్రూట్ స్వామిని సీతా ఫలాల జాతక చక్రం నుంచి మాట్లాడతున్నాను.
ఓనరు: ఏంటి ఫ్రూట్ స్వామా..? సీతా ఫలాల జాతకచక్రం నుంచా..?
శంకర్: అవును స్వామి.. ఈ రోజు మీ జాతక చక్రం ఎలా ఉండబోతుందో చెప్పడానికి ఫోన్ చేశాను.
ఓనరు: అవునా ఎలా ఉండబోతుంది.
శంకర్: మీ గ్రహసంచారం ప్రకారం మీ మీద ఇవాళ మన్మథుడి ప్రభావం పడబోతుంది.
ఓనరు: మన్మథుడి ప్రభావమా..? అంటే
శంకర్: అంటే ఒక అందాల రాశి మీకు అనుకోకుండా తారసపడుతుంది. తన రాకతో మీ జీవితంలో ప్రేమ తలుపులు గబుక్కున్న తెరుచుకుంటాయి.
ఓనరు: ఏయ్ ఊరుకోవయ్యా ఈ వయసులో ప్రేమ తలుపులు తెరుచుకోవడం ఏంటి..?
యాదగిరి: అవునురా.. నీకు నరకం తలుపులు తెరుచుకుంటాయి దరిద్రుడా..?
శంకర్: అంటే ప్రేమకు వయసుతో సంబంధం లేదని చాలా మంది చెప్తుంటారు కదండి. ముఖ్యంగా మీకు ఇవాళ బ్లూ అండ్ పింక్ బాగా కలిసి వస్తాయి.
ఓనరు: హలో హలో ఫోన్ చేసి ఏదేదో చెప్పి పెట్టేస్తాడేంటి..? అయినా మనకు అమ్మాయిలు ఎక్కడ పడతారు. ఇవన్నీ నమ్మకూడదు.
అనుకుంటూ నడుచుకుంటూ వెల్లిపోతుంటే లేడీ గెటప్‌లో ఉన్న చిన్నొడు వచ్చి డాష్ ఇస్తాడు. కింద పడిపోతుంటే.. ఓనరు పట్టుకుంటాడు. అది చూసిన శంకర్ బాబాయ్ ఓనరు గాడు సగం ప్లాట్.. అంటాడు. చిన్నొడితో రొమాంటిక్ గా మాట్లాడుతుంటాడు. దీంతో శంకర్ బాబాయ్ మన ఎంట్రీకి టైం వచ్చింది పద అంటాడు. ఇద్దరూ కలిసి ఓనరు దగ్గరకు వెళ్లారు.
శంకర్: ఇదిగో టాంకరు..
ఓనరు: ఏంటయ్యా శంకరు అయినా నువ్వు కూడా ఇప్పుడే రావాలా..? ఏంటి ఈ అరుపులు.
శంకర్: ఇవి అరుపులు కాదు.. ఆర్తనాదాలు. అవును ఇంతకీ గౌరి గారిని. వారి సిస్టర్స్‌ను ఎక్కడ దాచావో చెప్పు బాబు. అవతల మా తమ్ముళ్లు ఇద్దరూ విల విల వల వల ఏడుస్తున్నారు.
ఓనరు: ఏడిస్తే ఏడవని గంగలో దూకి చావని నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి. పోండి. ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు.
చిన్నొడు: శీలా..?
యాదగిరి: ఏవండి ఇక్కడ మా సారు మాట్లాడుతుంటే పట్టించుకోరేంటి.. ఇంతకీ ఈవిడ ఎవరు..?
శంకర్: చూస్తే తెలియడం లేదా బాబాయ్ మనవరాలు అయ్యుండొచ్చు..
ఓనరు: మనవరాలు ఏంటి మనవరాలు.. అయినా నాకు మనవరాలు ఉండేంత ఏజ్ ఉందా..? అయినా నా గురించి మీకెందుకు..? వాళ్లు ఎక్కడున్నారో నేను చెప్పను.
శంకర్: అబ్బ అలా అంటే ఎలా ట్యాంకరూ.. చెప్పు ప్లీజ్..
ఓనరు: ఆ రాకేషేమో మీరు నన్ను బయపెట్టి ట్రాప్ చేశారన్న బ్రమలో ఉన్నాడు. మీరేమో నా దగ్గరకు వచ్చి బతిమాలుతున్నారు. మీరు బతిమాలినా చెప్పను.. కాళ్లు పట్టుకున్నా చెప్పను.
శంకర్: ప్లీజ్ అలా అనకండి పాప మీ తాతగారికి నువ్వైనా చెప్పమ్మా..
చిన్నొడు: వాట్ నాన్‌సెన్స్ ఆయన నాకు తాతగారేంటి..? ఆయన ఎవరనుకున్నారు. మై భాయ్ ఫ్రెండ్..
అని చెప్పగానే ఓనరు హ్యాపీగా ఫీలవుతాడు. ఇంతలో శంకర్, యాదగిరి ఇద్దరూ కలిసి ఓనరుకు ఇరిటేషన్ వచ్చేలా చేస్తారు. ఇంతలో చిన్నొడు బై చెప్పి వెళ్లిపోతాడు. శంకర్ ఎంత అడిగినా ఓనరు నిజం చెప్పకుండా వెళ్లిపోతాడు. తర్వాత శంకర్ ఇంట్లో ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయపడుతుంటాడు. మరోవైపు అకి తనకు స్వీట్స్ కావాలని అడగ్గానే అభయ్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తాడు. స్వీట్స్ తీసుకుని వస్తున్న డెలివరీ బాయ్‌ని రాకేష్ అడ్డగించి యాక్సిడెంట్ చేసి స్వీట్స్ లో పాయిజన్ కలుపుతాడు. తర్వాత అవే స్వీట్స్ ఇంటికి రాగానే అకి తినబోతుంది. శంకర్ అనుమానంగా చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!